Puneeth Rajkumar Fans Getting Emotional Seeing After James Movie: Puneeth Birth Anniversary - Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar: పవర్‌ స్టార్‌ని తలచుకొని అభిమానుల భావోద్వేగం..

Published Thu, Mar 17 2022 1:05 PM | Last Updated on Thu, Mar 17 2022 1:48 PM

Puneeth Rajkumar Fans Getting Emotional Seeing After James Movie - Sakshi

Puneeth Rajkumar Fans Getting Emotional Seeing After James Movie: కర్ణాటకలో ప్రస్తుతం జేమ్స్‌ ఫీవర్‌ నడుస్తుంది. పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన చివరి చిత్రం కావడంతో ఏ థియేటర్‌ వద్ద చూసినా సందడి వాతావరణం నెలకొంది.మార్చి17న పునీత్‌ రాజ్‌కుమార్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  కర్నాటకలో ఎన్నలేని విధంగా 500 పైగా స్క్రీన్స్‌, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250 కి పైగా స్క్రీన్స్‌ ప్రపంచ వ్యాప్తంగా 4 వేలకు పైగా స్క్రీన్స్‌ లో ఈ సినిమాను విడుదల చేశారు. చదవండి: పునీత్‌ చివరి చిత్రం​ 'జేమ్స్‌' ట్విట్టర్‌ రివ్యూ

చేతన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. తమ అభిమాన నటుడి చివరి సినిమా కావడంతో ఈ సినిమా చేసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు. పునీత్‌ యాక్షన్స్‌ సీన్స్‌ చూసి ఓ వైపు ఆనందం వ్యక్తం చేస్తుంటే, తమ ఆరాధ్య హీరో చివరి సినిమా ఇదేనంటూ మరికొందరు భావోద్వేగానికి లోనవుతున్నారు. సినిమా చూస్తున్నంత సేపు పునీత్‌ను తల్చుకొని అభిమానులు కంటతడి పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో  ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ఇప్పటికీ సీక్రెట్‌గానే.. పునీత్‌ లేడన్న విషయం ఆమెకు చెప్పలేదట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement