- ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘిస్తుంది
- కంతనపల్లి ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలి
- కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి తేజావత్ బెల్లయ్య నాయక్
మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలి
Published Sat, Oct 1 2016 12:13 AM | Last Updated on Tue, Jun 4 2019 6:33 PM
మహబూబాబాద్ : తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తేజావత్ బెల్లయ్యనాయక్ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ వ్య వస్థను విధ్వంసం చేసే పరిస్థితి నేడు ఏర్పడిం దన్నారు. ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రభుత్వం పాలన కొనసాగించకపో గా.. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి అనుగుణంగా పనిచేస్తుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండు ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ. 1.50 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. భూసేకరణ చట్టాన్ని, అటవీహక్కుల చట్టాన్ని సైతం ప్రభుత్వం ఉల్లంఘిస్తుందన్నారు. ప్ర భుత్వం ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరం లో రూ.85 వేల కోట్లు, రెండో సంవత్సరంలో రూ. 90 వేల కోట్ల ఆదాయం వచ్చిందని. ఈ నిధుల వ్యయంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ముల్లంగి ప్రతాప్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వెంకన్నతో పాటు యాళ్ల పుష్పలత, నాయకులు గిరిధర్ గుప్తా, అప్పె వేణు, ఖలీల్, రామగోని రాజు, ప్రసాద్, వెంకటేశ్వర్లు, వెంకట్, కిష¯ŒS పాల్గొన్నారు.
Advertisement