గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నగర మేయర్ పదవిపై అధికార టీఆర్ఎస్లో జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి.
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నగర మేయర్ పదవిపై అధికార టీఆర్ఎస్లో జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. మేయర్ రేసులో సీనియర్ నేతలతో పాటు కొందరు కొత్త నేతల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ మాత్రం ఎన్నికల అనంతరమే మేయర్ అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ తరపున బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను రెండు రోజుల్లో విడుదల చేయడానికి టీఆర్ఎస్ కసరత్తులు చేస్తోంది. తొలి జాబితాను 45 మంది అభ్యర్థులతో ప్రకటించనున్నట్లు సమాచారం.