'ఒక్క కాంగ్రెస్‌కే ఆ అర్హత ఉంది'
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మాత్రమే ఓట్లు అడిగే అర్హత ఉందని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పదేళ్ల పాలనలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అందుకే కాంగ్రెస్‌కు మాత్రమే అర్హత ఉందన్నారు.
ఆంధ్రావాలా బాగో అన్న టీఆర్ఎస్కు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు అడగే అర్హత లేదన్నారు. కేసీఆర్‌కో బగావో.. హైదరాబాద్ బచావో నినాదంతో కాంగ్రెస్ ముందుకెళ్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. ఎమ్ఐఎమ్, టీడీపీ-బీజేపీ కూటమికి కూడా గ్రేటర్ ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత లేదన్నారు.