జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారంతో ముగియటంతో బరిలో ఏఏ పార్టీల తరఫున ఎందరుండేదీ తేలిపోయింది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారంతో ముగియటంతో బరిలో ఏఏ పార్టీల తరఫున ఎందరుండేదీ తేలిపోయింది. ఇందులో అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థులు మొత్తం 150 స్థానాల్లోనూ పోటీలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ 149, ఎంఐఎం 60, బీజేపీ 65, టీడీపీ 96, లోక్‌సత్తా 26, సీపీఎం 22, సీపీఐ 21 కౌన్సిలర్ స్థానాల్లో అభ్యర్థులను దించాయి. స్వతంత్ర అభ్యర్థులు 640 మంది, ఇతర రిజిస్టర్డు పార్టీలకు చెందిన వారు 49 మంది కూడా రంగంలో మిగిలారు. వచ్చే నెల 2వ తేదీన ఎన్నికలు జరుగనున్న విషయం విదితమే.