Kongara Kalan
-
రానున్న 10 ఏళ్లలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రానున్న 10 సంవత్సరాలలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలను ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ శివారు కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్‌కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ చైర్మన్ యాంగ్ లియూ, సీఈవోలు, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణను తమ తయారీ కేంద్రంగా ఎంచుకున్న ఫాక్స్ కాన్ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. కంపెనీ నిర్మాణం, తయారీ ప్లాంట్లను విస్తరించడంలో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. ఫాక్స్‌కాన్ రంగారెడ్డి జిల్లాకు రావడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలోలో కొంగరకలాన్ గుర్తు పట్టలేనంతగా మారబోతున్నదని చెప్పారు. రూ. 4 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఫాక్స్‌కాన్ పరిశ్రమతో 35 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ఫాక్స్‌కాన్ హామీ ఇచ్చిందని తెలిపారు. అటు కంపెనీ నిర్మాణం జరుగుతుంటే మరోవైపు యువతకు శిక్షణ ఇస్తామన్నారు. యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ రోజు తెలంగాణకు చరిత్రాత్మక సందర్భమని కేటీఆర్ అన్నారు. గత తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని. దేశంలోనే ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు . చిన్న రాష్ట్రమైనా 30 శాతం కంటే అధిక అవార్డులను సాధించిందన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. దేశంలోని ఐటీ ఉద్యోగాల్లో ప్రతి మూడింట్లో ఒక ఉద్యోగం మనదేనని చెప్పారు చదవండి: కర్ణాటక ఫలితం.. తెలంగాణలో ఇప్పుడెలా?.. బీజేపీ బేజార్, 'కారు'కు ఫియర్.. -
పంటల తెలంగాణ కావాలా? మంటల తెలంగాణ కావాలా?: సీఎం కేసీఆర్
-
నేను బతికుండగా.. ప్రధానిపై కేసీఆర్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇండియాలో దరిద్రపుగొట్టు వాతావరణం చూస్తున్నామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం.. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ బహిరంగ సభలో మాట్లాడుతూ, పంటల తెలంగాణ కావాలా? మంటల తెలంగాణ కావాలా? అంటూ ప్రశ్నించారు. చదవండి: ‘గులాబీ’ బాస్ ఆదేశాలు.. ఆ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు..? ‘‘మౌనంగా భరిద్ధామా? పిడికిలి బిగిద్దామా?. మౌనంగా భరిస్తే మతచిచ్చు పెట్టే మంటలు వస్తాయి. తమిళనాడు, బెంగాల్, ఢిల్లీలో ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మనం నిద్రపోతే పెద్ద ప్రమాదానికి లోనవుతాం. హైదరాబాద్ 24 గంటల కరెంట్ ఉంటే.. ఢిల్లీలో ఉండదు. ప్రధాని కంటే పెద్ద పదవి ఉందా?. ప్రధాని కుట్రలు చేసి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడుతున్నారు. నేను బతికుండగా తెలంగాణను ఆగం కానివ్వం’’ అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు. -
కొంగర కలాన్ టు కొడంగల్ ప్రభంజనం వరకు..
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తవకముందే.. ముందుస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు ప్రకటించి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలనం సృష్టించారు. ప్రతిపక్షాలు ఇంకా ఎన్నికలకు సిద్ధం కాకముందే.. ఆయన ముందస్తు ఎన్నికల ప్రకటనతో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. తన నాలుగేళ్ల పాలనలోని అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో ‘ప్రగతి నివేదన సభ’ ఏర్పాటుచేసిన కేసీఆర్.. ఆ సభలో ముందస్తు సంకేతాలు ఇచ్చారు. సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ఏకంగా 105మంది అభ్యర్థులను ప్రకటించి.. ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. వంద స్థానాలు టార్గెట్‌గా ప్రచారంలో దూసుకుపోయిన కేసీఆర్.. కోమటిరెడ్డి, జానారెడ్డి, రేవంత్‌రెడ్డి లాంటి దిగ్గజాలను ఓడించడం ద్వారా పరిపూర్ణ విజయాన్ని అందుకున్నారు. అసెంబ్లీ రద్దు నుంచి.. ఫలితాల్లో టీఆర్ఎస్ ప్రభంజనం వరకు జరిగిన పరిణామాలు తేదీల వారీగా.. సెప్టెంబర్ 2న: కొంగర కలాన్‌లో ‘ప్రగతి నివేదన సభ’ను టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 6న: తెలంగాణ అసెంబ్లీ అధికారికంగా రద్దయ్యింది. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి ఆమోదించిన తీర్మానాన్ని కేసీఆర్ గవర్నర్‌కు సమర్పించగా.. ఆయన ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్దర్మ సీఎంగా ఉండలాంటూ కేసీఆర్‌ను గవర్నర్ కోరారు. ఆ తర్వాత అసెంబ్లీ రద్దు తీర్మాన ప్రతిని శాసనసభ కార్యదర్శి ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్, సీఎస్ ఎస్.కె. జోషికి అందజేయడం కూడా చకచకా జరిగిపోయాయి. అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి సమావేశంలోనే 105 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్.. మరో సంచలనానికి తెరతీశారు. వీరిలో 103 మంది సిట్టింగ్‌లకే ఇవ్వగా.. చెన్నూర్, ఆంథోల్ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. సెప్టెంబర్ 7న: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ‘ప్రజా ఆశీర్వాద సభ’తో కేసీఆర్ ఎన్నికల ప్రచార భేరీ మోగించారు. సిద్ధిపేట సమీపంలోని కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆయన అక్కడ నుంచి బహిరంగ సభకు వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు నిర్ణయంపై స్టే ఇవ్వాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్, కాంగ్రెస్ నాయకురాలు డికే ఆరుణలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సెప్టెంబర్ 11: రాష్ట్రానికి ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ ఉమేష్ సిన్హా తదితరులు రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి రజత్ కుమార్‌తో పాటు ఇతర అధికారులతో సమావేశమ య్యారు. ఓటర్ల జాబితా కూర్పుకు షెడ్యూల్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల: 10-09-2018 అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ: 10-09-2018 నుంచి 25-09-18 గ్రామ సభలు, ప్రత్యేక క్యాంపులు: 15-09-2018, 16-09-2018 రెండు రోజులు అభ్యంతరాల తర్వాత సవరణల లిస్టు: 04-10-2018 ఓటర్ల జాబితా