sprinkler
-
ఛీ!.. ఇలానా కొబ్బరి బోండాలు విక్రయించేది..వీడియో వైరల్
ఈ వేసవిలో దాహార్తిని తీర్చడానికి కొబ్బరి బోండాలకు సాటి ఏదిరాదు. అలాంటి కొబ్బరి బోండాలు అనారోగ్యంగా ఉన్నప్పుడూ, లేదా పండగలు, శుభాకార్యాల్లోనే ఎంతగానో వినియోగిస్తాం. ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలా మంది కొబ్బరి బోండాలనే ప్రివర్ చేస్తుంటారు. కూల్‌డ్రింక్స్‌కి బదులు ఇవే ఆరోగ్యానికి మంచిదని వాటికే ప్రాధాన్యత ఇస్తారు చాలామంది. ఐతే ఈ వీడియో చూశాక కచ్చితంగా ఓపినియన్ మారిపోవడమే గాక తాగేందుకు భయపడతాం కూడా. ఆఖరికి కొబ్బరి బొండాలను కూడా ఇలా కలుషితం చేసి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అని విస్మయం కలిగిస్తుంది ఈ వ్యక్తి చేసిన పని. ఆ వీడియోలో కొబ్బరి బోండాలను అమ్మే వ్యక్తి తన బండిపై ఉన్న లేత కొబ్బరి బోండాలపై డ్రైయిన్ వాటర్ చల్లుతున్నట్లు కనిపిస్తుంది. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సదరు వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందని 28 ఏళ్ల సమీర్‌గా గుర్తించారు. #Watch | Vendor sprinkling drain water on coconuts. Noida Police caught after video viral on social media#Noida #viralvideo #Coconuts #News18JKLH pic.twitter.com/ZhuXEYCylz — News18 Kashmir (@News18Kashmir) June 6, 2023 (చదవండి: అభిమానానికి హద్దులు లేవంటే ఇదేనేమో!.. ఓ వ్యక్తి ధోనిపై ఉన్న ప్రేమను..) -
సూక్ష్మసాగులో ‘అనంత’కు అగ్రస్థానం
అనంతపురం అగ్రికల్చర్ : సూక్ష్మ సాగు (డ్రిప్, స్ప్రింక్లర్లు) విస్తరణలో ఈ ఏడాది రాష్ట్రంలోనే అగ్రస్థానం సాధించామని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) పీడీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఆయన స్థానిక ఏపీఎంఐపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం ఆఖరి రోజు (శుక్రవారం) ‘అనంత’ కన్నా చిత్తూరు కాస్త ముందంజలో ఉండగా.. అర్ధరాత్రికి అధిగమించి అగ్రస్థానం చేరామన్నారు. చివరి రోజు ఒక్కరోజే దాదాపు 1,500 హెక్టార్లకు మంజూరు ప్రక్రియ పూర్తి చేశామన్నారు. సిబ్బంది కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. మంజూరు చేసిన రైతుల పొలాల్లో యూనిట్లు అమర్చే కార్యక్రమం వేగవంతం చేస్తామన్నారు. మొత్తమ్మీద 2016–17 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 27,357 హెక్టార్లకు మంజూరు చేసి టాప్‌లో నిలవగా.. తర్వాతి స్థానాల్లో చిత్తూరు (26,781 హెక్టార్లు), వైఎస్సార్ జిల్లా (25,427 హెక్టార్లు), కర్నూలు (14,263 హెక్టార్లు) ఉన్నాయన్నారు. -
సూక్ష్మ సేద్య పరికరాలు సీజ్
– గోదాముపై తూ.కో అధికారుల దాడులు అనంతపురం సెంట్రల్ : వ్యవసాయంలో వినియోగిస్తున్న సూక్ష్మసేద్య పరికరాలు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో తూనికలు కొలతల శాఖ సీఐ శంకర్ సీజ్ చేశారు. బుధవారం బుక్కరాయసముద్రం మండల పరిధిలోని కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని నెటాఫిమ్, ఎంటెల్ కంపెనీలకు చెందిన గోదాములపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. వీటిలో తయారిదారుని చిరునామా, ఇతర వివరాలేమి లేకుండా తయారై వచ్చిన వస్తువులను అధిక రేట్లకు రైతులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సాల్వెంట్ సిమెంట్ ప్యాకెట్లు, ప్రెజర్గేజ్ మీటర్లు, వాల్వ్‌లు తదితర వాటిని సీజ్ చేసినట్లు సీఐ శంకర్ తెలిపారు. -
యువ కృషీవలురు!
మేడ్చల్: ఒకప్పుడు రియల్ ఎస్టేట్ మాయాజాలంలో పడి వ్యవసాయానికి దూరమైన నగర శివారు ప్రాంత రైతులు ప్రస్తుతం సేద్యంపై దృష్టిసారించారు. పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తూ ఆశించిన దిగుబడులు సాధిస్తున్నారు మండలంలోని రాయిలాపూర్ యువ రైతులు. కూరగాయలు, ఆకుకూరల పంటల సాగులో డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలను ఉపయోగిస్తూ తక్కువ నీటితో ఎక్కువ పంటలు సాగు చేస్తున్నారు. రాయిలాపూర్‌లో దాదాపు 200 ఎకరాల్లో పలు రకాల కూరగాయలు, ఆకుకూరల పంటలు సాగవుతున్నాయి. గ్రామంలోని 100 మంది రైతుల్లో 50 మంది యువకులే ఉండటం.. వ్యవసాయంపై వారికి ఎంత మక్కువ ఉందో అర్థమవుతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి.. కూలీలపై ఆధారపడకుండా కు టుంబ సభ్యులే ఆకుకూరలను కట్టలుగా తయారు చేస్తున్నారు. కూరగాయలను కోసి గంపల్లో వేసి నగరంలోని వివిధ మార్కెట్లకు తరలిస్తున్నారు. చిన్న రైతులు చిరు వ్యాపారులకు పొలం వద్దనే విక్రయిస్తున్నారు. మరికొంత మంది మేడ్చల్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రైతేరాజు అని నిరూపిస్తున్నారు. -
సబ్సిడీ సగమే
గుర్రంపోడు :స్ప్రింక్లర్లపై రైతులకు ఇచ్చే రాయితీలో ప్రభుత్వం సగానికిసగం కోత విధించింది. గతంలో 90 శాతం ఉన్న సబ్సిడీని ఈ ఏడాది 50 శాతానికి కుదించింది. వాస్తవానికి మూడేళ్లుగా మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా స్ప్రింక్లర్ల సరఫరా నిలిపివేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఖరీఫ్‌లో మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా స్ప్రింక్లర్ల పంపిణీకి పూనుకుంది. సబ్సిడీ స్ప్రింక్లర్లు పొందేందుకు గతంలో 90 శాతం రాయితీ పోగా, మిగతా పదిశాతం రైతులు చెల్లించేవారు. ఇప్పుడు 50 శాతం రైతులే చెల్లిం చాలి. ఒక్కో స్ప్రింక్లర్ యూనిట్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.19,600. స్ప్రింక్లర్లు తీసుకుంటే డ్రిప్ ఉండదు మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు నిబంధనల ప్రకారం ఒక్కోరైతుకు గరిష్టంగా రూ.లక్ష విలువ గల పరికరాల వరకు రాయితీపై పొందే వీలుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం రైతు స్ప్రింక్లర్లు, డ్రిప్‌లలో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి. స్ప్రింక్లర్లు పొందే రైతులకు సుమారు 10 వేల రూపాయల వరకు మాత్రమే రాయితీ వర్తిస్తుండగా, భవిష్యత్‌లో పదేళ్ల వరకు డ్రిప్ పొందే అవకాశం కోల్పోతాడు. స్ప్రింక్లర్లు తీసుకున్న రైతుకు మిగతా 90 వేల విలువకు కూడా రాయితీపై డ్రిప్ పరికరాలు పొందే అవకాశం కూడా లేదు. దీంతో ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల స్ప్రింక్లర్ల పరికరాలకు డిమాండ్ ఉన్నా, డ్రిప్ అవకాశం కోల్పోతామనే ఆందోళన రైతుల్లో నెలకొంది. నిబంధనలు సడలించి రైతుకు గరిష్టంగా నిర్ణయించిన రాయితీ పరిమితికి లోబడి స్ప్రింక్లర్లు, డ్రిప్ రెండింటిని పొందే అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు. స్ప్రింక్లర్లు, డ్రిప్ దరఖాస్తుల స్వీకరణకు కేంద్రాలు మైక్రోఇరిగేషన్ అధికారులు జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకంగా ఒక అధికారిని కేటాయించారు. 24 మంది ఎంఐఓలు, ఉద్యాన వనశాఖలోని 8 మంది అధికారులు, వ్యవసాయశాఖలో 27 మంది అధికారులను ఆయా మండలాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఈ నెల 25వ తేదీ వరకు వీరు ఎంపీడీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారు. రైతులు డ్రిప్, స్ప్రింక్లర్లు పొందేందుకు సంబంధింత ధ్రువపత్రాలతో ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌ఎంఐపీ ఏపీడీ పి.యాదగిరి తెలిపారు. -
పరికరాలపై సబ్సిడీ కోత
గజ్వేల్: జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ.. సూక్ష్మనీటి వినియోగంతో ఆరుతడి పంటలు వేసుకుని గట్టెక్కాలనుకున్న రైతుల ఆశ అడియాస కానుంది. సూక్ష్యనీటి సేద్యపు పథకానికి అందిస్తున్న సబ్సిడీలో ప్రభుత్వం భారీ కోత విధించడమే ఇందుకు కారణం. గతంలో 90 శాతం సబ్సిడీపై అందించిన స్ప్రింక్లర్(తుంపర సేద్యం పరికరాలు)లను ప్రస్తుతం 50 శాతానికి మాత్రమే అందించాలని తాజాగా ఉత్తర్వులిచ్చారు. ఈ పరిణామంతో రైతులు షాక్‌కు గురవుతున్నారు. దశాబ్దాలుగా సాగునీటి కొరతతో అల్లాడుతున్న జిల్లా రైతాంగం అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటి వనరులను ప్రయోజనకరంగా వాడుకునేందుకు సూక్ష్మనీటి సేద్యపు పథకంపై ఆధారపడుతున్నారు. ప్రతిఏటా జిల్లాలో 10 వేల హెక్టార్లలో బిందు(డ్రిప్), తుంపర(స్ప్రింక్లర్)లను బిగించుకుంటున్నారు. డ్రిప్‌ను ఏటా 7 వేల హెక్టార్లలో రైతులు వాడుతుండగా వాటికి ధీటుగా స్ప్రింక్లర్లను కూడా వాడుతున్నారు. స్ప్రింక్లర్లను ప్రధానంగా వేరుశనగ, ఉల్లిగడ్డ, మిర్చి, పొద్దుతిరుగుడు, పెసర, పత్తి, మొక్కజొన్నలాంటి ఆరుతడి పంటలకు వాడుతున్నారు. డ్రిప్ యూనిట్ విలువ రూ. లక్ష ఉండగా ఇందులో 90 శాతం సబ్సిడీపై పరికరాలను అందిస్తున్నారు. పరికరాలు సుమారు హెక్టారుకు సరిపోతాయి. తుంపర సేద్యపు పరికరాల యూనిట్ విలువ రూ.19,600 ఉండగా దీనిని ప్రస్తుతం 50 శాతం సబ్సిడీపై మాత్రమే అందించగలమని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. రెండేళ్లుగా స్ప్రింక్లర్ల పంపిణీని నిలిపివేసిన ప్రభుత్వం ఈసారి నుంచి తిరిగి ఇవ్వడానికి నిర్ణయంచుకున్న తరుణంలో ఊరట చెందాల్సిన రైతులు.. సబ్సిడీలో భారీగా కోత విధించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి జిల్లాలో సూక్ష్మనీటి సేద్యపు పథకం కింద 6,500 హెక్టార్లలో డ్రిప్, మరో 2,900 హెక్టార్లలో తుంపర సేద్యాన్ని విస్తరించడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. తుంపర సేద్యానికి సంబంధించి మరో 10 వేల హెక్టార్లకు పెంచినా రైతులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నాలుగేళ్లుగా జిల్లాలో తుంపర సేద్యపు పరికరాల కోసం వచ్చిన దరఖాస్తులు వేలల్లో పేరుకుపోయి ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం రైతుల అవసరాలను పట్టించుకోకుండా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్ప్రింక్లర్ల సబ్సిడీని తగ్గంచటం సరికాదు... నేను మూడేళ్ల కిందట స్ప్రింక్లర్ల కోసం దరఖాస్తుచేసుకున్న.. అయితే ఈసారి ఇస్తమంటున్నరు. మంచిదే కానీ, సబ్సిడీ 50 శాతం మాత్రమే ఇస్తమనడం దారుణం. నాలాంటి ఎంతోమంది రైతులకు ఈ పరికరాలు కావాలే. వానలు లేక...స్ప్రింక్లర్లతో పంటలు పండించుకుందామంటే సబ్సిడీతో కొర్రి పెడుతుండ్రు. - రామచంద్రారెడ్డి, రైతు, ధర్మారెడ్డిపల్లి