కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ లోకాన్ని విడిచి రెండేళ్లు కావోస్తున్నా.. అతని అకాల మరణాన్ని మాత్రం అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. కన్నడలో ఏ సినిమా ఈవెంట్ జరిగా పునీత్ పేరును స్మరించుకుంటున్నారు. పునీత్ కుటుంబ సభ్యులు కూడా ఆయన పేరు తెరపై కనిపిస్తే.. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా పునీత్ సోదరులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ అయితే ప్రతి సినిమా ఈవెంట్‌లో తమ్ముడిని తలచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఇక తాజాగా తన తమ్ముడి పేరుని ఛాతిపై టాటూగా వేయించుకున్నాడు రాఘవేంద్ర రాజ్‌కుమార్.
(చదవండి: నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నా..హీరో అశ్విన్ కన్నీటి పర్యంతం)
రాఘవేంద్రకు తమ్ముడు అంటే చాలా ఇష్టం. వయసులో చాలా చిన్నవాడు కావడంతో అతన్ని సొంత కొడుకులా చూసుకున్నాడు. అయితే 46 వయసులో పునీత్ గుండె పోటుతో మరణించాడాన్ని రాఘవేంద్ర తట్టుకోలేకపోయాడు. ఇప్పటికీ ఏదైనా స్టేజిపై పునీత్ ఫొటో కనిపిస్తే దుఃఖం ఆపుకోలేడు.
ఇక తన తమ్ముడిని చిరకాలం గుర్తించుకోవడం కోసం చాతిపై ‘అప్పు’ అని టాటూ వేయించుకున్నాడు. ఇది పునీత్ ముద్దు పేరు. అప్పుతో పాటు టోటో, నుక్కి పేర్లను కూడా పచ్చబొట్టు వేయించుకున్నాడు. అవి పునీత్ ఇద్దరి కుమార్తెల ముద్దు పేర్లు. వాళ్ల అసలు పేర్లు ‘వందిత, ధృతి’. ఇక రాఘవేంద్ర విషయానికొస్తే.. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. రాఘవేంద్ర చివరగా పునీత్ నటించిన ‘జేమ్స్’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించాడు.
ಅಪ್ಪು ಮತ್ತು ಅಪ್ಪು ಮಕ್ಕಳ ಹೆಸರನ್ನ ಎದೆ ಮೇಲೆ ಹಾಕಿಸಿಕೊಂಡ ರಾಘಣ್ಣ 🙏@iRaghanna #RaghavendraRajkumar pic.twitter.com/GMwRx7ZSYQ
— Sagar Manasu (@SagarManasu) May 28, 2023
Comments
Please login to add a commentAdd a comment