సాక్షి, హైదరాబాద్: రానున్న 10 సంవత్సరాలలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలను ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ శివారు కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్‌కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ చైర్మన్ యాంగ్ లియూ, సీఈవోలు, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణను తమ తయారీ కేంద్రంగా ఎంచుకున్న ఫాక్స్ కాన్ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. కంపెనీ నిర్మాణం, తయారీ ప్లాంట్లను విస్తరించడంలో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. ఫాక్స్‌కాన్ రంగారెడ్డి జిల్లాకు రావడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలోలో కొంగరకలాన్ గుర్తు పట్టలేనంతగా మారబోతున్నదని చెప్పారు.
రూ. 4 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఫాక్స్‌కాన్ పరిశ్రమతో 35 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ఫాక్స్‌కాన్ హామీ ఇచ్చిందని తెలిపారు. అటు కంపెనీ నిర్మాణం జరుగుతుంటే మరోవైపు యువతకు శిక్షణ ఇస్తామన్నారు. యువత కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఈ రోజు తెలంగాణకు చరిత్రాత్మక సందర్భమని కేటీఆర్ అన్నారు. గత తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని. దేశంలోనే ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు . చిన్న రాష్ట్రమైనా 30 శాతం కంటే అధిక అవార్డులను సాధించిందన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. దేశంలోని ఐటీ ఉద్యోగాల్లో ప్రతి మూడింట్లో ఒక ఉద్యోగం మనదేనని చెప్పారు
చదవండి: కర్ణాటక ఫలితం.. తెలంగాణలో ఇప్పుడెలా?.. బీజేపీ బేజార్, 'కారు'కు ఫియర్..
Comments
Please login to add a commentAdd a comment