ముద్రణ: 07-10-2018 తుది జాబితా: 08-10-2018 (కోర్టు తీర్పు అనంతరం 12-10-18న తుది జాబితా విడుదల చేశారు) అక్టోబరు 3, 4, 5 తేదీల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజామాబాద్, మహబూబ్‌నగర్(వనపర్తి), నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థాయి సభలు నిర్వహించారు. అక్టోబర్ 4: జోగులాంబ- గద్వాల జిల్లా నుంచి ఎన్నికల శంఖారావాన్ని కాంగ్రెస్ పూరించింది . జోగులాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 5: ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ టీపీసీసీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో తుది ఎన్నికల జాబితాపై హైకోర్టు స్టే ఇచ్చింది అక్టోబర్ 12: అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ సహా ఇతరులు వేసిన పిటీషన్లను హైకోర్టులో ధర్మాసనం కొట్టివేసింది. అక్టోబర్ 20: తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ (భైంసా, కామారెడ్డి) ప్రారంభించారు. ఓవరాల్‌గా రాహుల్ గాంధీ 6 సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొని 26 నియోజకవర్గాల్లో 17 సభలు నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ 06-10-18 నోటిఫికేషన్ 12-11-18 నామినేషన్ల గడువు 19-11-18 పరిశీలన 20-11-18 ఉపసంహరణ 22-11-18 పోలింగ్ 07-12-18 ఓట్ల లెక్కింపు 11-12-18 అక్టోబర్ 20: 38 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల చేశారు. నవంబర్ 2: 28 మంది సభ్యులతో బీజేపీ రెండో జాబితా విడుదల చేశారు. నవంబర్ 13: 65 మంది సభ్యులతో కాంగ్రెస్ తొలి జాబితా, 9 మంది సభ్యులతో టీడీపీ తొలి జాబితా విడదుల చేశారు. నవంబర్ 14: 10 మంది సభ్యులతో కాంగ్రెస్ రెండో జాబితా, ఇద్దరి సభ్యులతో టీడీపీ రెండో జాబితా విడుదల చేశారు. నవంబర్ 14: గజ్వేల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్, సిద్దిపేట టీఆర్ఎస్ అభ్యర్థిగా హరీశ్ రావుల నామినేషన్ దాఖలు చేశారు. నవంబర్ 15: 20 మంది సభ్యులతో బీజేపీ మూడో జాబితా విడుదల చేశారు. నవంబర్ 16: 7 మంది సభ్యులతో బీజేపీ నాలుగో జాబితా విడుదల చేశారు. నవంబర్ 17: 13 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితా, టీజేఎస్ నలుగురు అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేశారు. నవంబర్ 17: హుజుర్ నగర్ ప్రజాకూటమి అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నవంబర్ 19: సిరిసిల్ల టీఆర్ఎస్ అభ్యర్థిగా కేటీఆర్ నామినేషన్, కొడంగల్ ప్రజాకూటమి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నవంబర్ 18: 25 మంది అభ్యర్థులతో బీజేపీ ఐదో జాబితా, టీజెఎస్ మేనిఫెస్టో విడుదల చేశారు. నవంబర్ 18: బీజేపీ మేనిఫెస్టో విడుదల చేశారు. నవంబర్ 20: టీడీపీ మేనిఫెస్టో విడుదల చేశారు. నవంబర్ 23: సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు మేడ్చల్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. నవంబర్ 26: ప్రజా కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. నవంబర్ 27: కాంగ్రెస్ ప్రజా మేనిఫెస్టో విడుదల చేసింది. నవంబర్ 27: ప్రధాని మోదీ నిజామాబాద్, మహబూబ్‌నగర్ సభల్లో పాల్గొన్నారు. నవంబర్ 28: ఖమ్మంలో తొలి సారిగా రాహుల్, చంద్రబాబులు కలిసి తొలి బహిరంగ సభలో పాల్గొన్నారు. డిసెంబర్ 2: టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసింది డిసెంబర్ 3: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. డిసెంబర్ 4: కొడంగల్‌లో అత్యంత ఉద్రిక్తత మధ్య టీఆర్ఎస్ ‘ప్రజా ఆశీర్వాద సభ’ను జరిగింది. కేసీఆర్ సభను వ్యతిరేకిస్తూ స్థానిక అభ్యర్థి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొడంగల్ బంద్‌కు పిలుపునిచ్చారు. అనంతరం రేవంత్ అరెస్ట్.. విడుదల వంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటికే కొడంగల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన కేసీఆర్.. తన సభను రేవంత్ అడ్డుకోవాలని చూడటంతో కొడంగల్‌లో విజయం సాధించాలని కేసీఆర్ సవాల్‌గా తీసుకున్నారు. విజయం సాధించారు. డిసెంబర్ 5: గజ్వేల్‌లో టీఆర్ఎస్ చివరి ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 7: ప్రశాతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్. 73.2 శాతం నమోదయిన పోలింగ్ డిసెంబర్ 11: టీఆర్ఎస్ అఖండ మెజారిటీతో ఘనవిజయం సాధించింది విస్త్రతంగా కాంగ్రెస్ ప్రచారం సోనియా, రాహుల్‌తో పాటు కాంగ్రెస్ జాతీయ నాయకులు అహ్మద్ పటేల్, జైరాంరమేశ్, జైపాల్‌రెడ్డి, మల్లిఖార్జున ఖర్గే, ఆజాద్, చిదంబరం, కపిల్ సిబల్, వీరప్పమొయిలీ, డి.కె.శివకుమార్, ఆనంద్‌శర్మ, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, ఉమెన్ చాందీ, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు, అజహారుద్దీన్, ఖుష్బూ, నగ్మా, సూర్జేవాలా, అభిషేక్ సింఘ్వీ, మనీష్ తివారీ తదితరులు ప్రచారం చేశారు. స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్‌లతోపాటు మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం నిర్వహించారు. బీజేపీ దూకుడుగా ప్రచారం ప్రధాని మోదీతోపాటు బీజేపీ జాతీయ అధ్య క్షుడు అమిత్‌షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎం లు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్‌సింగ్ చౌహాన్, ఫడ్నవిస్, రమణ్‌సింగ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, సాధ్వీ నిరంజన్ జ్యోతి, సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ, సంతోశ్ గంగ్వార్, జగత్ ప్రకాశ్ నడ్డా, పురుషోత్తం రూపాల, జువాల్ ఓరమ్, మాజీ మంత్రి పురంధేశ్వరి సహా మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు 180కి పైగా సభల్లో పాల్గొన్నారు. స్వామి పరిపూర్ణానంద 80కి పైగా సభల్లో పాల్గొన్నారు. కేసీఆర్ వన్ మ్యాన్ షో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అక్టోబర్ 19 నుంచి పూర్తిస్థాయిలో ప్రచారం చేశారు. అక్టోబర్ 24, నవంబర్ 1న రెండు రోజులు మినహా ప్రతిరోజు సగటున నాలుగు నుంచి తొమ్మిది సభల్లో పాల్గొన్నారు. చివరిరోజు గజ్వేల్‌లో ఒకే సభతో ప్రచారం పూర్తిచేశారు. కొంగరకలాన్ సభ మినహాయిస్తే.. మొత్తం 87 బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. వైరా, భద్రాచలం, అశ్వారావుపేట సెగ్మెంట్లలో మినహా 116 అసెంబ్లీ సెగ్మెంట్లనూ ఆయన కవర్ చేశారు. -
కేసీఆర్ మళ్లీ వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ
హైదరాబాద్: వచ్చే ఎన్నిక ల్లో కేసీఆర్‌కు మళ్లీ పట్టం కడితే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేస్తారని, ఇప్పటికే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర ‡పరిస్థితుల్లో ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. నిరుద్యోగులు, విద్యార్థు లు, మహిళలు, దళితులందరికీ అన్యాయం చేసిన సీఎంకు తిరిగి ఆశీర్వదించమని అడిగే నైతికహక్కు ఉందా? అని ప్రశ్నించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ మోసాలు, వైఫల్యాలు, అణచివేతలపై కొంగరకలాన్‌లోనే నవంబర్ 6న ‘ప్రజా ఆగ్రహ సభ’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు బీజేపీ, టీఆర్ఎస్ మినహా దేశంలోని అన్ని పార్టీల ప్రధాన నాయకులను పిలవనున్నట్లు చెప్పారు. ఈ సభ సన్నాహకాల్లో భాగంగా ఈ నెల 9న ఎమ్మార్పీఎస్ జాతీయస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ అత్యంత పెద్ద సభగా ప్రకటించుకున్న వరంగల్ సభకు 10 నుంచి 15 లక్షలు వరకు ప్రజలు రాగా, కొంగర్‌కలాన్ సభకు 5 లక్షల మంది రాలేదన్నారు. -
నిర్మానుష్యంగా కొంగరకలాన్
ఇబ్రహీంపట్నంరూరల్ : లక్షలుగా తరలివచ్చిన ప్రజలను ఆ గ్రామం అక్కున చేర్చుకుంది. టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభకు వేదికగా నిలిచిన కొంగరకలాన్ ప్రస్తుతం బోసిపోయింది. సభ ఏర్పాట్లు ప్రారంభమైన పది రోజుల నుంచి అక్కడ సందడి నెలకొంది. ప్రతి రోజూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకుల రాకపోకలతో రద్దీగా మారింది. సభకు తరలివచ్చిన జనంతో రహదారులు కిక్కిరిపోయాయి. జనం నినాదాలు, మైకుల శబ్ధాలతో హోరెత్తిన ఆ ప్రాంతం సోమవారం తెల్లారే సరికి మూగబోయింది. ఆదివారం ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులు పడ్డారు. మరుసటి రోజు ఒక్క వాహనం కూడా కనిపించలేదు. కలెక్టరేట్ వద్దకు వెళ్లే వారు కూడా లేకుండా పోయారు. ప్రగతి సభ కోసం ఏర్పాటు చేసిన కార్పెట్‌ను తీసేశారు. గ్యాలరీల్లో ఏర్పాటు చేసిన కుర్చీలను ప్రాంగణం నుంచి తరలించారు. సభ ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త, వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లను తొలగించే పనిలో పడ్డారు. సూమారు 2వేల ఎకరాల్లో చెత్త ఎత్తివేయడానికి టీఆర్ఎస్ పార్టీ పనులు చేపడుతోంది. పర్యావరణానికి ముప్పు రాకుండా శుభ్రం చేస్తున్నారు. మోబైల్ మూత్రశాలను ప్రాంగనం నుంచి తరలించారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో శుభ్రం చేసేలా చర్యలు చేపడతామని స్థానిక టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. -
ఔటర్.. రిపేర్
సాక్షి, సిటీబ్యూరో: రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఆదివారం టీఆర్ఎస్ నిర్వహించిన ‘ప్రగతి నివేదన’ బహిరంగ సభ నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లో ప్రత్యేక దారులు ఏర్పాటు చేసిన విషయం విదితమే. మెయిన్ క్యారేజ్‌వే నుంచి సర్వీసు రోడ్డు వరకు వేసిన తాత్కాలిక రహదారుల మూసివేతపై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) దృష్టి సారించింది. ప్రధానంగా రావిర్యాల, తుక్కుగూడ, బొంగళూర్ మార్గంలో మంగళవారం నుంచి ఓఆర్ఆర్ మెయిన్ క్యారేజ్‌వే మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. మెయిన్ క్యారేజ్‌వే నుంచి సర్వీసు రోడ్డు వరకు వేసిన తాత్కాలిక మట్టి రహదారులను తొలగించడంతో పాటు ఓఆర్ఆర్ పటిష్టత దెబ్బతినకుండా ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో పనులుచేపట్టనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థన మేరకు ఆదివారం ఉదయం 9గంటల నుంచి రాత్రి 12గంటల వరకు వెళ్లిన వాహనాల టోల్ ఫీజు చెల్లింపులపై తార్నాకలోని హెచ్ఎండీఏ కేంద్ర కార్యాలయంలో కమిషనర్ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన అధికారులు సమవేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఆ రోజు వచ్చి వెళ్లిన వాహనాల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని టోల్ ఫీజు చెల్లించాలంటూ టీఆర్ఎస్ పార్టీకి లేఖ రాయనున్నారు. టోల్ ఫీజుపై నేడు స్పష్టత... నగరాభివృద్ధిలో 158కి.మీ ఔటర్ కీలకంగా మారింది. వివిధ జాతీయ, రాష్ట్ర రహదారులకు అనుసంధానం చేయడంతో ఔటర్‌పై వాహనాల రద్దీ నానాటికీ పెరుగుతోంది. రోజు సగటున లక్షకు పైగా వాహనాలు వెళ్తున్నట్లు అంచనా. టోల్ రుసుములను వసూలు చేసేందుకు గాను 19 ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద 180 టోల్ లేన్లు ఉన్నాయి. ఓఆర్ఆర్లో రోజుకు లక్షకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. తద్వారా హెచ్ఎండీఏకు రోజు రూ.87లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా టోల్ వసూలు చేస్తున్న హెచ్ఎండీఏకు ఈ సంస్థ ప్రతి నెలా రూ.26 కోట్లు చెల్లిస్తోంది. ఇటీవల వాహనదారుల సౌలభ్యం కోసం ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన స్మార్ట్‌కార్డుల ద్వారా టోల్ చెల్లింపుతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాయిదా వేసిన హెచ్ఎండీఏ అధికారులు... సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభకు వచ్చే వాహనాల టోల్ వసూలు చేస్తే అష్టకష్టాలు పడాల్సి వస్తోందన్న విషయాన్ని ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఆ రోజు వచ్చే వాహనాలకు టోల్ చెల్లిస్తామంటూ హెచ్ఎండీఏకు లేఖ రాయడంతో అందుకు అనుమతించారు. దీంతో లక్షలాది వాహనాలు ఔటర్‌పైకి వచ్చినా ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తలేదు. ఈ టోల్ ఫీజు వసూలుపైనే హెచ్ఎండీఏ అధికారులు మంగళవారం ఓ నిర్ణయానికి వచ్చి టీఆర్ఎస్ పార్టీకి చార్జీలు చెల్లించాలంటూ లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నారు. వర్షంతో ఇబ్బందులు... ప్రగతి నివేదన సభకు అనుబంధంగా వాహనాల పార్కింగ్ కోసం రావిర్యాల, తుక్కుగూడ, బొంగళూర్ మార్గంలో ఔటర్ నుంచి కొత్తగా నిర్మించిన 8 మట్టి రహదారుల తొలగింపు అధికారులకు తలనొప్పిగా మారింది. మంగళవారం నుంచి పనులు ప్రారంభించి వాహనదారుల ఇబ్బందులపై దృష్టి సారిస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే కొంతమంది వాహనదారులు టోల్ చెల్లించాల్సి వస్తుందని ఈ మార్గాల ద్వారా సర్వీసు రోడ్ల మీదకు వచ్చి వెళ్లారని టోల్ వసూలు చేస్తున్న ప్రైవేట్ సంస్థ అధికారులు వాపోతున్నారు. సాధ్యమైనంత తొందరగా ఈ రహదారులను మూసివేయాలని కోరుతున్నారు. -
ప్రగతి సభకు పోస్టుమార్టం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రగతి నివేదనపై టీఆర్ఎస్ నాయకత్వం అంతర్గత మథనం చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా భావించిన సభకు ఆశించిన స్థాయిలో జన సమీకరణ జరపకపోవడంపై పోస్టుమార్టం నిర్వహిస్తోంది. కొంగరకలాన్‌లో సభ నిర్వహిస్తున్నందున కనిష్టంగా ఐదారు లక్షల మందిని తరలించాలని జిల్లా నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐదారు లక్షలు దేవుడెరుగు కనీసం మూడు లక్షల మందిని కూడా తరలించకపోవడంపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ప్రగతి నివేదన సభకు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన గులాబీ బాస్.. ప్రజల తరలింపుపై లెక్కలు తీశారు. అలాగే నిఘావర్గాలిచ్చిన సమాచారాన్ని క్రోడీకరించిన అధిష్టానం.. ప్రగతి సభకు జన సమీకరణలో జిల్లా నాయకత్వం వైఫల్యం చెందినట్లు అంచనా వేసింది. నివేదన సభకు ఆతిథ్యమిచ్చిన ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలే కాకుండా షాద్‌నగర్, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల సెగ్మె ంట్ల నుంచి నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా జనాలను సమీకరించలేదని తేలింది. బహిరంగ సభకు ముహూర్తం ఖరారు కాగానే రవాణా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి నివాసంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, ఇతర ప్రజాప్రతినిధుల ప్రత్యేక భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రతి సెగ్మెంట్ నుంచి సగటున 35 వేల నుంచి 40వేల మందిని సభకు తరలించాలని నిర్ణయించారు. కేవలం ప్రజా ప్రతినిధులేగాకుండా ఆశావహులు సైతం బలప్రదర్శన చేసుకునేందుకు భారీగా జనాలను తీసుకొస్తారని అంచనా వేశారు. ఈ లెక్కలు తప్పడంపై తాజాగా గులాబీ నేతలు చింతిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి జనాలు పోటెత్తుతారని ఎవరికివారు మిన్నకుండడం కూడా ఈ పరిస్థితికి దారితీసిందని అంటున్నారు. ఆర్థిక వనరులు సమకూర్చినా ఆశించిన స్థాయిలో జన సమీకరణ చేయలేకపోవడాన్ని హైకమాండ్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి నేతలపై క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్న గులాబీ దళపతి.. త్వరలోనే వీరికి క్లాస్ పీకనున్నట్లు తెలుస్తోంది. బాగా పనిచేశారు.. బహిరంగ సభ నిర్వహణలో విశేష కృషి చేసిన వారిని అభినందించేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్వల్ప వ్యవధిలో ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పూర్తి చేసిన వారికి ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించిన ఆయన క్యాంపు ఆఫీసుకు రావాలని ఆహ్వానించారు. నిఘా విభాగం మల్లగుల్లాలు! ప్రగతి నివేదన సభకు హాజరైన ప్రజల సంఖ్య తేల్చడంలో ఇంటలిజన్స్ విభాగం తలమునకలైంది. మంగళవారం భేటీ అయిన నిఘా బృందాలు ఏయే జిల్లా, నియోజకవర్గాల నుంచి ఎన్ని వాహనాలు, ఎంతమంది వచ్చారనే అంశంపై సేకరించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. అదే సమయంలో రాష్ట్రం నలు దిక్కుల నుంచి ఒకేసారి జనప్రవాహం రావడంతో ట్రాఫిక్‌ను నియంత్రించలేకపోయినట్లు వివరించినట్లు తెలిసింది. సగం మంది సభకు రాకుండా రోడ్లపైనే నిలబడ్డారని, మరికొందరు ముందుకు రాలేక వెనక్కిపోయినట్లు పార్టీ వర్గాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం.. పోలీసుల బందోబస్తు నిర్వహించిన తీరుపై పెదవి విరిచినట్లు తెలిసింది. నిర్దేశిత మార్గాల గుండా వాహనాలను సభాస్థలికి చేర్చడంలో ఆ శాఖ వైఫల్యం ఉందని అన్నట్లు సమాచారం. -
అభివృద్ధి యజ్ఞం ఆగొద్దు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సమాజ సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి యజ్ఞం ఆగకూడదని, కొనసాగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణను త్వరలోనే సాకారం చేస్తామన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో జరిగిన ప్రగతి నివేదన సభలో టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు కేసీఆర్ వివరించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. చిమ్మచీకట్లను చీల్చుకుని.. ‘‘ఉద్యమ సమయంలో ఒకసారి ఢిల్లీలో ఉన్నప్పుడు జయశంకర్‌గారు, విద్యాసాగర్రావుగారు, నేను.. తెలంగాణ వచ్చాక ఏం చేయాలనే విషయంపై చర్చ మొదలుపెట్టాం. రాత్రి ఒంటి గంట అయింది. అప్పుడు విద్యాసాగర్‌రావు.. ‘తెలంగాణ వచ్చాక మిగిలింది ఆలోచిద్దాం. మీరు పడుకోండి’ అన్నారు. జయశంకర్‌సారు నేను అలాగే చర్చించుకుంటు న్నాం. మూడున్నరకు విద్యాసాగర్రావుగారు వచ్చి.. ‘మీరింకా పడుకోలేదా’ అన్నరు. అప్పుడూ చర్చ కొనసాగించాం. తెలంగాణ పరిస్థితులను, ఆత్మను జయశంకర్ సార్ అణువణువు అన్వేషించారు. చెరువుల విధ్వంసంతో భూగర్భ జలాలు అడుగంటిపోయిన వైనాన్ని.. కరెంటు పరిస్థితులను చర్చించాం. జయశంకర్‌సార్‌తో చర్చించిన సమయంలో భూగర్భ జలాల సమస్యను గుర్తించి మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టాం. కరెంటు విషయంలోనూ అంతే. తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు బాధలు ఉంటాయని సమైక్య పాలకులు అన్నరు. అప్పటి సమైక్య సీఎం ఒకరు తెలంగాణలో కరెంటు ఉండదని కట్టె పెట్టి చూపించారు. శాశ్వతంగా అలాగే ఉంటుందనే అన్నారు. తెలంగాణ రాష్ట్రం చిమ్మచీకట్ల నుంచి 24 గంటలు కరెంటుతో వెలుగు జిలుగులతో వరాజిల్లుతోంది. దేశంలో అన్ని రంగాలకు నిరంతరంగా, వ్యవసాయానికి ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. త్వరలోనే తెలంగాణను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చుతామని హామీ ఇస్తున్నా. ఏమైతోందని ఏడ్చిన.. సమైక్య పాలనలో తెలంగాణ జీవన విధ్వంసం అంతాఇంతా కాదు. అనేకసార్లు ఆలోచించా. ఏమైతోందని ఏడ్చిన. సిరిసిల్లకు పోయినప్పుడు అక్కడ గోడలపై ‘చేనేత కార్మికుల ఆత్మహత్యలు వద్దు’ అని కలెక్టర్ రాయించిన దృశ్యాలు కంటబడ్డాయి. 70 ఏళ్ల స్వాతంత్య్రంలో చావులు గోడలపై చూడాల్సిన పరిస్థితికి బాధపడ్డా. పోచంపల్లిలో ఒకేరోజు ఏడుగురు చేనేత కార్మికులు విషంతాగి చనిపోయారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలని అప్పటి ముఖ్యమంత్రిని కోరినా పట్టించుకోలేదు. భిక్షాటన చేసి రూ.మూడు నాలుగు లక్షలు ఇచ్చి అండగా ఉన్నం. సిరిసిల్లలో ఒకేరోజు 11 మంది చేనేత కార్మికులు చనిపోతే టీఆర్ఎస్ తరఫున మేమే ట్రస్టు పెట్టి ఆదుకున్నం. ప్రాణాలు తీసుకోవద్దు.. తెలంగాణ వచ్చేదాకా ఆగాలని కోరిన. ఇప్పుడు ఇయ్యాల తెలంగాణలో నేతన్నల ముఖాలు వెలిగిపోతున్నాయి. బతుకమ్మ చీరలు, ప్రభుత్వ గురుకులాలు, పాఠశాల విద్యార్థుల యూనిఫారా లతో జీవన భద్రత వచ్చింది. నెలకు రూ.17 వేల నుంచి రూ.20 వేలకు ఆదాయం వస్తోంది. గొర్రెలు, బర్రెలు పెంచడం గొప్ప వృత్తే.. ఉమ్మడి రాష్ట్రంలో చీప్ లిక్కర్ కంపెనీలతో ప్రభు త్వాలు కుమ్మక్కై హైదరాబాద్‌లో కల్లు డిపోలను మూసేయించాయి. కోర్టులు తీర్పు ఇచ్చినా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తాటి చెట్లపై వసూలు చేసే పన్నును రద్దు చేశాం. కల్లు గీత కార్మికులకు అండగా నిలుస్తున్నాం. నయా ఆర్థిక వేత్తలు ఐటీ, పారిశ్రామిక అభివృద్ధినే అభివృద్ధి అంటున్నారు. గొర్రెలు, బర్రెలు పెంచడం కూడా గొప్ప వృత్తే. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో 70 లక్షల గొర్రెల ను పంపిణీ చేశాం. వాటికి 30 లక్షల పిల్లలు పుట్టాయి. మొత్తంగా రాష్ట్రంలోని గొల్లకుర్మలు రూ.1,500 కోట్లు సంపాదించారు. 2.11 లక్షల మంది రైతులకు పాడి గేదెలు పంపిణీ చేశాం. ఆడపిల్లల పాదాలు కడిగి చూపిస్తం ‘వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికీ మంచినీళ్లు ఇయ్యకపోతే ఓట్లు అడగం’ అని దేశంలో ఏ ము ఖ్యమంత్రీ చెప్పలేదు. మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్‌తో ఇప్పుడే మాట్లాడా. 22 వేల గ్రామా లకు నీరు ఇస్తున్నట్లు చెప్పారు. మరో 1,300 గ్రామాల పనులు పూర్తవుతున్నాయి. ఎన్నికలకు ఆరు నెలల ముందే నీళ్లు సరఫరా చేస్తాం. ఆడపి ల్లల పాదాలు కడిగి చూపిస్తం. పాలమూరు, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో వలసపోయిన పేద కుటుంబాలు తిరిగి ఊళ్లోకి వస్తున్నాయి. మంత్రి హరీశ్‌రావు పట్టుదలతో లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు వచ్చింది. పాలమూరు జిల్లాలో రేషన్ కార్డులను బదిలీ చేయాలని దరఖాస్తులు పెట్టుకుం టున్నారు. భవిష్యత్ ఇంకా ఉంది. కీమానాయక్ కన్నీళ్లు.. కల్యాణలక్ష్మికి నాంది.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 465 కార్యక్రమాలు ప్రారంభించాం. అనేక విషయాలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది. ఉద్యమ సమయంలో నేను, మంత్రి చందులాల్ కలిసి ములుగులో ఒక తండాకు వెళ్లాం. అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన బానోత్ కీమానాయక్ ఒక్కతీరుగా దుఃఖటిల్లాడు. ఏమైందని అడిగిన. ‘శ్రీరామనవమి తర్వాత బిడ్డ పెళ్లి చేసేందుకు ఇంట్లో రూ.50 వేలు పెట్టిన. అంతా బూడిదైంది’ అన్నడు. నేను పెళ్లి చేస్త అని భరోసా ఇచ్చిన. అన్నట్లుగానే రూ.లక్ష పంపించిన. పెళ్లికి వెళ్లిన. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చందాలు వసూలు చేసి ఎస్సీ, ఎస్టీ బిడ్డల పెళ్లిళ్లు చేయించిన. ఆడపిల్ల గుండెలమీద కుంపటి కాదని చెప్పేందుకే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రారంభించాం. శాశ్వత ధనిక రాష్ట్రం కావాలె.. ఎప్పుడైనా రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు కొత్త నిర్ణయాలు తీసుకుంటాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటి మంత్రివర్గ సమావేశంలోనే 42 నిర్ణయాలు తీసుకున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా మరో 72 అంశాలను అమలు చేస్తున్నాం. రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, వృత్తి కులాల పథకాలు వంటివి మేనిఫెస్టోలో పెట్టలేదు. నాయీ బ్రాహ్మణులకు సెలూన్లకు సరఫరా చేసే కరెంటును కమర్షియల్ నుంచి మార్చి తక్కువ చార్జీలు అయ్యేలా రాయితీ ఇస్తున్నాం. కేజీ నుంచి పీజీ విధానంలో భాగంగా అన్ని వర్గాలకు గురుకులాలను నిర్మిస్తున్నాం. గిరిజన తండాల, గోండు గూడాల సుదీర్ఘ ఆకాంక్ష అయిన ప్రత్యేక గ్రామ పంచాయతీలను సాకారం చేశాం. ‘మావ నాటే.. మావ రాజ్’ అనే నినాదాన్ని ఆచరణలోకి తెచ్చేలా వారే పరిపాలించేలా నిర్ణయం తీసుకున్నాం. సంక్షేమ, తక్షణ ఉపశమన కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఇవి సరిపోవు. తెలంగాణ రాష్ట్రం శాశ్వత ధనిక రాష్ట్రంగా ఉండాలి. కోటి ఎకరాలకు నీరు అందిస్తాం. ఈ దిశగా కొన్ని ప్రాజెక్టులు చేపట్టాం. పాలమూరు, కాళేశ్వరం, దేవాదుల, సీతారామసాగర్ పూర్తవుతున్నాయి. గంధర్వులు రాలే.. హిమాలయాలకు పోయి రాలే.. కొత్త కుండలో ఈగ సొచ్చినట్లు రాష్ట్రం వచ్చిన కొత్తలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. దృక్పథం మారితే ఫలితాలు ఉంటాయి. వరుసగా నాలుగేళ్లు ఆర్థిక వృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 2018–19లో ఇప్పటి వరకు వృద్ధిరేటు 17.83 శాతం ఉంది. బ్రహ్మాండంగా ఆదాయం పెరుగుతోంది. అప్పటికీ ఇప్పటికీ అదే తేడా. గంధర్వులు రాలేదు. హిమాలయాల్లో చెట్ల రసం తాగి రాలేదు. మారిందల్లా దృక్పథమే. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో నేతల అవినీతి చూశాం. ఎన్నో ఉన్నాయి.. ఒక్క ఇసుక విషయం చెప్పుకుందాం. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుకపై ప్రభుత్వానికి రూ.10 కోట్ల ఆదాయం వచ్చింది. టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో రూ.1,980 కోట్ల ఆదాయం వచ్చింది. రాజకీయ అవినీతిని నిర్మూలించి, కడుపు మాడ్చుకుని, నోరు కట్టుకుని పని చేస్తే ఇలా అయ్యింది. పెంచిన సంపద ప్రజలకు పంచుతాం. సొల్లు పురాణం చెప్పను.. అన్నీ మీ కళ్ల ముందే ఉన్నయి.. మైనారిటీల సంక్షేమంలో మన రాష్ట్రం ఎంతో చేస్తోంది. మైనారిటీ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.4 వేల కోట్లు కేటాయించింది. మన రాష్ట్ర ప్రభుత్వం రూ.రెండు వేల కోట్లను కేటాయించింది. నేను మాటలు చెప్పడం కాదు. అభివృద్ధి, చెరువులు, కరెంటు, నీళ్లు, నిర్మించే ప్రాజెక్టులు మీ దగ్గరే ఉంటున్నాయి. కృష్ణా, గోదావరి నీళ్లు మీ ఇంటికే వస్తున్నయి. ప్రాజెక్టులు కట్టడం మీ కళ్ల ముందే ఉంది. సొల్లు పురాణం నేను చెప్పను. అన్నీ మీ కళ్ల ముందే ఉన్నాయి. ప్రగతి నివేదిన మీ ముందే ఉంది. కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ సాకారం కావాలె. ఐటీ, పరిశ్రమలు అభివృద్ధి చెందాలె. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగాలె. బంగారు తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ, సంక్షేమ తెలంగాణ కావాలె. గొప్పగా బాగుపడదాం అనుకున్నాం. ఇప్పటికే బాగుపడ్డాం. అయినా అభివృద్ధి యజ్ఞం ఆగకూడదు. కొనసాగాలి’’ అని సీఎం వివరించారు. తెలంగాణ వచ్చినంత సంతోషపడ్డా.. తెలంగాణలో కొత్త జోనల్ విధానానికి ఆమోదం దక్కిన విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన రోజు నా గుండెల నిండా ఎంత సంతోషపడ్డానో జోనల్ విధానం ఆమోదం పొందినప్పడు అదే అనుభూతి పొందా. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చే విషయంలో కేంద్రం ఊగిసలాటలో ఉంటే చేస్తవా చస్తవా అని ప్రధాని నరేంద్ర మోదీని బల్లగుద్ది అడిగినం. ఇది మా రాజ్యంగ హక్కు అని తెచ్చు కున్నం. స్వరాష్ట్రం మనకు సాధించిన విజయమిది. కేసీఆర్, టీఆర్ఎస్ లేకపోతే 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా నిర్ణయం వచ్చేదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలపై టీఆర్ఎస్కు ఉన్న నిబద్ధత ఇది’’ అని ఆయన అన్నారు. రైతులు ధనికులయ్యే వరకు.. కోటి ఎకరాలకు నీరు అందిస్తా. రైతులు మీదికి భుజాన కండువా ఏసుకుని పైకి పటేలా అన్నట్లు కనిపిస్తరు. కానీ అప్పులు ఉంటయి. అందుకే ఉచితంగా కరెంటు, పెట్టుబడి ఇయ్యాలె. కొన్నేళ్లు ఇలా చేస్తేనే రైతులకు అప్పులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత కొంత ఆదాయం పొందుతరు. 80 ఏళ్లలో ఏ ప్రభుత్వం సాహసం చేయని రీతిలో భూ రికార్డుల ప్రక్షాళన చేశాం. ఈ నివేదికల ఆధారంగా రూ.5,500 కోట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్లి రైతులకు ఇచ్చారు. రైతు ధనికులు అయ్యేంత వరకు ఇలా చేయాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం రైతు బంధు పథకం ఉంటుంది. నవంబర్‌లో రెండో విడత రైతు బంధు సాయం అందిస్తం. రైతులు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దు. ఆ ఆలోచనతోనే రైతు బీమా అమలు చేస్తున్నాం. ఇప్పటికి 365 మంది రైతు కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున అందించాం. రైతు చనిపోయిన పది రోజుల్లో ఇవ్వాలని చెప్పినా.. నాలుగైదు రోజుల్లోనే ఇస్తున్నారు. రుణమాఫీ, ప్రాజెక్టులు, కరెంటు, ఇంకా కొన్ని మంచి పనులు చేయాలె. దీని కోసం ఖలేజా, సాహసం ఉండాలె. కనులన్నీ కలాన్పైనే..! సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభపై రోజంతా ఉత్కంఠ కొనసాగింది. ప్రభుత్వ వర్గాల్లో గత నాలుగు రోజుల నుంచే ముందస్తు హడావుడి కనిపించడం, సభకు ముందే మంత్రి మండలి సమావేశం కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు సభకు 25 లక్షల మంది వస్తారా? వారినెలా తీసుకొస్తున్నారు? అంతా ఊహించినట్టుగానే కేసీఆర్ ముందస్తుకు వెళ్లనున్నారా? ప్రగతి నివేదన సభ సాక్షిగా ఏ వర్గానికి ఎలాంటి వరాలు కురిపించనున్నారు? తొలి జాబితాలో ఎవరెవరికీ టికెట్లు ప్రకటించనున్నారు? ఎన్నికల మేనిఫెస్టోలో ఏం ఉండబోతోంది? వంటి అంశాలపై సహజంగానే ఆయా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ నిజంగానే ముందస్తుగాకు వెళ్తే.. ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు..? వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్ సహా దేశం మొత్తం దృష్టి సారించింది. లక్షలాది మంది సభకు వెళ్లారు. మరెందరో రోజంతా టీవీలకు అతుక్కుపోయారు. మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులు.. తాము తీసుకున్న నిర్ణయాలు వెల్లడించారు. సభలో ఆశించిన స్థాయిలో ఉద్వేగపూరితమైన ప్రసంగాలేవీ లేకపోవడం.. ముందస్తుకు సంబంధించిన ప్రకటన ఏదీ చేయకపోవడం కొసమెరుపు. -
గులాములం కాదు.. గులాబీలం
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన రోజు.నా గుండెల నిండా ఎంత సంతోష పడ్డానో జోనల్ విధానం ఆమోదం పొందినప్పడు అదే అనుభూతి పొందా. ఈ విషయంలో కేంద్రం ఊగిసలాటలో ఉంటే చేస్తవా చస్తవా అని ప్రధాని మోదీని బల్లగుద్ది అడిగినం. ఇది మా రాజ్యాంగ హక్కు అని తెచ్చుకున్నం. స్వరాష్ట్రం మనకు సాధించిన విజయమిది. వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికీ మంచినీళ్లు ఇయ్యకపోతే ఓట్లు అడగం అని దేశంలో ఏ ముఖ్యమంత్రీ చెప్పలేదు. ఎన్నికలకు ఆరు నెలల ముందే నీళ్లు సరఫరా చేస్తాం. ఆడపిల్లల పాదాలు కడిగి చూపిస్తం. సాక్షి, హైదరాబాద్ : ఢిల్లీకి గులాములుగా ఉండాలో లేక తెలంగాణ గులాబీలుగా స్వతంత్ర జీవనం గడపాలో ప్రజలే తేల్చుకోవాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఢిల్లీ చక్రవర్తుల కింద సామంతులుగా ఉన్న వాళ్లు, అసెంబ్లీ టికెట్ల కోసం ఢిల్లీ గుమ్మం దగ్గర కాపలా కాసే వాళ్లు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. అధికారం మన చేతిలో ఉంటేనే ఆత్మగౌరవంతో నిర్ణయాలు తీసుకోగలమని, ఇందుకు 50–60 ఏళ్ల క్రితమే తమిళ సోదరులు తీసుకున్న నిర్ణయం మాదిరిగా ముందుకెళ్దామన్నారు. శాసనసభకు ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతోందని, తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర భవిష్యత్తుకు, టీఆర్ఎస్ పార్టీకి ఏది మంచిదైతే రాజకీయంగా ఆ నిర్ణయం తీసుకుంటామని, తీసుకున్నప్పుడు ప్రజలకు చెప్తామని వివరించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో జరిగిన ‘ప్రగతి నివేదన సభ’కు హాజరైన లక్షలాది మంది ప్రజలనుద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ప్రసంగం ప్రారంభానికి ముందు కేసీఆర్ తెలంగాణ తల్లికి నమస్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. కేసీఆర్ రాజకీయ ప్రసంగం ఆయన మాటల్లోనే ప్రపంచమే నివ్వెరపోయే విధంగా.. జనమా, ప్రభంజనమా అనుకునే విధంగా తెలంగాణలోని గిరిజన గూడాలు, లంబాడీ తండాలు, మారుమూల పల్లె ప్రాంతాల నుంచి, రాష్ట్రం నలుచెరగుల నుంచి వచ్చిన అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములకు వందనం.. శుభాభివందనం. ఈ సభను చూస్తుంటే 18–19 సంవత్సరాల నాటి జ్ఞాపకాల దొంతరలు కళ్ల ముందు తిరుగుతున్నాయి. 2000 సంవత్సరంలో ఆనాటి సీఎం ఎడాపెడా ఇష్టం వచ్చిన రీతిలో కరెంటు చార్జీలు పెంచితే తెలంగాణ రైతాంగం దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. ఆ రోజున ఉన్న సీఎంను తెలంగాణ బిడ్డగా ఒక బహిరంగ లేఖ ద్వారా కరెంటు చార్జీలు తగ్గించమని కోరా. అప్పటికే ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ రైతులకు పెంచిన కరెంటు చార్జీలు ఉరితాళ్లలాంటివని, ఆ ప్రతి పాదనలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశా. మీరు వాపస్ తీసుకోకపోతే సమైక్య రాష్ట్రంలో మా కష్టాలు తీరవని, స్వరాష్ట్రం కోసం, తెలంగాణ కోసం పోరాడాల్సి వస్తుందని చెప్పా. అప్పటికే తెలంగాణ అంటే అలుసైపోయింది. ఏం చేయగలుగుతారులే తెలంగాణ అమాయక ప్రజలనే స్థాయికి అప్పటి పాలకులు వెళ్లిపోయారు. ఏదైనా చేస్తే కేసులు పెట్టి, లాఠీచార్జీలు చేసి అవసరమైతే కాల్చి పారేస్తాం అనే అహంకారంలో ఉన్నారు. ఎందుకంటే అప్పడు ఎన్డీయే ప్రభుత్వంలో వాళ్ల హవానే నడుస్తోంది. కేంద్రం, రాష్ట్రం వాళ్ల చేతుల్లో ఉన్నాయి. 20 ఏళ్లు మేమే ఉంటామనే అధికార మదంతో విర్రవీగిన వాళ్ల కళ్లు మూసుకుపోయి ఉన్నాయి. అందరూ అనుకున్నట్టు తెలంగాణ ఉద్యమం 2001 ఏప్రిల్ 27న ప్రారంభం కాలేదు. అసలు ఉద్యమానికి బీజం పడింది ఆనాడు నేను రాసిన లేఖతోనే. 9–10 నెలలపాటు విపరీత మేధోమథనం చేశాం. ఏం చేయాలి... ఏం చేయగలం... ప్రత్యామ్నాయమే లేదా .. కళ్లలో నీళ్లు దిగమింగుకోవడమేనా? అని ఆలోచించాం. ఇందుకోసం ఎక్కని కొండ లేదు.. మొక్కని బండ లేదు. చుట్టూ పిడికెడు మందితో చిమ్మచీకటిలో ప్రయాణం ప్రారంభించాం. ఆరేడు నెలలపాటు మేధోమథనం తర్వాత తెలంగాణ రావాల్సిందే... పోరాడాల్సిందే.. గత్యంతరం లేదనే స్థిర నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయం కోసం మార్గం ఏమిటి? కారుచీకట్లో గుండె దిటవు చేసుకుని భగవంతుని స్మరించుకుని ధర్మం, న్యాయం ఉంటే తెలంగాణ సమాజం విజయం సాధిస్తుందనే నమ్మకంతో హింస లేకుండా కొనసాగే ప్రశాంత ఉద్యమం చేపట్టాం. రాజకీయ పద్ధతిలోనే తెలంగాణ సాధించాలని సంకల్పించి ఆ బాట పట్టాం. ఎన్నో కుట్రలు, అవమానాలు చేసినా ధైర్యం చెదరలేదు... తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు, రాజీనామాలు, ఉప ఎన్నికలు, ఢిల్లీ యాత్రలు చేశాం. పక్షి తిరిగినట్టు తెలంగాణ అంతా తిరిగా. ఎక్కడికి పోయినా ప్రజలు జేజేలు పలికారు. యావత్ మహిళలు, విద్యార్థులు, యువకులు.. ఇలా అన్ని వర్గాల వారు భాగస్వాములై ఉప్పెన సృష్టించారు. తెలంగాణ ఇస్తామని మొదట వాగ్దానం చేసిన ఢిల్లీ పెద్దలు అహంకారంతో వ్యవహరించారు. ఈ సమయంలో ఎన్నో కుట్రలు జరిగాయి. గులాబీ జెండా అయిపోయింది.. దీని పని ఖతం అని ప్రచారం చేశారు. ఆనాటి అధికార పార్టీ పెద్దలు, ఇతర రాజకీయ పార్టీల నేతలు ఎన్నోసార్లు అవమానపర్చారు. అవహేళన చేశారు. అయినా ఏనాడూ ధైర్యం చెదరలేదు. ఓ రోజున కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, నేను... దివంగత దేశిని చినమల్లయ్య గారి ఇంట్లో కూర్చున్నం. రాత్రి 3 అవుతోంది. వినోద్ అమాయకంగా అడిగాడు. సార్.. ఏమైతది.... ఎక్కడి దాకా పోతం అని అడిగాడు. చిత్తశుద్ది, నిబద్ధత, మొండి పట్టుదల, ధైర్యం మీద ఆధారపడి ఉద్యమం కొనసాగిస్తే... తెలంగాణ సమాజం ఒక్క దిక్కే నిలబడి బరి గీసి ఇవ్వరా మా తెలంగాణ అని నినదించి అడుగుతుందని చెప్పిన. అదే ధైర్యంతో 2001 ఏప్రిల్ 27 మీ అందరి దీవెనలతో పిడికెడు మందితో జలదృశ్యంలో ప్రతిజ్ఞ చేసిన. మడమ తిప్పను.. మాట తప్పను.. ఉద్యమ బాట వీడను, ఎత్తిన జెండా దింపను.. దించితే రాళ్లతో కొట్టండని చెప్పా. విశ్వసించిన ప్రజలు కలసి వచ్చి, కదిలి వచ్చి అద్భుతం చేసి చూపించారు. నేను కేంద్ర మంత్రిగా ఉన్న కొద్ది సమయంలో దేశంలోని 36 రాజకీయ పార్టీలను ఒకటి కాదు పది కాదు.. ఒక్కో పార్టీని 20 సార్లు కలిసినం. కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బర్దన్ గారయితే నన్ను పిచ్చోడివా అని అడిగారు. ఒక్క సీపీఐ ఆఫీసుకే 38 సార్లు వెళ్లిన. అవును.. నేను తెలంగాణ పిచ్చోడినని చెప్పిన. ఓకే నేను మద్దతిస్తా అని చెప్పారు. జయశంకర్ సార్, విద్యాసాగర్రావుగారు... అందరం కలసి అనేక శ్రమ, ప్రయాసలు పడి ఒక్కో పార్టీని ఒప్పించి, అనేక పోరాటాలు చేశాం. 14 ఏళ్ల కఠోర పరిశ్రమ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కొత్త రాష్ట్రంలో భయంకర సమస్యలు... తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే ఎన్నికలకు పోవాలె. విచిత్ర పరిస్థితి. ప్రజలు ఏం చేస్తారు.. ఎలా చేస్తారు? ఈనెకాచి నక్కల పాలు చేయకుండా.. రాష్ట్రాన్ని ఇతర పార్టీలకు అప్పగించకుండా ప్రజలను నమ్ముకొని ఒంటరి పోరాటం చేద్దామని నిర్ణయించుకున్నాం. ప్రజలు మద్దతిచ్చారు.. దీవించారు... టీఆర్ఎస్ బిడ్డలే శ్రీరామరక్షగా సంపూర్ణ మెజారిటీని సింగిల్ పార్టీకి ఇచ్చారు. అప్పుడు రాష్ట్రంలో భయంకర సమస్యలున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఆర్థిక పరిస్థితి ఏమిటో.. అసలు బడ్జెట్ ఎంతో అర్థం కాదు. మిగులు బడ్జెట్ ఉందా... రెవెన్యూ లోటు ఉందా తెలియని పరిస్థితి. అదో విపత్కర పరిస్థితి. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లా నుంచే 15 లక్షల మంది ప్రజలు గూడు చెదిరిన పక్షుల్లా వలస వెళ్లారు. కులవృత్తులు ధ్వంసమై ఉన్నాయి. చెరువులు తాంబాళాలుగా మారాయి. పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు.. కరిగిపోయే వైర్లు.. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రస్థానం ప్రారంభించాం. ఎక్కడ ప్రారంభించాలో గుండె లోతుల్లోంచి నిజాయితీగా ఆలోచించాం. ఏది తెలంగాణ ప్రజలకు మొదట అవసరమో.. ఏది మొదట చేయాల్నో ఆలోచించాం. ప్రజలకు ఏది మంచిదైతే అదే... కేసీఆర్ ఈ సభలో ఏం చెప్తడు.. శాసనసభను రద్దు చేస్తడా... అని ఆలోచన చేస్తున్నరు. నేను ఒకమాట చెబుతున్నా. తెలంగాణ రాష్ట్రానికి, టీఆర్ఎస్కు, ప్రజల భవిష్యత్తుకు రాజకీయంగా ఏది మంచిదైతే ఆ నిర్ణయం తీసుకోవాలని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు నాకు అధికారం అప్పజెప్పారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఏం చేయాలో భవిష్యత్తులో తీసుకుంటాం. తీసుకున్నప్పుడు నేను మీకు చెప్తా. పత్రికలు, మీడియాలో కేసీఆర్ ఏదో వరాలు ప్రకటిస్తడని రాశారు. అధి ధర్మం కాదు. ప్రభుత్వంలో ఉన్నం కాబట్టి మేం ఒకమాట చెప్పామంటే అమలు జరగాలె. అందుకోసం పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేస్తం. ఎన్నికలలొచ్చిన తర్వాత చిత్తశుద్ధితో ఏం చేయాలో నిర్ణయిస్తం. ప్రభుత్వంలో ఉండి సీఎం హోదాలో అది చేస్తం.. ఇది చేస్తం అని చెప్పడం అనైతికం. మేనిఫెస్టోలో అన్ని అంశాలను వివరంగా తీసుకొస్తాం. ప్రజలంతా మమ్మల్నే కోరుకుంటున్నరు... ప్రజలంతా మళ్లీ టీఆర్ఎస్సే (అధికారంలోకి) రావాలని, కేసీఆరే (సీఎం) కావాలని కోరుకుంటున్నరు. నేను టీవీల్లో చూస్తున్నప్పుడు మీలో చాలా మంది మాట్లాడిండ్రు... ఫేస్బుక్లో, మీడియాలో మీరు చెప్తున్నరు మాకు టీఆర్ఎస్, కేసీఆరే కావాల్నని. మాకు చేపలు వచ్చినయ్, గొర్రెలొచ్చినయ్.. కరెంటు ఇచ్చిండ్రు. రోడ్లు వేసిండ్రు... చెరువులు తవ్విండ్రు..అని చెప్తున్నరు. ఇది ప్రజావాణి. ప్రజలు ఆ విధంగా చెప్తున్నరు. ఢిల్లీకి బానిసలు కావొద్దు... కొన్ని మూకలు, కొన్ని ప్రతీప శక్తులు ప్రాజెక్టులు ముందుకు పోకుండా కేసులు వేశాయి. ఇంకొకాయన కేసీఆర్‌ను గద్దె దింపుడే తన రాజకీయ లక్ష్యమని చెప్తడు. ఇదేం దిక్కుమాలిన లక్ష్యం. కేసీఆర్‌ను గద్దెదింపుడు ఒక లక్ష్యమా? ప్రగతి నిరోధక శక్తులు, ప్రతీపశక్తులు అవాకులు, చెవాకులు పేలుతున్నయ్. అలవిగాని మాటలు మాట్లాడుతుయ్. మోసపోతే గోసపడతం.. ఇబ్బంది పడతం. జరిగిన ప్రగతి మీ కళ్ల ముందే ఉంది. ఆత్మగౌరవంతో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. కొన్ని పార్టీలు ఢిల్లీకి గులాములుగా ఉన్నాయి. ఢిల్లీ చక్రవర్తులకు సామంతులు వాళ్లంతా... తెలంగాణ మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు ఆలోచించాలె. అధికారం తెలంగాణలో ఉండాల్నా? ఢిల్లీ దొరల కింద ఉండాల్నా? అధికారం మన దగ్గర ఉంటే ఆత్మగౌరవంతో నిర్ణయాలు తీసుకుంటాం. ఆ పార్టీ వాళ్లు అసెంబ్లీ టికెట్ల కోసం కూడా ఢిల్లీ గుమ్మం ముందు కాపలా కాయాలె. చెంచాగిరీ చేయాలె. ఢిల్లీకి గులాములవుదామా.. తెలంగాణ గులాబులవుదామా అనేది ప్రజలే ఆలోచించాలి. 50–60 ఏళ్ల క్రితం నుంచే తమిళ రాష్ట్రాన్ని అక్కడి ప్రజలు ఆత్మగౌరవంతో ఎలా పాలించుకుంటున్నారో అదే మాదిరిగా మనం కావాలె. తమిళ సోదరుల్లా ఆత్మగౌరవంతో అభివృద్ధి సాధించాలె. ఢిల్లీకి బానిసలు కావద్దు. ఇది భవిష్యత్ తరాలకు మంచిది కాదు. నిర్ణయాధికారం మన చేతుల్లోనే ఉండాలె. మళ్లీ ప్రజలు దీవిస్తే ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటవుతుంది. సమూల పేదరిక నిర్మూలన జరుగుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలె. నా మాట విశ్వసించాలి. మరోమారు మీ ఆశీర్వచనం ఉండాలి. రాజకీయ నిర్ణయాలు త్వరలోనే మీ ముందుంటాయి. అందరికీ ధన్యవాదాలు... జై తెలంగాణ... (ఏమయింది సవ్వబడ్డరు.. గట్టిగ చెప్పాలె..) జై తెలంగాణ.. జై తెలంగాణ... జై తెలంగాణ... జై భారత్’ అని నినదిస్తూ కేసీఆర్ ప్రసంగాన్ని ముగించారు. -
కేసీఆర్ ఆత్మగౌరవ నినాదం
సాక్షి, కొంగకలాన్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి ఆత్మగౌరవ నినాదం ఎత్తుకున్నారు. ఢిల్లీకి గులాంగిరీ చేయాల్సిన అవసరం లేదన్నారు. కొంగకలాన్‌లో ఆదివారం జరిగిన ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాలన్నీ ఇక్కడే జరగాలని ఆకాంక్షించారు. ‘ఢిల్లీకి గులాములుగా ఉందామని కొన్ని పార్టీలు అంటున్నాయి. తెలంగాణ సంబంధించిన నిర్ణయాలు ఇక్కడ జరగాలా? ఢిల్లీలో జరగాలా? ఢిల్లీకి గులాం, చెంచాగిరి చేసుకుందామా? ఆలోచన చెయ్యండి.. తెలంగాణ జాతి ఒక్కటిగా ఉండాలి. ఢిల్లీకి గులాంగిరి వద్ద’ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీకి గులాంగిరి చేసే పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇలాంటి పార్టీలు ఢిల్లీ గుమ్మం దగ్గర పడిగాపులు కాసి ఎమ్మెల్యే టిక్కెట్లు తెచ్చుకుంటాయని ఎద్దేవా చేశారు. ప్రతీప శక్తులు, ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ఉంటాయని ధ్వజమెత్తారు. మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని, తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. రాజకీయ నిర్ణయాల పట్ల ఆచితూచి స్పందించారు. త్వరలోనే ప్రకటిస్తానని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు. -
కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ త్వరలోనే సాకారం
-
నేను తెలంగాణ పిచ్చోడిని: కేసీఆర్
సాక్షి, కొంగకలాన్: ప్రగతి నివేదన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన ప్రసంగంతో సభికులను ఆకట్టుకున్నారు. ఇది జనమా? ప్రభంజనమా’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన తన వాగ్ధాటితో అందరినీ కట్టిపడేశారు. మలి దశ తెలంగాణ ఉద్యమం పుట్టుపూర్వోత్తరాల నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన పరిణామాలను సవివరంగా తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన చేపట్టిన పథకాల గురించి వివరించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణ గురించి చెప్పారు. కేసీఆర్ ప్రసంగంలో ఉటంకించిన మాటలు కొన్ని... ఇది జనమా? ప్రభంజనమా? తెలంగాణ అప్పట్లో వలస పాలకుల ప్రయోగశాలగా మారింది ప్రత్యేక రాష్ట్రం కోసం ఎక్కని కొండ లేదు మొక్కని బండ లేదు తెలంగాణ ఉద్యమంలో ప్రజలంతా పాత్రధారులే ప్రాణం పోయినా సరే మడమ తిప్పను, మాట తప్పను తెలంగాణ తేకపోతే రాళ్లతో కొట్టి చంపమని చెప్పా తెలంగాణ ప్రజలు కలిసి వచ్చి, కదిలివచ్చి అద్భుతం చేశారు సీపీఐ పార్టీని ఒప్పించడానికి 38 సార్లు తిరిగా నేను తెలంగాణ పిచ్చోడిని అని ఏబీ బర్దన్‌కు చెప్పా కూలిపోయిన కులవృత్తిదారుల బాధ వర్ణణాతీతం తెలంగాణ వచ్చిన తర్వాత నేతన్నల ముఖంలో వెలుగులు చూస్తున్నాం కంప్యూటరే కాదు గొర్రెలు పెంచడం కూడా వృత్తే తెలంగాణ సమాజంలోని దుఃఖాన్ని పంచుకోవాలన్న 24 గంటల విద్యుత్‌తో తెలంగాణ వెలుగులు జిమ్ముతోంది మీకు ఆకుపచ్చ తెలంగాణ చూపిస్తా ఓట్లు అడగను అనే మాట చెప్పాలంటే ఖలేజా కావాలి రాజకీయ అవినీతిని నిర్మూలించి పనిచేస్తే ఫలితాలు బాగుంటాయి రాష్ట్ర సంపదను పెంచుతాం, ప్రజలకు పంచుతాం మేము చేసిన పనులు డప్పు కొట్టే పనిలేదు మళ్లీ కేసీఆరే రావాలని ప్రజావాణి చెబుతోంది రాజకీయంగా కేసీఆర్ ఏం చెబుతాడో అందరూ చూస్తున్నారు తెలంగాణ వచ్చే ప్రతి ఉద్యోగం మన బిడ్డకే వస్తది కేసీఆర్ సీఎంగా లేకపోతే 95 శాతం ఉద్యోగాలు సాధ్యవ కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ సాకారం కావాలె మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ భాసిల్లాలె ప్రతీప శక్తులు, ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ఉంటాయి జరిగిన ప్రగతి ప్రజల కళ్ల ముందున్నది ఢిల్లీకి గులాములుగా ఉందామని కొన్ని పార్టీలు అన్నాయి తెలంగాణ సంబంధించిన నిర్ణయాలు ఢిల్లీలో జరగాలా? మళ్లీ ప్రజలు దీవిస్తే.. అన్ని సాధిస్తా