వ్యవసాయంలో వినియోగిస్తున్న సూక్ష్మసేద్య పరికరాలు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో తూనికలు కొలతల శాఖ సీఐ శంకర్ సీజ్ చేశారు.
– గోదాముపై తూ.కో అధికారుల దాడులు
అనంతపురం సెంట్రల్ : వ్యవసాయంలో వినియోగిస్తున్న సూక్ష్మసేద్య పరికరాలు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో తూనికలు కొలతల శాఖ సీఐ శంకర్ సీజ్ చేశారు. బుధవారం బుక్కరాయసముద్రం మండల పరిధిలోని కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని నెటాఫిమ్, ఎంటెల్ కంపెనీలకు చెందిన గోదాములపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. వీటిలో తయారిదారుని చిరునామా, ఇతర వివరాలేమి లేకుండా తయారై వచ్చిన వస్తువులను అధిక రేట్లకు రైతులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సాల్వెంట్ సిమెంట్ ప్యాకెట్లు, ప్రెజర్‌గేజ్ మీటర్లు, వాల్వ్‌లు తదితర వాటిని సీజ్ చేసినట్లు సీఐ శంకర్ తెలిపారు.