
సాక్షి, బెంగళూరు: ప్రముఖ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణించి అప్పుడే 30 రోజులైంది. ఆయన కుటుంబసభ్యులు సోమవారం కంఠీరవ స్టూడియలో పునీత్ సమాధికి పూజలు చేశారు. అన్న శివరాజ్‌కుమార్, భార్య గీతా, మరో అన్న రాఘవేంద్ర, పునీత్ భార్య అశ్విని తదితరులు పాల్గొన్నారు. పూజల తరువాత రాఘవేంద్ర విలేకరులతో మాట్లాడుతూ పునీత్‌కు కార్లు, కోట్ల డబ్బులున్నప్పటికీ ఐదు నిమిషాల సమయం దొరకలేదని ఆనాటి ఘటనను గుర్తుచేసుకున్నారు. పునీత్ ఇంత త్వరగా ఎందుకు మరణించారనేది ప్రతి అభిమానికీ ఒక ప్రశ్నగా మారిందని అన్నారు.
నాయండహళ్లి రోడ్డుకు పునీత్ పేరు
నాయండహల్లి జంక్షన్ నుంచి బన్నేరఘట్ట రోడ్డు మెగాసిటీ మాల్ జంక్షన్ వరకు పునీత్ రాజ్‌కుమార్ పేరు పెట్టాలని బీబీఎంపీ నిర్ణయించింది. 12 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రోడ్డుకు పునీత్ పేరును ఖాయం చేయనున్నారు.
చదవండి: (శివన్న అని ప్రేమగా పునీత్ నన్ను పిలుస్తున్నట్టు వినిపిస్తోంది: శివ రాజ్‌కుమార్)
Comments
Please login to add a commentAdd a comment