‘కూటమి’తోనే నగరాభివృద్ధి: కేంద్రమంత్రి హన్సరాజ్ | the Urban Development only with ' Alliance ' : Minister Hansraj | Sakshi
Sakshi News home page

‘కూటమి’తోనే నగరాభివృద్ధి: కేంద్రమంత్రి హన్సరాజ్

Published Fri, Jan 29 2016 6:28 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

the Urban Development only with ' Alliance ' : Minister Hansraj

బీజేపీ, టీడీపీ కూటమి ద్వారానే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర సహాయ మంత్రి హ న్సరాజ్ గంగ్వార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పూల్‌బాగ్ చమాన్ ప్లే గ్రౌండ్ వద్ద రోడ్ షో లో జంగమ్మెట్, శాలిబండ డివిజన్ల బీజేపీ అభ్యర్థులు కౌడీ మహేందర్, పొన్న వెంకటరమణలతో కలిసి ఆయన ప్రసంగించారు.

దేశ ప్రధాని నరేంద్ర మోడీ మహా నగరాల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. హైదరాబాద్ మహా నగరంలో బీజేపీ, టీడీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే మరింత అభివృద్ధి చేసేందుకు వీలుంటుందన్నారు. టీఆర్‌ఎస్, మజ్లీస్ పార్టీలకు తగిన రీతిలో ఓటు ద్వారా సమాధానం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి టి. ఉమా మహేంద్ర, సీనియర్ నాయకులు ఊరడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement