Talasani srinivasayadav
-
టీఆర్ఎస్తోనే అభివృద్ధి: మంత్రి తలసాని
టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే హైదరాబాద్ అన్ని రంగాలలో అభివృద్ధి చెంది విశ్వనగరంగా గుర్తింపు లభిస్తుందని... ఆదిశగా సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. నాచారం డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి మేడల జ్యోతి మల్లికార్జున్‌గౌడ్ ఎన్నికల ప్రచారం శుక్రవారం నాచారంలోని హెచ్ఎంటీ నగర్, వీఎస్‌టీకాలనీ, స్నేహపురికాలనీ కాలనీలలో జరిగింది. ఈ సందర్భంగా కాలనీలలో పాదయాత్ర చేస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కారుగుర్తుకు ఓటు వేసి మేడల జ్యోతిమల్లికార్జున్గౌడ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యతో పాటు స్థానికనేతలు మల్లికార్జున్‌గౌడ్, రాగిరి మోహన్‌రెడ్డి, నందికొండ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తలసాని కుమారుడిపై ఫిర్యాదు
అకారణంగా తనపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడు దాడికి పాల్పడ్డాడని శ్రీకాంత్ అనే డ్రైవర్ మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం మధ్యాహ్నం సమయంలో కస్తూర్బా జూనియర్ కళాశాల వద్ద టీడీపీ పార్టీ ప్రచార రథాన్ని నడుపుకుంటూ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మంత్రి కుమారుడు సాయికిరణ్ ఆకారణంగా దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రచార వాహన మైక్ సౌండ్‌ను తగ్గించాలని వాగ్వివాదానికి దిగి తనపై దాడి చేశాడని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీకాంత్ ఫిర్యాదును దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామాని మారేడుపల్లి సీఐ ఉమా మహేశ్వర్‌రావు తెలిపారు. -
సినీకార్మికులపై వరాల జల్లు
-చిత్రపురి కాలనీలో మంత్రుల పర్యటన హైదరాబాద్ సినీ కార్మికులపై రాష్ట్ర మంత్రులు వరాల జల్లు కురిపించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో వారడిన కోరికలన్నింటినీ అక్కడికక్కడే ఓకే చెప్పేశారు. రాజేంద్రనగర్ మండలం మణికొండ పంచాయతీ చిత్రపురికాలనీలో ఐటీ మంత్రి కె.తారకరామారావు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రవాణా శాఖమంత్రి పి.మహేందర్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు వారి దృష్టికి తెచ్చిన కాలనీ ప్రధానరోడ్డు నిర్మాణానికి జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ శాఖనుంచి రూ. కోటిన్నర నిధులను ఖర్చుచేయనున్నట్టు ప్రకటించారు. అలాగే, పట్టణ ఆరోగ్యకేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. కాలనీకి రేపటి నుంచి బస్‌లను నడుపుతామని హామీ ఇచ్చారు. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు తీసుకోవచ్చని కళాకారుల పింఛన్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. తాము15వేల మంది ఉండగా కేవలం 4 వేలమందికే గృహాలు ఇచ్చారనీ.. మిగతా వారికి పక్కనే ఉన్న మరో 9ఎకరాల భూమిని కేటాయించాలని కోరటంతో ముఖ్యమంత్రితో చర్చించి కేటాయిస్తామని హామి ఇచ్చారు. కాలనీకి ఉచిత వైఫై సేవలను అందించాలని కళాకారులు కోరారు.. దీనికి మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. త్వరలోనే వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగు సినిమారంగాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భగా ఆయన ప్రకటించారు. ప్రపంచంలోనే పేరెన్నికగన్న సంస్థలు హైదరాబాద్‌కు వస్తున్నాయన్నారు. -
చూస్తున్నారా.. ఈ ‘చిత్రం’ .. !
సిటీబ్యూరో: నగరంలో రెండేళ్ల క్రితం నిర్వహించిన జీవవైవిద్య సదస్సు(కాప్-11) సందర్భంగా విదేశీ అతిథులను ఆకట్టుకునేందుకు ‘నగర సుందరీకరణ పేరిట’ జీహెచ్ంఎసీ అధికారులు దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేశారు. ఫ్లై ఓవర్ల దిగువ స్తంభాలకు రంగులు, పక్క గోడలపై వర్ణచిత్రాలు తదితర పనుల పేరిట రూ.20 కోట్లు ఖర్చు చేశారు. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచేందుకు అందరూ సహకరించాలని, గోడలపై వాల్‌పోస్టర్లు తదితరమైనవి అంటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు సైతం చేశారు. దీనిని అధికార పక్షం నేతలే పాటించడంలేదు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లోచేరిన తలసాని శ్రీనివాసయాదవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ చౌరస్తాతో సహా ఫ్లై ఓవర్ పొడవునా బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా ఎంతో వ్యయంతో రూపొందించిన కళాఖండాలను సైతం ఖాతరు చేయలేదు. వాటిని మూసివేస్తూ తలసానికి అభినందనలు తెలుపుతున్న పోస్టర్లను అంటిచేశారు. ఇదంతా ఒక ఎత్తయితే.. ‘ఈ క ళాఖండాలపై పోస్టర్లు అంటించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం ’అనే అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నా, వాటి దిగువనే బేఖాతరుగా పోస్టర్లను నింపేశారు. గోడపై నోటీసులు, పోస్టర్లు అంటిస్తే చట్టపర చర్యలని మరోచోట ఉన్నా పట్టించుకోలేదు. మన సారే మంత్రి.. మనదే రాజ్యం.. పోస్టర్లపై సీఎం కూడా ఉన్నారు.. ఎవరేం చేస్తారు..? అనుకున్నారో ఏమో కానీ.. ఇలా నింపేశారు. సాధారణ ప్రజలపై కొరడా ఝళిపించే జీహెచ్ఎంసీ అధికారులు దీనికేం సమాధానం చెబుతారు..? ప్రజా ధనాన్ని ఇలా దుర్వినియోగం చేసిన వారిని ఏమని ప్రశ్నిస్తారు..? ఈ మార్గం నుంచే నిత్యం సర్కారు ప్రముఖులు, అధికార గణాలు, ఇతరత్రా వీఐపీలు ఎందరెందరో వెళ్తున్నా.. ఎవరి దృష్టికీ రాకపోవడం.. వచ్చినా పట్టించుకోకపోవడం.. దేనికి సంకేతం..?