విజయమే లక్ష్యం
నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్‌ఎస్ బహిరంగ సభ
భారీగా జన సమీకరణకు కసరత్తు
సీఎం కేసీఆర్ ప్రసంగంపై అభ్యర్థుల ఆశలు
సిటీబ్యూరో: అధికార టీఆర్‌ఎస్ పార్టీ బల్దియా ఎన్నికల్లో గెలుపే లక్ష్యం గా శనివారం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేయాలని గ్రేటర్ పార్టీ విభాగం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఈ సభలో ప్రధాన ఉపన్యాసం చేయనున్నారు. దీంతో పార్టీ శ్రేణులను భారీ గా తరలించేందుకు ముఖ్య నేతలు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ఒక్కో డివిజన్ నుంచి వెయ్యి మందికి తక్కువ కాకుండా సభకు తరలించాల్సిందిగా అభ్యర్థులకు దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. జన సమీ కరణ విషయం లో డివిజన్లకు ఇన్‌చార్జులుగా నియమితులైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లు చొరవ తీసుకోవాలని పార్టీ ఆదేశించింది. వాహనాలను సొంతంగా సమకూర్చుకోవాలని అభ్యర్థులకు సూ చించింది. బహిరంగ సభ నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకు నే అన్ని దారులు గులాబీ తోరణా లు, కటౌట్లు, ఫ్లెక్సీలతో నిండిపోయా యి. సభకు హాజ రయ్యే వారికి అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్‌పరంగా జాగ్రత్త లు తీసుకుంటున్నారు. వాహనాల పా ర్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏర్పాట్లు పరిశీలన
సిటీబ్యూరో: టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను నగర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాద వ్, పద్మారావు గౌడ్‌లు శుక్రవారం పరిశీలించారు. సభకు నగరం నలుమూలల నుంచి లక్షలాదిగా జనం తరలిరానున్న నేపథ్యంలో ఎక్కడా అసౌకర్యానికి తావులేకుండా వేదిక, పార్కింగ్ ఏర్పాట్లు ఉండాలని నిర్వాహకులకు మంత్రులు సూచించారు.
విజన్ పైనే ఆశలు
గ్రేటర్‌లో ఎన్నికలకు సంబంధించిఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత స్టార్ ప్రచాకర్తలుగా హోరెత్తిస్తున్న విషయం విదితమే. కొంతమంది మం త్రులూ ప్రచారంలో పాల్గొని హామీల వర్షం గుప్పిస్తున్నారు. ఎవరెంతగా ప్రచారం చేసినాసీఎం కేసీఆర్ ప్రసంగం పైనే అభ్యర్థులు కోటి ఆశలు పెట్టుకున్నారు. రాబోయే ఐదేళ్లకు టీఆర్‌ఎస్ విజన్‌ను ఆవిష్కరిస్తేనే ఓటర్లలో నమ్మకం పెరుగుతుందని అభ్యర్థులు చెబుతున్నారు.