అకారణంగా తనపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడు దాడికి పాల్పడ్డాడని శ్రీకాంత్ అనే డ్రైవర్ మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అకారణంగా తనపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడు దాడికి పాల్పడ్డాడని శ్రీకాంత్ అనే డ్రైవర్ మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం మధ్యాహ్నం సమయంలో కస్తూర్బా జూనియర్ కళాశాల వద్ద టీడీపీ పార్టీ ప్రచార రథాన్ని నడుపుకుంటూ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మంత్రి కుమారుడు సాయికిరణ్ ఆకారణంగా దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రచార వాహన మైక్ సౌండ్‌ను తగ్గించాలని వాగ్వివాదానికి దిగి తనపై దాడి చేశాడని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీకాంత్ ఫిర్యాదును దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామాని మారేడుపల్లి సీఐ ఉమా మహేశ్వర్‌రావు తెలిపారు.