మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి : బీజేపీ
Published Sun, Aug 18 2013 4:34 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
మిర్యాలగూడ టౌన్, న్యూస్‌లైన్ : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. శనివారం బీజేపీ పట్టణ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ గుజరాత్ శాఖ తరహాలో బూత్ కమిటీలను వేయాలని అన్నారు. స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ సమస్యల పరిష్కరించేందుకు ఉద్యమాలు నిర్వహించాలని అన్నారు. వార్డు ప్రజల సమస్యలను అధికారులకు వివరించి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. హైదరాబాద్‌లో జరిగిన యువబేరి ఇతర పార్టీలలో గుబులు లేపుతోందన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరేల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మిర్యాలగూడ, భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్లను బీజేపీ కైవసం చేసుకునేలా పాటుపడాలని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దొండపాటి వెంకట్‌రెడ్డి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వనం మధన్‌మోహన్, రామచంద్రారెడ్డి, ఎడ్ల రమేష్, కమలాకర్‌రెడ్డి, సతీష్, అనిల్, పాపయ్య, నంద, అంకయ్య, శ్రీనివాస్, సైదులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement