Raghavendra Rajkumar
-
ఛాతిపై పచ్చబొట్టుగా పవర్‌స్టార్ పేరు..పిక్ వైరల్
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ లోకాన్ని విడిచి రెండేళ్లు కావోస్తున్నా.. అతని అకాల మరణాన్ని మాత్రం అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. కన్నడలో ఏ సినిమా ఈవెంట్ జరిగా పునీత్ పేరును స్మరించుకుంటున్నారు. పునీత్ కుటుంబ సభ్యులు కూడా ఆయన పేరు తెరపై కనిపిస్తే.. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా పునీత్ సోదరులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ అయితే ప్రతి సినిమా ఈవెంట్లో తమ్ముడిని తలచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఇక తాజాగా తన తమ్ముడి పేరుని ఛాతిపై టాటూగా వేయించుకున్నాడు రాఘవేంద్ర రాజ్‌కుమార్. (చదవండి: నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నా..హీరో అశ్విన్ కన్నీటి పర్యంతం) రాఘవేంద్రకు తమ్ముడు అంటే చాలా ఇష్టం. వయసులో చాలా చిన్నవాడు కావడంతో అతన్ని సొంత కొడుకులా చూసుకున్నాడు. అయితే 46 వయసులో పునీత్ గుండె పోటుతో మరణించాడాన్ని రాఘవేంద్ర తట్టుకోలేకపోయాడు. ఇప్పటికీ ఏదైనా స్టేజిపై పునీత్ ఫొటో కనిపిస్తే దుఃఖం ఆపుకోలేడు. ఇక తన తమ్ముడిని చిరకాలం గుర్తించుకోవడం కోసం చాతిపై ‘అప్పు’ అని టాటూ వేయించుకున్నాడు. ఇది పునీత్ ముద్దు పేరు. అప్పుతో పాటు టోటో, నుక్కి పేర్లను కూడా పచ్చబొట్టు వేయించుకున్నాడు. అవి పునీత్ ఇద్దరి కుమార్తెల ముద్దు పేర్లు. వాళ్ల అసలు పేర్లు ‘వందిత, ధృతి’. ఇక రాఘవేంద్ర విషయానికొస్తే.. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. రాఘవేంద్ర చివరగా పునీత్ నటించిన ‘జేమ్స్’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించాడు. ಅಪ್ಪು ಮತ್ತು ಅಪ್ಪು ಮಕ್ಕಳ ಹೆಸರನ್ನ ಎದೆ ಮೇಲೆ ಹಾಕಿಸಿಕೊಂಡ ರಾಘಣ್ಣ 🙏@iRaghanna #RaghavendraRajkumar pic.twitter.com/GMwRx7ZSYQ — Sagar Manasu (@SagarManasu) May 28, 2023 -
'గాడ్'తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న తమిళ స్టార్!
"కొంజుం వెయిల్ కొంజుం మలయ్ కాధలుక్కు ఇల్లై, గాంతం" చిత్రాలతో తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్టర్ "తేజ్" త్వరలో తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తేజ్ ప్రతినాయకుడిగా పవర్ ఫుల్ రోల్ చేస్తున్న "గాడ్" తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. తేజ్ ప్రస్తుతం కన్నడలో "రామాచారి -2"లో నటిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ లేదా డిసెంబర్లో విడుదల కానుంది. "గ్లోరి ఆఫ్ డెమన్" అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న "గాడ్" చిత్రంలో ప్రఖ్యాత కన్నడ నటుడు డాక్టర్ రాఘవేంద్ర రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి. తేజ్ నటిస్తున్న కన్నడ చిత్రం "రామాచారి -2" చిత్రం కూడా తెలుగులో విడుదల చేయనున్నారు. చదవండి: సీతారామం సక్సెస్ మీట్‌కు సుమంత్ గైర్హాజరు, ఎందుకో చెప్పిన హీరో ఘనంగా ప్రముఖ సీరియల్ నటి సీమంతం, ఫొటోలు వైరల్ -
పునీత్ మరణం ఒక ప్రశ్న: సోదరుడు రాఘవేంద్ర
సాక్షి, బెంగళూరు: ప్రముఖ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణించి అప్పుడే 30 రోజులైంది. ఆయన కుటుంబసభ్యులు సోమవారం కంఠీరవ స్టూడియలో పునీత్ సమాధికి పూజలు చేశారు. అన్న శివరాజ్‌కుమార్, భార్య గీతా, మరో అన్న రాఘవేంద్ర, పునీత్ భార్య అశ్విని తదితరులు పాల్గొన్నారు. పూజల తరువాత రాఘవేంద్ర విలేకరులతో మాట్లాడుతూ పునీత్‌కు కార్లు, కోట్ల డబ్బులున్నప్పటికీ ఐదు నిమిషాల సమయం దొరకలేదని ఆనాటి ఘటనను గుర్తుచేసుకున్నారు. పునీత్ ఇంత త్వరగా ఎందుకు మరణించారనేది ప్రతి అభిమానికీ ఒక ప్రశ్నగా మారిందని అన్నారు. నాయండహళ్లి రోడ్డుకు పునీత్ పేరు నాయండహల్లి జంక్షన్ నుంచి బన్నేరఘట్ట రోడ్డు మెగాసిటీ మాల్ జంక్షన్ వరకు పునీత్ రాజ్‌కుమార్ పేరు పెట్టాలని బీబీఎంపీ నిర్ణయించింది. 12 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రోడ్డుకు పునీత్ పేరును ఖాయం చేయనున్నారు. చదవండి: (శివన్న అని ప్రేమగా పునీత్ నన్ను పిలుస్తున్నట్టు వినిపిస్తోంది: శివ రాజ్‌కుమార్) -
వెంకటేశ్ కుటుంబాన్ని పరామర్శించిన రాఘవేంద్ర రాజ్‌కుమార్
బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతిని తట్టుకోలేక చెన్నపట్టణ తాలూకా ఎలేకేరి నివాసి వెంకటేశ్ (25) అన్నపానీయాలు మాని తీవ్ర కలతచెంది గతవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో పునీత్ అన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్ బుధవారంనాడు వెంకటేశ్ కుటుంబాన్ని పరామర్శించారు. దయచేసి అభిమానులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, వెంకటేశ్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చదవండి: (పునీత్ మృతికి రజనీ సంతాపం, కన్నింగ్ ఫెలో అంటూ విమర్శలు) -
పునీత్ మరణం తర్వాత తొలిసారి స్పందించిన భార్య అశ్విని
Puneeth Rajkumar Family Appeals Fans Not To End Lifes: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం చిత్ర పరిశ్రమలో తీరని విషాదాన్ని నింపింది. గుండెపోటుతో చిన్న వయసులోనే పునీత్ హఠాన్మరణానికి గురవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఇక లేరన్న వార్త తెలిసి ఇప్పటికే సుమారు 12మంది అభిమానులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. వరుసగా అభిమానులు సూసైడ్‌కు పాల్పడుతుండటంపై పునీత్ భార్య అశ్విని స్పందించారు. 'పునీత్ మరణం మా కుటుంబానికి తీరని లోటు. ఇలాంటి పరిస్థితి మీ కుటుంబానికి రాకూడదు. అప్పు లేడన్న విషయాన్ని మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ఎనలేని ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఆయన మన మధ్య లేకపోయినా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి అభిమానులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడి మీ కుటుంబాన్ని ఒంటరి చేయొద్దు' అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు అప్పు సోదరులు శివరాజ్‌కుమార్, రాఘవేంద్రలు సైతం అభిమానులెవరూ అఘాయిత్యాలకు పాల్పడద్దని కోరారు. అంత్యక్రియల దృశ్యాలకు కూడా పదేపదే ప్రసారం చేయవద్దని మీడియాకు సైతం విజ్ఞప్తి చేశారు. చదవండి: పునీత్ మరణాన్ని ఇలా క్యాష్ చేసుకుంటున్నారు, ఫ్యాన్స్ ఆగ్రహం -
నటుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ కు అస్వస్థత!
కన్నడ నటుడు, నిర్మాత రాఘవేంద్ర రాజ్ కుమార్ అనారోగ్య కారణంతో ఆస్పత్రిలో చేరారు. రాఘవేంద్ర ప్రముఖ నటుడు, దివంగత రాజ్ కుమార్ కుమారుడు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించినట్టు సన్నిహితులు తెలిపారు. రాఘవేంద్ర రాజ్ కుమార్ బుధవారం ఉదయం 9.15 నిమిషాలకు ఆస్పత్రిలో చేర్పించారని..ఆయనకు చికిత్సనందిస్తున్నామని కొలంబియా ఆసియా ఆస్పత్రిలోని వైద్యులు డాక్టర్ మేధ హూల్గోల్ తెలిపారు. ఆస్పత్రిలో చేరిన రాఘవేంద్రకు వైద్యుల బృందం వెంటనే చికిత్సను అందించారని.. త్వరలోనే కోలుకుంటారని వెల్లడించారు. మెదడులో రక్తం గడ్గకట్టింది. వైద్యులు చికిత్స చేసి తొలగించారు అని రాఘవేంద్ర సోదరుడు శివరాజ్ కుమార్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం రాఘవేంద్ర పరిస్థితి మెరుగు పడిందని శివరాజ్ అన్నారు. ఉదయం జాగింగ్ చేస్తున్న సమయంలో అనారోగ్యానికి గురవ్వడంతో ఆస్పత్రికి తరలించామని శివరాజ్ తెలిపారు.