Namratha Inked Puneeth Rajkumar Name: కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణించి దాదాపు 6 నెలల కావోస్తోంది. అయినా ఇప్పటికీ ఆయన మరణాన్ని తలుచుకుని కన్నడిగులు కుమిలిపోతున్నారు. గతేడాది అక్టోబర్ 29న పునీశాండల్ వుడ్ సీని ప్రముఖులే కాదు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ పరిశ్రమలకు చెందిన సినీ సెలబ్రెటీలు నివాళులు అర్పించారు. ఇక కన్నడ ప్రజలు, ఫ్యాన్స్ అయితే పునీత్ లేడనే వార్త విని గుండెలు విలపించేలా రోధించారు. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేక మరికొందరి గుండెలు ఆగిపోయాయి.
చదవండి: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నాని సినిమా!, ఎక్కడంటే..
అంతలా ప్రతి ఒక్కరిని శోక సంద్రంలో ముంచిన పునీత్ రాజ్‌కుమార్ హీరోగానే కాదు ఓ మనిషిగా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయారు. 45 స్కూళ్లు కట్టించి, 26 అనాథశ్రమాలు, 16 ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడిపించి, 19 గోశాలలకు సాయం చేస్తూ.. చనిపోయినా రెండు కళ్లూ దానం చేశారు. ఇవన్ని చేసిన ఏనాడు పబ్లిసిటి చేసుకోలేదు. ఆయన చేస్తున్న సాయం ఏంటో ఆయన మరణం తర్వాతే ప్రపంచానికి తెలిసింది. దీంతో యావత్ దేశం ఆయనకు సెల్యూట్ కొట్టింది. ఆయనకు సాధారణ ప్రజలే కాదు సెలబ్రెటీల్లో కూడా వీరాభిమానులు ఉన్నారు. ఆయనంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఇండస్ట్రీలో సైతం ఉన్నారడానికి ఈ తాజ సంఘటనే ఉదాహరణ.
చదవండి: రానాను పక్కన పెట్టిన శేఖర్ కమ్ముల? ఆ హీరోతో లీడర్-2
పునీత్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఓ నటి ఏకంగా ఆయన పేరునుఏ టాటూగా వేసుకుంది. కన్నడ టీవీ నటి, నాగిని 2 ఫేం నమ్రత గౌడ పునీత్ రాజ్‌కుమార్‌ను వీరాభిమాని. దీంతో ఆయన పేరును చేతిపై పచ్చబొట్టుగా వేయించుకుంది. ఆయన జయంతి సందర్భంగా వేయించుకున్న ఈ పోస్ట్‌ను రీసెంట్‌గా నమ్రత షేర్ చేస్తూ ‘ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా నమ్రత పునీత్ మిలనా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. 2007లో వచ్చిన ఈ సినిమాలో నమ్రత ప్రముఖ నటుడు సిహి కహీ చంద్రుని కుమార్తెగా ఓ చిన్న రోల్ పోషించింది. నాగిని(కన్నడ) సీరియల్‌తో గుర్తింపు పొందిన ఆమె ప్రస్తుతం పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో సహానటి పాత్రలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment