Puneeth Rajkumar Family Appeals Fans Not To End Lifes: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం చిత్ర పరిశ్రమలో తీరని విషాదాన్ని నింపింది. గుండెపోటుతో చిన్న వయసులోనే పునీత్ హఠాన్మరణానికి గురవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఇక లేరన్న వార్త తెలిసి ఇప్పటికే సుమారు 12మంది అభిమానులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. వరుసగా అభిమానులు సూసైడ్‌కు పాల్పడుతుండటంపై పునీత్ భార్య అశ్విని స్పందించారు.
'పునీత్ మరణం మా కుటుంబానికి తీరని లోటు. ఇలాంటి పరిస్థితి మీ కుటుంబానికి రాకూడదు. అప్పు లేడన్న విషయాన్ని మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ఎనలేని ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఆయన మన మధ్య లేకపోయినా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి అభిమానులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడి మీ కుటుంబాన్ని ఒంటరి చేయొద్దు' అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మరోవైపు అప్పు సోదరులు శివరాజ్‌కుమార్, రాఘవేంద్రలు సైతం అభిమానులెవరూ అఘాయిత్యాలకు పాల్పడద్దని కోరారు. అంత్యక్రియల దృశ్యాలకు కూడా పదేపదే ప్రసారం చేయవద్దని మీడియాకు సైతం విజ్ఞప్తి చేశారు.
చదవండి: పునీత్ మరణాన్ని ఇలా క్యాష్ చేసుకుంటున్నారు, ఫ్యాన్స్ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment