రెండురోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తాం : టీఆర్ఎస్ | candidates names will be announced with in two days : TRS | Sakshi

రెండురోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తాం : టీఆర్ఎస్

Published Tue, Jan 12 2016 5:10 PM | Last Updated on Tue, Jun 4 2019 6:19 PM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటిస్తామని టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక కమిటీ సభ్యులు తెలిపారు.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటిస్తామని టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక కమిటీ సభ్యులు తెలిపారు.

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అధ్యక్షతన కేకే నివాసంలో మంగళవారం ఈ కమిటీ భేటీ అయింది. కమిటీ సభ్యులు డి.శ్రీనివాస్, కడియం శ్రీహరి,  కేటీఆర్, ఇంద్రకిరణ్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రేటర్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ మంగళవారం నుంచి ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు 17వ తేదీ ఆదివారం వరకు గడువుంది. తొలి రోజు ఏడు నామినేషన్లు దాఖలైనాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement