నటుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ కు అస్వస్థత! | Actor Raghavendra Rajkumar hospitalised | Sakshi
Sakshi News home page

నటుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ కు అస్వస్థత!

Published Wed, Oct 16 2013 7:58 PM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

Actor Raghavendra Rajkumar hospitalised

కన్నడ నటుడు, నిర్మాత రాఘవేంద్ర రాజ్ కుమార్ అనారోగ్య కారణంతో ఆస్పత్రిలో చేరారు. రాఘవేంద్ర ప్రముఖ నటుడు, దివంగత రాజ్ కుమార్ కుమారుడు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించినట్టు సన్నిహితులు తెలిపారు. 
 
రాఘవేంద్ర రాజ్ కుమార్ బుధవారం ఉదయం 9.15 నిమిషాలకు ఆస్పత్రిలో చేర్పించారని..ఆయనకు చికిత్సనందిస్తున్నామని కొలంబియా ఆసియా ఆస్పత్రిలోని వైద్యులు డాక్టర్ మేధ హూల్గోల్ తెలిపారు. ఆస్పత్రిలో చేరిన రాఘవేంద్రకు వైద్యుల బృందం వెంటనే చికిత్సను అందించారని.. త్వరలోనే కోలుకుంటారని వెల్లడించారు. 
 
మెదడులో రక్తం గడ్గకట్టింది. వైద్యులు చికిత్స చేసి తొలగించారు అని రాఘవేంద్ర సోదరుడు శివరాజ్ కుమార్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం రాఘవేంద్ర పరిస్థితి మెరుగు పడిందని శివరాజ్ అన్నారు. ఉదయం జాగింగ్ చేస్తున్న సమయంలో అనారోగ్యానికి గురవ్వడంతో ఆస్పత్రికి తరలించామని శివరాజ్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement