టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి: మంత్రి తలసాని | the development only with TRS : Minister talasani | Sakshi

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి: మంత్రి తలసాని

Jan 29 2016 5:45 PM | Updated on Aug 15 2018 9:30 PM

టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలోనే హైదరాబాద్ అన్ని రంగాలలో అభివృద్ధి చెంది విశ్వనగరంగా గుర్తింపు లభిస్తుందని... ఆదిశగా సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలోనే హైదరాబాద్ అన్ని రంగాలలో అభివృద్ధి చెంది విశ్వనగరంగా గుర్తింపు లభిస్తుందని... ఆదిశగా సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. నాచారం డివిజన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మేడల జ్యోతి మల్లికార్జున్‌గౌడ్ ఎన్నికల ప్రచారం శుక్రవారం నాచారంలోని హెచ్‌ఎంటీ నగర్, వీఎస్‌టీకాలనీ, స్నేహపురికాలనీ కాలనీలలో జరిగింది.

ఈ సందర్భంగా కాలనీలలో పాదయాత్ర చేస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కారుగుర్తుకు ఓటు వేసి మేడల జ్యోతిమల్లికార్జున్‌గౌడ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యతో పాటు స్థానికనేతలు మల్లికార్జున్‌గౌడ్, రాగిరి మోహన్‌రెడ్డి, నందికొండ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement