![CM KCR Comments On Prime Minister Narendra Modi At Kongara Kalan - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/25/1.jpg.webp?itok=s8t09nHG)
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇండియాలో దరిద్రపుగొట్టు వాతావరణం చూస్తున్నామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం.. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ బహిరంగ సభలో మాట్లాడుతూ, పంటల తెలంగాణ కావాలా? మంటల తెలంగాణ కావాలా? అంటూ ప్రశ్నించారు.
చదవండి: ‘గులాబీ’ బాస్ ఆదేశాలు.. ఆ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు..?
‘‘మౌనంగా భరిద్ధామా? పిడికిలి బిగిద్దామా?. మౌనంగా భరిస్తే మతచిచ్చు పెట్టే మంటలు వస్తాయి. తమిళనాడు, బెంగాల్, ఢిల్లీలో ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మనం నిద్రపోతే పెద్ద ప్రమాదానికి లోనవుతాం. హైదరాబాద్ 24 గంటల కరెంట్ ఉంటే.. ఢిల్లీలో ఉండదు. ప్రధాని కంటే పెద్ద పదవి ఉందా?. ప్రధాని కుట్రలు చేసి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడుతున్నారు. నేను బతికుండగా తెలంగాణను ఆగం కానివ్వం’’ అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment