Great Fight
-
నగర ప్రథమ పౌరుడెవరో...
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారు. ఇప్పుడు అందరి నోళ్లలో దీనిపైనే చర్చ. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ మెజారిటీతో విజయం సాధించిన టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిని మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. దీనిపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు సాగుతున్నా... టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మదిలో ఏముందో ఎవరికీ అంతుబట్టడం లేదు. నగర ప్రథమ పౌరుడు ఎవరవుతారన్న విషయం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 11 వ తేదీన మేయర్ ఎన్నిక నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరోజున మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ ఎన్నికను కూడా పూర్తి చేయనున్నారు. ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు నుంచే గ్రేటర్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి టీఆర్ఎస్ ప్రణాళికా బద్ధంగా, పకడ్బందీ వ్యూహంతో పనిచేసింది. టీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో ఎంఐఎం మద్దతుతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న ఆలోచన చేసినట్టు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతోనే స్పష్టమైంది. అదీ సాధ్యం కాని పరిస్థితి ఉంటే హైదరాబాద్ మున్సిపల్ (స్థానిక సంస్థ) లో ఎక్స్ అఫిషియే సభ్యుల ద్వారా మేయర్ పీఠం దక్కించుకోవాలని భావించింది. అయితే అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ టీఆర్ఎస్ కు భారీ మెజారిటీ దక్కడంతో ఇప్పుడు ఆ పార్టీ ఎవరి మద్దతు లేకుండానే మేయర్ సీటును దక్కించుకోనుంది. ఎంఐఎంను మిత్రపక్షం చేసుకుని మేయర్ స్థానాన్ని గెలుచుకునే పరిస్థితి తలెత్తి ఉంటే మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఒకరకమైన వ్యూహం, ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు కూడా అవసరమైన పరిస్థితి ఏర్పడి ఉంటే మరో రకమైన వ్యూహంతో ముందుకెళ్లాలని టీఆర్ఎస్ నాయకత్వం ప్రణాళిక రచించింది. ఇప్పుడు ఇతరుల మద్దతు అవసరం లేకుండానే స్వతంత్రంగా అభ్యర్థిని ఎంపిక చేసుకునే బలం సమకూరడంతో ఆ పార్టీ నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. మేయర్ అభ్యర్థి ఎవరన్న విషయం ఆ ఎన్నిక రోజు వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో పూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు వెళ్లే రోజున ఉన్న పరిస్థితి ఇప్పుడు లేనందున మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎంపిక పూర్తిగా కేసీఆర్ ఆలోచనను బట్టే ఉంటుంది. మేయర్‌గా రామ్మోహన్ మేయర్ పదవికి చర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికైన బొంతు రామ్మోహన్ పేరు బలంగా వినిపిస్తోంది. రామ్మోహన్ కార్పొరేటర్ గా పోటీ పెట్టిన సందర్భంగానే ఆయన పేరు మేయర్ పదవి ఇస్తామని సూత్రప్రాయంగా పార్టీ నాయకత్వం తెలిపిందని పార్టీ నేతలు చెబుతున్నారు. మేయర్ పదవి ఎంపిక కోసం ఎంఐఎం మద్దతు తీసుకోవలసిన అవసరం ఏర్పడి ఉంటే డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎం కు ఇచ్చే పరిస్థితి తలెత్తేది. ఇప్పుడా పరిస్థితి లేనందున డిప్యూటీ మేయర్ పదవి కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం ఎన్నికైన కార్పొరేటర్లలో ముస్లిం మైనారిటీకి చెందిన వ్యక్తికి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తారని తెలుస్తోంది. ఏ లెక్క చూసినా... మేయర్ పీఠం దక్కించుకోవడానికి గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో ఎక్స్ అఫీషియో సభ్యులను పరిగణలోకి తీసుకోకుంటే... 76 డివిజన్లు ఉంటే సరిపోతుంది. అయితే టీఆర్ఎస్ అనూహ్యంగా 99 డివిజన్లతో తిరుగులేని మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. 150 మంది డివిజన్ల కార్పొరేటర్లతో పాటు ఎక్స్అఫీషియో సభ్యులుగా మరో 67 మంది సభ్యులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. వారికి పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా టీఆర్ఎస్ కు బంపర్ మెజారిటీ ఉంది. లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మొత్తం కలిపి ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 67 మంది ఎక్స్అఫీషియో సభ్యులు ఉండగా, వారిలో టీఆర్ఎస్ కు 35, ఎంఐఎంకు 10, టీడీపీకి 7, కాంగ్రెస్ కు 8, బీజేపీకి 7 ఓట్లున్నాయి. ఇంతకాలం టీఆర్ఎస్ కు 34 మంది సభ్యులు మాత్రమే ఉన్నప్పటికీ తాజాగా మంగళవారం టీడీపీకి చెందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ కూడా టీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీ బలం 35 కు పెరిగింది. మొత్తం 150 డివిజన్లతో పాటు 67 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 217 మంది ఓటర్లలో 134 ఓట్లు టీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. ఈ లెక్క తీసుకున్నా టీఆర్ఎస్ ఎవరి మద్దతు లేకుండా మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను దక్కించుకోగలదు. లోక్ సభ సభ్యులు 1. కొత్త ప్రభాకర్ రెడ్డి (టీఆర్ఎస్) 2. సీహెచ్ మల్లారెడ్డి (టీడీపీ) 3. బండారు దత్తాత్రేయ (బీజేపీ) 4. అసదుద్దీన్ ఓవైసీ (ఏఐఎంఐఎం) రాజ్యసభ సభ్యులు 5. కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్) 6. వి. హనుమంతరావు (కాంగ్రెస్) 7. రాపోలు ఆనంద భాస్కర్ (కాంగ్రెస్) 8. సీఎం రమేష్ (టీడీపీ) 9. గరికపాటి మోహన్ రావు (టీడీపీ) 10. కే కేశవరావు (టీఆర్ఎస్) 11. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి (కాంగ్రెస్) 12. జైరాం రమేష్ (కాంగ్రెస్) 13. ఎం.ఏ. ఖాన్ (కాంగ్రెస్) 14. కె. చిరంజీవి (కాంగ్రెస్) ఎమ్మెల్సీలు 15. పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్) 16. కే. యాదవ రెడ్డి (టీఆర్ఎస్) 17. ఎస్. రాములు నాయక్ (టీఆర్ఎస్) 18. కె. స్వామిగౌడ్ (టీఆర్ఎస్) 19. మహమ్మద్ సలీమ్ (టీఆర్ఎస్) 20. నాయిని నర్సింహారెడ్డి (టీఆర్ఎస్) 21. మహ్మద్ మహమూద్ అలీ (టీఆర్ఎస్) 22. పాతూరి సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్) 23. వి.భూపాల్ రెడ్డి (టీఆర్ఎస్) 24. సుంకరి రాజు (టీఆర్ఎస్) 25. కె.జనార్థన్ రెడ్డి (టీఆర్ఎస్) 26. ఆర్ భూపతి రెడ్డి (టీఆర్ఎస్) 27. పి.సతీష్ కుమార్ (టీఆర్ఎస్) 28. కర్నె ప్రభాకర్ (టీఆర్ఎస్) 29. వి.గంగాధర్ గౌడ్ (టీఆర్ఎస్) 30. డి.రాజేశ్వరరావు (టీఆర్ఎస్) 31. పి.రవీందర్ (టీఆర్ఎస్) 32. కసిరెడ్డి నారాయణరెడ్డి (టీఆర్ఎస్) 33. బి.వెంకటేశ్వర్లు (టీఆర్ఎస్) 34. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి (టీఆర్ఎస్) 35. నేతి విద్యాసాగర్ (టీఆర్ఎస్) 36. పట్నం నరేందర్ రెడ్డి (టీఆర్ఎస్) 37. టి.భాను ప్రసాద్ (టీఆర్ఎస్) 38. నారదాసు లక్ష్మణరావు (టీఆర్ఎస్) 39. ఎంఎస్ ప్రభాకర్ (కాంగ్రెస్ - టీఆర్ఎస్ లో చేరారు) 40. మహ్మద్ అలీ షబ్బీర్ (కాంగ్రెస్) 41. సయ్యద్ అల్తాఫిదర్ రజ్వీ (ఏఐఎంఐఎం) 42. సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ (ఏఐఎంఐఎం) 43. ఎన్. రామచందర్ రావు (బీజేపీ) ఎమ్మెల్యేలు 44. కె. లక్ష్మణ్ (బీజేపీ) 45. జి. కిషన్ రెడ్డి (బీజేపీ) 46. చింతల రామచంద్రారెడ్డి (బీజేపీ) 47. టి. రాజాసింగ్ (బీజేపీ) 48. ఎన్వీఎస్సెస్ ప్రభాకర్ (బీజేపీ) 49. మాగంటి గోపీనాధ్ (టీడీపీ) 50. కేపీ వివేకానంద (టీడీపీ - టీఆర్ఎస్ లో చేరారు) 51. ఆర్ కృష్ణయ్య (టీడీపీ) 52. టి. ప్రకాశ్ గౌడ్ (టీడీపీ) 53. అరికెపూడి గాంధీ (టీడీపీ) 54. జాఫర్ హుస్సేన్ (ఏఐఎంఐఎం) 55. కౌసర్ మొయినుద్దీన్ (ఏఐఎంఐఎం) 56. అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల (ఏఐఎంఐఎం) 57. సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (ఏఐఎంఐఎం) 58. అక్బరుద్దీన్ ఓవైసీ (ఏఐఎంఐఎం) 59. ముంతాజ్ అహ్మద్ ఖాన్ (ఏఐఎంఐఎం) 60. మహ్మద్ మౌజం ఖాన్ (ఏఐఎంఐఎం) 61. టి.పద్మారావు (టీఆర్ఎస్) 62. జి.మహిపాల్ రెడ్డి (టీఆర్ఎస్) 63. చింతల కనకా రెడ్డి (టీఆర్ఎస్) 64. తలసాని శ్రీనివాస యాదవ్ (టీడీపీ- టీఆర్ఎస్ లో చేరారు) 65. జి. సాయన్న (టీడీపీ - టీఆర్ఎస్ లో చేరారు) 66. ఎం. కృష్ణారావు (టీడీపీ - టీఆర్ఎస్ లో చేరారు) 67. ఎల్విస్ స్టీఫెన్ సన్ (టీఆర్ఎస్ - నామినేటెడ్ మెంబర్) పార్టీ కార్పొరేటర్లు ఎక్స్-అఫీషియో సభ్యులు మొత్తం టీఆర్ఎస్ 99 35 134 ఎంఐఎం 44 10 54 కాంగ్రెస్ 02 08 10 టీడీపీ 01 07 08 బీజేపీ 04 07 11 మొత్తం 150 67 217 మేయర్ ఎన్నిక బహిష్కరిద్దామా గ్రేటర్ మేయర్ పదవి టీఆర్ఎస్ ను వరించడం ఖాయమైన నేపథ్యంలో ఆ ఎన్నికలో పాల్గొనాలా లేదా అన్న మీమాంసలో టీడీపీ నేతలున్నారు. ఈ విషయంలో బీజేపీ వాదన భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సైతం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనాలా లేదా ఇంకా తేల్చుకోలేదని తెలిసింది. -
ఈసీ రూల్స్ కాగితాలకే పరిమితమా?- నిరంజన్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం సభ్యులపై నిషేధం విధించాలని పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఎన్నికల నియామలికి విరుద్దంగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నా... ఎన్నికల పరిశీలకులకు వినపడటం లేదా అని అడిగారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాత నగరంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారంతో ప్రజల్లోకి దూసుకెళ్లి వారి ఆదరాభిమానాలు పొందుతుంటంతో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ పిచ్చికుక్కలా మెరుగుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. ఈ సందర్భంగా అసిఫ్‌నగర్‌లో అక్బరుద్దీన్ చేసిన ప్రసంగ వీడియోను ప్రదర్శించారు. కొంత కాలంగా ఎంఐఎం నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నా ఈసీ నిమ్మకు నీరెత్తినట్లు ఉండానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమా? అని అడిగారు. ఎంఐఎం నేతలపై చర్యలు తీసుకునే ధైర్యం ఈసీకి లేకపోతే అదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని వారే చూసుకుంటారన్నారు. ఎన్నికల నియామావలి 243-కె, 243 జెడ్ఏ ప్రకారం ఎంఐఎం నేతలను ఎన్నికల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఐఎం సోదరులు అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లను పాతబస్తీ నుంచి తరిమికొట్టే రోజు త్వరలోనే వస్తుందన్నారు. -
‘కూటమి’తోనే నగరాభివృద్ధి: కేంద్రమంత్రి హన్సరాజ్
బీజేపీ, టీడీపీ కూటమి ద్వారానే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర సహాయ మంత్రి హ న్సరాజ్ గంగ్వార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పూల్‌బాగ్ చమాన్ ప్లే గ్రౌండ్ వద్ద రోడ్ షో లో జంగమ్మెట్, శాలిబండ డివిజన్ల బీజేపీ అభ్యర్థులు కౌడీ మహేందర్, పొన్న వెంకటరమణలతో కలిసి ఆయన ప్రసంగించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మహా నగరాల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. హైదరాబాద్ మహా నగరంలో బీజేపీ, టీడీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే మరింత అభివృద్ధి చేసేందుకు వీలుంటుందన్నారు. టీఆర్ఎస్, మజ్లీస్ పార్టీలకు తగిన రీతిలో ఓటు ద్వారా సమాధానం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి టి. ఉమా మహేంద్ర, సీనియర్ నాయకులు ఊరడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్తోనే అభివృద్ధి: మంత్రి తలసాని
టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే హైదరాబాద్ అన్ని రంగాలలో అభివృద్ధి చెంది విశ్వనగరంగా గుర్తింపు లభిస్తుందని... ఆదిశగా సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. నాచారం డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి మేడల జ్యోతి మల్లికార్జున్‌గౌడ్ ఎన్నికల ప్రచారం శుక్రవారం నాచారంలోని హెచ్ఎంటీ నగర్, వీఎస్‌టీకాలనీ, స్నేహపురికాలనీ కాలనీలలో జరిగింది. ఈ సందర్భంగా కాలనీలలో పాదయాత్ర చేస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కారుగుర్తుకు ఓటు వేసి మేడల జ్యోతిమల్లికార్జున్గౌడ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యతో పాటు స్థానికనేతలు మల్లికార్జున్‌గౌడ్, రాగిరి మోహన్‌రెడ్డి, నందికొండ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హత్య...కుట్ర...వరకట్న వేధింపులు
- జీహెచ్ఎంసీ అభ్యర్థులపై ఉన్న కేసులివి - అత్యధికంగా శాలిబండ పోటీదారుల పైనే - మాజీ మేయర్ హుస్సేన్ పైనా రెండు కేసులు - కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి పైనా రెండు కేసులు - నివేదిక విడుదల చేసిన ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున పోటీపడుతున్న అభ్యర్థుల నేర చరిత్రను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గురువారం విడుదల చేసింది. మొత్తం 150 డివిజన్లలో 75 మహిళలకు రిజర్వ్ అయ్యాయి. మిగిలిన సగంలో 51 డివిజన్లలో పోటీ చేస్తున్న 72 మందిపై పోలీసుస్టేషన్లు, కోర్టు విచారణల్లో కేసులున్నాయని ఈ సంస్థ వెల్లడించింది. అత్యధికంగా శాలిబండ డివిజన్ నుంచి బీజేపీ, ఎంఐఎం తరఫున పోటీ చేస్తున్న పొన్నా వెంకట రమణ, మహ్మద్ ముస్తఫా అలీలపై ఆరేసి చొప్పున కేసులు నమోదై ఉన్నాయి. టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బీఎన్ రెడ్డి నగర్ నుంచి రంగంలోకి దిగిన నర్సింహ్మరావుపై ఐదు కేసులు ఉన్నాయి. ఈ ఐదింటిలో అత్యధికం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భాల్లో నమోదైనవే. చంపాపేట డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.రమణరెడ్డిపై నమోదైన హత్య కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. మల్లాపూర్ బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కుషాయిగూడ పోలీసుస్టేషన్లో నమోదైన కేసు సైతం కోర్టు పరిధిలో ఉంది. మెహదీపట్నం నుంచి ఎంఐఎం తరఫున పోటీ చేస్తున్న మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్‌పై హుమాయున్‌నగర్ ఠాణాలో రెండు కేసులున్నాయి. కాంగ్రెస్ పార్టీ తమ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన, జామ్‌బాగ్ నుంచి పోటీలో ఉన్న ముల్లా విక్రమ్ గౌడ్‌పై ఓ కేసు నమోదై ఉంది. అభ్యర్థుల నేరాల వివరాలు: - 32 పతర్‌గట్టి మూసా ఖాసీమ్ కాంగ్రెస్ యూ/ఎస్ 324 సీసీ నంబర్.325/2011 - 32 పతర్‌గట్టి మహమ్మద్ హస్మత్ ఆలీ సీపీఐ సీసీనంబర్ 21/12 హుసేనీ ఆలమ్ పోలీసు స్టేషన్ - 35 గౌలిపుర కె.మీనా టీఆర్ఎస్ సీసీనంబర్ 451 యూ/ఎస్ 420,468,409,471 ఆర్/డబ్ల్యూ 120-బీ ఐపీసీ - 43 చాంద్రాయణగుట్ట మహమ్మద్ సత్తార్ ఎంబీటీ సీసీ నంబర్ 747/15 - 43 చాంద్రాయణగుట్ట మహమ్మద్ జబ్బర్ ఇండిపెండెంట్ సీసీ నంబర్ 747/15 - 45 జంగమ్మెట్ అవాద్ అఫారీ కాంగ్రెస్ సీసీ నంబర్ 843/09 యూ/ఎస్ 147, 148, 234, 427, 806, 149 ఆఫ్ ఐపీసీ - 46 ఫలక్‌నుమా కె.తారాబాయ్ ఎంఐఎం సీసీ నంబర్ 395/2014 యూ/ఎస్ 324, 506, 354 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ - 46 ఫలక్‌నుమా జి.రవీంద్రనాయక్ ఇండిపెండెంట్ (1)సీసీనంబర్ 395/14 యూ/ఎస్ 324, 506, 354 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ - 48 శాలిబండ పొన్న వెంకటరమణ బీజేపీ కోర్టులో ఆరు కేసులు - 48 శాలిబండ మహమ్మద్ ముస్తాఫ్‌ఆలీ ఎంఐఎం కోర్టులో ఆరు కేసులు - 50 బేగంబజార్ జి.శంకర్ యాదవ్ ఇండిపెండెంట్ సీసీనంబర్ 4/2003యూ/ఎస్420, 409, 468, 477 - 121 కూకట్పల్లి కూన అంబ్రిష్గౌడ్ కాంగ్రెస్ సీసీ నంబర్ 605/2013యూ/ఎస్326 ఐపీసీ - 3 చర్లపల్లి మహేశ్ కాంగ్రెస్ సీఆర్ నంబర్ 779/2014 సీఆర్నంబర్ 689/2014 యూ/ఎస్324 ఆఫ్ ఐపీసీ 506 - 3 చర్లపల్లి బి.రామ్మోహన్ టీఆర్ఎస్ సీసీనంబర్ 1401/2009, 621/2011, 819/2011 5 మల్లాపూర్ పి.ప్రతాప్ రెడ్డి టీడీపీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు - 14 బీఎన్‌రెడ్డి నగర్ ఎం.సుమన్‌గౌడ్ కాంగ్రెస్ సీసీనంబర్ 370/2013 - 14 బీఎన్‌రెడ్డి నగర్ నర్సింహారావు టీఆర్ఎస్ ఐదు కేసులు - 15 వనస్థలిపురం ఎస్.ప్రభాకర్ రెడ్డి టీడీపీ కోర్టులో రెండు కేసులు - 17 చంపాపేట్ ఎస్.రమణారెడ్డి టీఆర్ఎస్ ఎస్సీ నంబర్ 318/2014 యూ/ఎస్302201 ఆర్/డబ్ల్యూ 120-బీ ఆఫ్ సీఆర్పీసీ - 18 లింగోజిగూడ జానీమియా టీడీపీ యూ/ఎస్ 141, 341, 353, 290 ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ - 21 కొత్తపేట్ బి.మహేందర్‌గౌడ్ టీడీపీ కోర్టులో కేసు ఉంది - 27 అక్బర్‌బాగ్ సయ్యద్ మిన్హజుద్దీన్ ఎంఐఎం కోర్టులో రెండు కేసులు - 29 చావ్నీ మహమ్మద్ ముర్తుజా ఆలీ ఎంఐఎం కోర్టులో రెండు కేసులు, ఐపీసీ 447, 427, 434,188 - 30 దబీర్‌పుర మీర్జా రియాజ్ ఉల్హసేన్ ఎంఐఎం కోర్టులో రెండు కేసులు - 83 అంబర్పేట్ ప్రతాప్ పొగులకొండ కాంగ్రెస్ కోర్టులో కేసు - 88 బోలక్‌పుర్ భానుచందర్ ముదిరాజ్ బీఎస్పీ కోర్టులో కేసు - 88 బోలక్‌పుర్ జి.అనిల్‌కుమార్ బీజేపీ కోర్టులో కేసు - 91 ఖైరతాబాద్ పి.విజయారెడ్డి టీఆర్ఎస్ కోర్టులో కేసు - 93 బంజారాహిల్స్ పి.రాజు యాదవ్ కాంగ్రెస్ కోర్టులో కేసు - 94 షేక్‌పేట అత్మకూరి సుధాకర్ కాంగ్రెస కోర్టులో కేసు - 94 షేక్‌పేట్ మహమ్మద్ నవాజ్‌ఖాన్ ఇండిపెండెంట్ ఐపీసీ 448, 323, 506 - 94 షేక్‌పేట్ ఎస్.విజయ్‌కుమార్ టీఆర్ఎస్ కోర్టులో రెండు కేసులు - 96 యూసఫ్‌గూడ ఏ.సురేందర్ యాదవ్ కాంగ్రెస్ ఎఫ్ఐఆర్ నంబర్ 386/2014 - 99 వెంగళ్రావు నగర్ వి.ప్రదీప్ టీడీపీ కోర్టులో ఒక కేసు - 99 వెంగళ్రావు నగర్ ఎం.శ్యాంరావు ఎంఐఎం ఐపీసీ 147, 427, 506 - 102 రహమత్‌నగర్ నవీన్ యాదవ్ ఎంఐఎం ఐపీసీ 147,148,149,326,427,506 - 102 రహమత్ నగర్ బి.చంద్రమ్మ కాంగ్రెస్ ఐపీసీ 171(బీ), 171(ఈ) 103 బోరబండ జి,అర్జున్ రాజు ఇండిపెండెంట్ ఐపీసీ 353 103 బోరబండ బాబా ఫయాజుద్దీన్ టీఆర్ఎస్ అండర్ సెక్షన్ 147,353,427, 505, ఐపీసీ 149 129 సూరారం ఏ.శ్రీనివాస్ రావు ఇండిపెండెంట్ ఐపీసీ 447, 427, 323, 290, 506 129 సూరారం మన్నెరాజు టీడీపీ ఐపీసీ 120, 420 అండర్ సెక్షన్ 129 సూరారం ఆనంద్‌కుమార్ ఇండిపెండెంట్ ఐపీసీ 498 116 అల్లాపూర్ స్రవంతి వేముల టీడీపీ ఐపీసీ 441, 447, 467 117 మూసాపేట్ జబ్బర్‌ఖాన్ ఎస్పీ ఐపీసీ 419, 420 119 ఓల్డ్‌బోయిన్‌పల్లి నరింహ్మ యాదవ్ టీఆర్ఎస్ ఐపీసీ 171(హెచ్), ఆర్పీ చట్టం 127(ఏ), ఐపీసీ 188 64 దత్తాత్రేయనగర్ మహమ్మద్ అక్విల్ టీఆర్ఎస్ కోర్టులో ఒక కేసు 77 జామ్‌బాగ్ ఆనంద్ గౌడ్ టీఆర్ఎస్ ఐపీసీ 406, 429 కోర్టులో పెండింగ్ 77 జామ్‌బాగ్ ముల్లా విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ యూ/ఎస్ 364 (ఏ), 386 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ 70 మెహదీపట్నం ఎండీ మాజీ హుసేన్ ఎంఐఎం రెండు కేసులు (ఐపీసీ 353, 448, 504, 323) 71 గుడిమల్కాపూర్ బంగారి ప్రకాశ్ టీఆర్ఎస్ ఐపీసీ 353, కోర్టు విచారణలో ఉంది. 65 కార్వాన్ డివిజన్ కె.గోవర్ధన్ బీజేపీ ఐపీసీ 324 56 కిషన్‌బాగ్ మహమ్మద్ సలీమ్ ఎంఐఎం ఐపీసీ 147, 148, 324, 34 కోర్టు విచారణలో ఉంది 54 జహనుమా ఖాజా ముబషీర్ ఉద్దీన్ ఎంఐఎం ఐపీసీ 447, 504, 506 కోర్టు విచారణలో ఉంది 51 గోషామహల్ అభిషేక్ కుమార్ కంటేకర్ ఇండిపెండెంట్ ఐపీసీ 147, 148 కోర్టు విచారణలో ఉంది 51 గోషామహల్ మనోజ్ సింగ్ సీపీఐ(ఎం) ఐపీసీ 324, 506 కోర్టు విచారణలో ఉంది. 131 కుత్బుల్లాపూర్ టి.బాలమణి టీడీపీ ఐపీసీ 341,353, 34 కోర్టు ట్రయల్ 133 బొల్లారం ఎన్.చిట్టిబాబు టీడీపీ ఐపీసీ 188, 427, అల్వాల్ పోలీసు స్టేషన్ 140 మల్కాజిగిరి ఎం.విజయ్‌కుమార్ యాదవ్ టీడీపీ ఏపీ గేమ్ యాక్ట్ యూ/ఎస్ 3,45 కింద రెండు కేసులు 140 మల్కాజిగిరి జగదీశ్వర్ గౌడ్ టీఆర్ఎస్ ఐపీసీ 147, 341, 504 స్పెషల్ మేజిస్ట్రేట్లో ట్రయల్ 125 గాజుల రామారం పి.వీరాశెట్టి ఇండిపెండెంట్ ఐపీసీ 320, వికారాబాద్ 40 రియాసత్ నగర్ ఎంఏ హబీబ్ ఎంబీటీ కేసునంబర్: 1866/2009 40 రియాసత్ నగర్ మీర్జా ముస్తాఫా బేగ్ ఎంఐఎం ఐపీసీ 143, 323, 34 కోర్టు విచారణలో ఉంది 130 సుభాష్‌నగర్ బుసిరెడ్డి వాణి ఇండిపెండెంట్ ఐపీసీ 534, 448 104 కొండాపూర్ నీలం రవీందర్ ముదిరాజ్ టీడీపీ ఐపీసీ 186, 353, ఐపీసీ 188 అండ్ 171-హెచ్-ఐపీసీ 106 శేరిలింగంపల్లి ఆర్.నాగేందర్ యాదవ్ టీఆర్ఎస్ ఐపీసీ 420, 468, 471, కోర్టు విచారణలో ఉంది 106 శేరలింగంపల్లి కంచెర్ల యెల్లేశ్ కాంగ్రెస్ ఐపీసీ 186, 353, ఆర్/డబ్ల్యూ 34 107 మాదాపూర్ ఈ శ్రీనివాస్ యాదవ్ టీడీపీ ఐపీసీ 353, 332, 34 107 మాదాపూర్ ఎస్.హరికృష్ణ ప్రసాద్ బీజేపీ ఐపీసీ 353 (వినాయక చవితిలో గొడవ) 109 హఫీజ్‌పేట్ సౌజన్య కమాల్ టీడీపీ ఎస్సీ, ఎస్టీ (పీవోఏ) యాక్ట్ 1989, ఐపీసీ 504 112 రామచంద్రాపురం కె.మనోహర్ ఇండిపెండెంట్ కోర్టులో రెండు కేసులు విచారణలో ఉన్నాయి 112 రామచంద్రాపురం టి.అవినాశ్‌గౌడ్ కాంగ్రెస్ ఐపీసీ 447, 504 114 కేపీహెచ్‌బీ కాలనీ ఏ.వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ ఐపీసీ 447, 427 (రెండు కేసులు కోర్టు విచారణలో) -
ఇక పగటి పూటా తనిఖీలు
- ప్రారంభించిన జంట కమిషనరేట్ల అధికారులు - రహదారులతో పాటు లో-క్లాస్ లాడ్జిలపై దృష్టి - ఏజెంట్ల’ వివరాలూ ఆరా తీయాలని నిర్ణయం - రౌడీషీటర్లపై నిఘా ముమ్మరం చేసిన పోలీసులు హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలతో పాటు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు తనిఖీల విధానంలో సమూల మార్పులు తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రాత్రివేళల్లో మాత్రమే జరిగే సోదాలకు ఇకపై పగటి పూట చేయాలని నిర్ణయించారు. సాధారణంగా పొరుగు జిల్లాల నుంచి ఎన్నికల కోసం వచ్చే వాళ్లు లాడ్జిల్లోనే మకాం వేస్తారని.. ఖరీదైన హోటళ్లకు బదులు.. లోక్లాస్ లాడ్జీల్లో బసచేస్తారని పోలీసులు తెలిపారు. అందువల్ల ఈ టైపులాడ్జీలపై అధికారులు దృష్టి పెట్టారు. ఓ నిర్ధిష్ట సమయం అంటూ లేకుండా తరచు సమయాలు, ప్రాంతాలు మార్చి ఆకస్మిక తనిఖీలు చే యాలని అధికారులు నిర్ణయించారు. రాజధాని నగరానికి అనునిత్యం పొరుగు జిల్లాల నుంచి విద్యా, వైద్య, వ్యాపార పనులతో పాటు విహారం కోసం వచ్చే వీరిలో అనేక మంది సైతం లాడ్జిలనే ఆశ్రయిస్తుంటారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న అధికారులు తమ తనిఖీల వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. సోదాల నేపథ్యంలో మర్యాద పూర్వకంగా నడుచుకోవాలంటూ ఉన్నతాధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, వృద్ధులతో పాటు కుటుంబ సమేతంగా, పిల్లలతో ఉండే వారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిందిగా స్పష్టం చేశారు. పోలింగ్ ఏజెంట్ల వివరాలూ ఆరా... ధన, బల ప్రయోగం చేయడంతో పాటు ఓటర్లను ప్రభావితం చేయగలిగే వాళ్లను పోలింగ్ ఏజెంట్ల రూపంలో వినియోగించుకోవడానికి’ కొందరు అభ్యర్థులు పథకం వేస్తున్నారని పోలీసుల అనుమానిస్తున్నారు. మరో వైపు.. నేరచరితులు ఎలక్షన్ ఏజెంట్లుగా లేకుండా చూసేందుకు.. పోలింగ్ ఏజెంట్ల పైనా డేగకన్ను వేయనున్నారు. ప్రతి ఏజెంట్ వివరాలు ఆరా తీయాలని నిర్ణయించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మకమైన రౌడీషీటర్లు పీడీ యాక్ట్ కింద జైల్లోనే ఉన్నారు. అయినప్పటికీ టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు వారితో పాటు వారి అనుచరుల కదలికలపై నిఘా వేసి ఉంచారు. ఓ పక్క బైండోవర్ కాని వారి కోసం గాలిస్తూన్నారు. దీని కోసం ప్రత్యేకంగా షాడో పార్టీలు రంగంలోకి దిగాయి. -
మాజీ జర్నలిస్టుల పిల్లల రసవత్తర పోరు
జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ ముంచుకొస్తోంది. అభ్యర్థులతో పాటు.. వారి కుటుంబ సభ్యులు ప్రచారంలో తలమునకలుగా ఉన్నారు. అయితే.. బంజారా హిల్స్ డివిజన్ అభ్యర్థుల విషయంలో ఒక ఆసక్తి కరమైన పోలిక ఉంది. ఈ డివిజన్ లో టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గద్వాల్ విజయ లక్ష్మి తండ్రి కే.కేశవరావు, బీజేపీ అభ్యర్థి మేచినేని శ్రీనివాసరావు తండ్రి మేచినేని కిషన్ రావులు ఇద్దరూ మాజీ జర్నలిస్టులు కావడం విశేషం. వీరిద్దరూ జర్నలిజంలో ఉంటూనే ఎవరికివారు ప్రత్యేకంగా పత్రికలు నడిపారు. మేచినేని కిషన్‌రావు సమయం పత్రికను నిర్వహిస్తే కే.కేశవరావు డైలీ న్యూస్ పేరుతో ఓ పత్రికను సమర్ధవంతంగా నడిపారు. తాజాగా ఇద్దరు మాజీ జర్నలిస్టులు తమ పిల్లల విజయం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. అంతే కాదు.. ప్రస్తుతం ఈ మాజీ జర్నలిస్టుల వారసులు కార్పోరేటర్ పదవికి పోటీ పడుతుండగా.. గతంలో కేశవరావు, కిషన్ రావులు సికింద్రాబాద్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే పదవికి పోటీ పడటం విశేషం. ఆ ఎన్నికల్లో కేకేపై కిషన్‌రావు 25 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు ఈ ఇద్దరూ మాజీ మంత్రులు కావడం మరో విశేషం. కేకే కార్మికశాఖామంత్రిగా పని చేస్తే కిషన్‌రావు విద్యాశాఖామంత్రిగా పని చేశారు. మరో విషయం ఏంటంటే హైదరాబాద్ పట్టభద్రుల నియోజక వర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కేకే, కిషన్‌రావు ఇద్దరూ తలపడ్డారు. ఈ ఎన్నికల్లో మాత్రం కిషన్‌రావుపై కేకే గెలుపొందారు. ఇలా ఈ ఇద్దరూ చాలా విషయాల్లో తలపడినవారే. కేకే, కిషన్‌రావు కూతురు, కొడుకు పోటీ పడుతుండటం.. తాజాగా డివిజన్ లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. రాజకీయాల్లో తలపండిన ఈ ఇద్దరు నేతలు తమ పిల్లలను గెలిపించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. మరి తుది విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. పలు సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వీరు.. నివసించేది.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో. అంతే కాదు.. ఇద్దరూ ఎప్పుడు ఎదురు పడినా.. ఆప్యాయంగా పలకరించుకోవడం.. ఒకరిపై ఒకరు గౌరవాన్ని వ్యక్తం చేయడంలో హుందా వ్యవహరిస్తారు. -
లోకేశ్ కు కేటీఆర్ కౌంటర్
- అమరావతికి తట్టెడు మట్టి...లొట్టెడు నీళ్లు... -హైదరాబాద్‌కు కాదు...అమరావతికి నిధులు తెచ్చుకోండి... -నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే దమ్ము కేసీఆర్‌కే ఉంది.... -గాడిదలకు గడ్డివేసి...ఆవులను పాలు ఇమ్మంటే ఇస్తాయా? -హైదర్‌నగర్ అభ్యర్ధిని గెలిపిస్తే దత్తత తీసుకుంటా.... హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీయివ్వడాన్ని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. అమరావతి నగర నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తట్టెడు మట్టి...లొట్టెడు నీళ్లను మాత్రమే తెచ్చారని, హైదరాబాద్ నగర అభివృద్ధి గురించి ఆలోచించే బదులు అమరావతి నగర అభివృద్ధికి నిధులు తెచ్చుకోవాలని లోకేశ్ కు కేటీఆర్ చురకలంటించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దే దమ్ము, ధైర్యం ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హైదర్‌నగర్ డివిజన్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. గాడిదలకు గడ్డివేసి...ఆవును పాలు ఇమ్మంటే ఇస్తదా? అని ప్రజలను ప్రశ్నించారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ని కాదని ఇతరులకు ఓటువేస్తే అభివృద్ధి తీరు కూడా అలాగే ఉంటదన్నారు. బీజేపీ,టీడీపీ, కాంగ్రెస్‌లకు ఓటువేస్తే ఎలాంటి ఉపయోగం లేదని, సమస్యల పరిస్కారానికి, సమగ్ర అభివృద్ధికి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటువేయాలని కోరారు. 1100 కోట్ల రూపాయలతో ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి జానకి రామరాజును గెలిపిస్తే.. హైదర్‌నగర్ డివిజన్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. తాగు నీటి సమస్యపై స్థానికులు ప్రశ్నించగా.. త్వరలోనే అందరికీ ప్రతిరోజు నీళ్లు వస్తాయన్నారు. దమ్ముంటే రాజీనామా చేస్తావా? తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని కోరుతున్న రేవంత్‌రెడ్డికి దమ్ముంటే టీడీపీ నుంచి గెలిచిన15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగిపోయారని ఆరోపిస్తున్న రేవంత్‌రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలన్నారు. నగరంలోని ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేందుకు అడ్డగోలుగా మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు. హైదర్‌నగర్ టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్‌తో పాటు పాల్గొన్న కృష్ణారావు టీడీపీ నేతల తీరును ఎండగట్టారు. -
జీహెచ్ఎంసీ బరిలో 1333 మంది
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారంతో ముగియటంతో బరిలో ఏఏ పార్టీల తరఫున ఎందరుండేదీ తేలిపోయింది. ఇందులో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు మొత్తం 150 స్థానాల్లోనూ పోటీలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ 149, ఎంఐఎం 60, బీజేపీ 65, టీడీపీ 96, లోక్‌సత్తా 26, సీపీఎం 22, సీపీఐ 21 కౌన్సిలర్ స్థానాల్లో అభ్యర్థులను దించాయి. స్వతంత్ర అభ్యర్థులు 640 మంది, ఇతర రిజిస్టర్డు పార్టీలకు చెందిన వారు 49 మంది కూడా రంగంలో మిగిలారు. వచ్చే నెల 2వ తేదీన ఎన్నికలు జరుగనున్న విషయం విదితమే.