అనంతపురం అగ్రికల్చర్ : సూక్ష్మ సాగు (డ్రిప్, స్ప్రింక్లర్లు) విస్తరణలో ఈ ఏడాది రాష్ట్రంలోనే అగ్రస్థానం సాధించామని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) పీడీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఆయన స్థానిక ఏపీఎంఐపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం ఆఖరి రోజు (శుక్రవారం) ‘అనంత’ కన్నా చిత్తూరు కాస్త ముందంజలో ఉండగా.. అర్ధరాత్రికి అధిగమించి అగ్రస్థానం చేరామన్నారు.
చివరి రోజు ఒక్కరోజే దాదాపు 1,500 హెక్టార్లకు మంజూరు ప్రక్రియ పూర్తి చేశామన్నారు. సిబ్బంది కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. మంజూరు చేసిన రైతుల పొలాల్లో యూనిట్లు అమర్చే కార్యక్రమం వేగవంతం చేస్తామన్నారు. మొత్తమ్మీద 2016–17 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 27,357 హెక్టార్లకు మంజూరు చేసి టాప్‌లో నిలవగా.. తర్వాతి స్థానాల్లో చిత్తూరు (26,781 హెక్టార్లు), వైఎస్సార్ జిల్లా (25,427 హెక్టార్లు), కర్నూలు (14,263 హెక్టార్లు) ఉన్నాయన్నారు.
సూక్ష్మసాగులో ‘అనంత’కు అగ్రస్థానం
Published Sat, Apr 1 2017 11:10 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement