appu
-
పునీత్ రాజ్‌కుమార్ సినిమా చూస్తూ అభిమానుల కంటతడి
Puneeth Rajkumar Fans Getting Emotional Seeing After James Movie: కర్ణాటకలో ప్రస్తుతం జేమ్స్ ఫీవర్ నడుస్తుంది. పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం కావడంతో ఏ థియేటర్ వద్ద చూసినా సందడి వాతావరణం నెలకొంది.మార్చి17న పునీత్ రాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కర్నాటకలో ఎన్నలేని విధంగా 500 పైగా స్క్రీన్స్, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250 కి పైగా స్క్రీన్స్ ప్రపంచ వ్యాప్తంగా 4 వేలకు పైగా స్క్రీన్స్ లో ఈ సినిమాను విడుదల చేశారు. చదవండి: పునీత్ చివరి చిత్రం 'జేమ్స్' ట్విట్టర్ రివ్యూ చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. తమ అభిమాన నటుడి చివరి సినిమా కావడంతో ఈ సినిమా చేసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు. పునీత్ యాక్షన్స్ సీన్స్ చూసి ఓ వైపు ఆనందం వ్యక్తం చేస్తుంటే, తమ ఆరాధ్య హీరో చివరి సినిమా ఇదేనంటూ మరికొందరు భావోద్వేగానికి లోనవుతున్నారు. సినిమా చూస్తున్నంత సేపు పునీత్‌ను తల్చుకొని అభిమానులు కంటతడి పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ఇప్పటికీ సీక్రెట్‌గానే.. పునీత్ లేడన్న విషయం ఆమెకు చెప్పలేదట Fans getting emotional seeing after #James movie🥺 Every fan is crying coming out of theatre seeing movie😔#PuneethRajkumar #HappyBirthdayPuneethRajkumar pic.twitter.com/JHlo6XrdB8 — Babu7@అన్నఫ్యాన్ (@Babu9440) March 17, 2022 -
పునీత్ చివరి చిత్రం 'జేమ్స్' ట్విట్టర్ రివ్యూ
Puneeth Rajkumar James Movie Twitter Review In Telugu: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేంకగా చెప్పాల్సిన పనిలేదు. 'అప్పు' అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకునే కన్నడిగుల ఆర్యాధ్య నటుడాయన. స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన పునీత్ హఠాన్మరణం యావత్ పరిశ్రమను కదిలించింది. ఆయన మరణవార్తను ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే పునీత్ చనిపోవడం కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం జేమ్స్ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి17న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కన్నడ, తెలుగు,తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేశారు. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్‌గా నటించారు. ప్రియా ఆనంద్ పునీత్‌కి జోడీగా నటించింది. పునీత్ నటించిన చివరి చిత్రం కావడంతో థియేటర్ల వద్ద అభిమానులు బారులు తీరారు. కర్నాటకలో ఎన్నలేని విధంగా 500 పైగా స్క్రీన్స్, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250 కి పైగా స్క్రీన్స్ ప్రపంచ వ్యాప్తంగా 4 వేలకు పైగా స్క్రీన్స్ లో ఈ సినిమాను విడుదల చేశారు. బెనిఫిట్ షో మొదలైనప్పటి నుంచి ఈ చిత్రానికి హిట్ టాక్ వస్తోంది. పునీత్ యాక్షన్ సీన్స్ చూసి ఓవైపు ఆనందం వ్యక్తం చేస్తుంటే, తమ ఆరాధ్య హీరో చివరి సినిమా ఇదేనంటూ మరికొందరు భావేద్వోగం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈసినిమా ఎలా ఉందన్నది ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరి అవేంటో చూసేయండి. #James 1st Half - Watch Out For The Massive Performance Of Our Power Star In The Pre Interval Sequence😭❤️Total Goosebumps Stuff❤️Man Literally Nailed That Whole Pre Interval Sequence 💥💥💥#BoloBoloJames #Appu #PuneethRajkumar #AppuLivesOn — Sumanth R (@Itz_Sumanth) March 17, 2022 Celebration began at Urvashi cinemas. APPU❤❤ @Kannada_BO#CelebratePuneethRajkumar #James #Appu #BoloBoloJames pic.twitter.com/z2Jh4NOaDT — ಪ್ರಶಾಂತ್ ವಿ (@prashanthv18) March 17, 2022 Action is his Trademark😭🙏🏻🙏🏻#DrPuneethRajkumar #James @PuneethRajkumar #JamesHistoricEuphoria pic.twitter.com/hmOCCku3Oj — 𝐀𝐩𝐩𝐮 𝐂𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐢𝐨𝐧 𝐇𝐨𝐮𝐬𝐞 ™ (@AppuCelebration) March 17, 2022 Mental mass first half Fights mamuluga levu🔥🔥💥 perfect tribute to appu sir 🙏🙏#James #JamesHistoricEuphoria https://t.co/gCw7uIaxia — Amarnath CA (@CNAmarnath) March 17, 2022 Fans getting emotional seeing after #James movie🥺 Every fan is crying coming out of theatre seeing movie😔#PuneethRajkumar #HappyBirthdayPuneethRajkumar pic.twitter.com/JHlo6XrdB8 — Babu7@అన్నఫ్యాన్ (@Babu9440) March 17, 2022 Couldn’t control tears when ever i see him smile will miss that beautiful simle #PuneethRajkumar #james will cherish every second of all ur time with us fans powerstar ull be missed and forever live in our hearts 😭❤️❤️❤️❤️❤️❤️❤️❤️ pic.twitter.com/01xa65MNJH — Nishanth (@nishantn138) March 17, 2022 #James is a great commercial action entertainer. A fast paced screenplay, good story, fantastic action sequences and also good emotional content make it a perfect commercial entertainer. This movie has nice production value, music and cinematography. A very good job by director. pic.twitter.com/8Zb9c6Smmm — Indian (@Indian1726) March 17, 2022 Watching Him First Time On Screen His action sequence are 💙🙏#James #AppuLivesOn #HappyBirthdayPuneethRajkumar #JamesTelugu pic.twitter.com/YOMVw0fp6T — Teja Maddy (@maddy_teja) March 17, 2022 ST - #James (Telugu) pic.twitter.com/RVBOw2Z4In — Ananth Nithiin (@ImAnanthV) March 17, 2022 Veeresh theatre crowd 💥💥Masssss👌#BoloBoloJames #James #CelebratePuneethRajkumar #DrPuneethRajkumar #DrPuneethRajkumar #JamesHistoricEuphoria pic.twitter.com/Dj4ZNWCbzZ — Mahantesh (@Mahi_Appu75) March 17, 2022 #PuneethRajkumar #James#Powerstar Rampage. That dance, fights, screen presence!!❤ It was immensely emotional and a constant mixture of feeling his presence onscreen and absence offscreen. Yet in our hearts #AppuLivesOn. Go watch him on screen!! — Gagan Gowda (@GaganGo39511084) March 17, 2022 As a director Chethan Wins big time he had challenges he executed things well@BahaddurChethan appreciation tweet for you Sir Exceeds expectations #James #JamesonMarch17 — Yuva | James ® (@Yuva_1234) March 17, 2022 #James - came out of the film with nothing but tears. Can't believe that this is his last commercial film. 'Paramathma' will forever stay in our hearts ❤️ Wishing best to team #James on behalf of Thalaivar @rajinikanth fans...#PuneethRajkumar @PuneethRajkumar — Bangalore RFC (@Bangalore_RFC) March 17, 2022 -
ఇప్పటికీ సీక్రెట్‌గానే.. పునీత్ లేడన్న విషయం ఆమెకు చెప్పలేదట
Puneeth Rajkumar Aunt Stil Unaware Of His Death: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం ఇప్పటికీ అభిమానులకు షాకింగ్‌గానే ఉంది. ఆయన మరణించి సుమారు నాలుగు నెలలు దాటినా అభిమానులు ఆ నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నడ నాట ఓ వెలుగు వెలిగిన పునీత్ గతేడాది అక్టోబర్29న చనిపోయిన సంగతి తెలిసిందే. 46ఏళ్ల వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించడం కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. పునీత్ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ఎంతోమంది అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. మరోవైపు పునీత్ మరణించాడన్న విషయం ఇప్పటికీ ఆయన మేనత్తకు తెలియదట. 90 ఏళ్ల నాగమ్మ పునీత్ తండ్రి రాజ్‌కుమార్‌కు సొంత చెలెల్లు. ఆమెకు అప్పు అంటే చాలా ఇష్టం. పునీత్‌కి, మేనత్తకి మధ్య ఎంతటి అనుబంధం ఉందో కుటుంబ సభ్యులందరికీ తెలుసు. అందుకే పునీత్ చనిపోయినప్పుడు ఆమెకు ఆ విషయం చెప్పకుండా దాచి పెట్టారు. అప్పు గురించి ఆమె ఎప్పుడైనా అడిగినా అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాడని చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం రాఘవేంద్ర రాజ్‌కుమార్(పునీత్ రెండో అన్న) గుండెపోటుకు గురయ్యాడని తెలిసి నాగమ్మ తట్టుకోలేకపోయిందట. ఆ షాక్‌తో ఆమెను హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చిందట. సోదరుడి పిల్లలను సొంత పిల్లల్లా చూసుకున్న నాగమ్మ.. వాళ్లకు ఏమైనా జరిగిందని తెలిస్తే తల్లడిల్లేవారట. అందుకే పునీత్ చనిపోయాడన్న విషయాన్ని ఇప్పటికీ ఆమెకు చెప్పకుండా సీక్రెట్‌గా ఉంచుతున్నాం అని పునీత్ కుటుంబసభ్యుల్లో ఒకరు వెల్లడించారు. ఇక చుట్టుపక్కల వాళ్లు కూడా ఎవరైనా ఇంటికి వచ్చినా పునీత్ విషయాన్ని ఇంట్లో ప్రస్తావించకుండా ముందే జాగ్రత్తపడతారట. -
‘హ్యాపీడేస్’ అప్పు ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?
Happy Days Appu: సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీడేస్’మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అప్పటి యూత్ ఆడియెన్స్‌ని ఓ రేంజ్లో ఆకట్టుకుండి ఈ సినిమా. తన మార్క్ సహజమైన కథ, కథనాలతో ఆకట్టుకునే శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’తో ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కాలేజీలో ఎనిమిది మంది స్నేహితులు.. వాళ్ళ పరిచయాలు.. ప్రేమలు.. అపార్ధాలు.. ద్వేషాలు.. మళ్ళీ తిరిగి కలిసే ప్రయత్నాలు ఇదే హ్యాపీడేస్ సినిమా. ఇది సినిమాలా కాకుండా మన పక్కన జరిగే.. మన జీవితంలో జరిగే కథలా అనిపిస్తుంది. సినిమా మొత్తం ఎనిమిది మంది క్యారెక్టర్ల చుట్టే తిరుగుతోంది. అందులో పొట్టి జుట్టుతో కనిపించే అమ్మాయి గుర్తుందా? అదేనండి నిఖిల్ క్లోజ్ ఫ్రెండ్‌గా మూవ్ అయ్యే అప్పు అలియాస్ అపర్ణ. హ్యాపీడేస్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అప్పు క్యారెక్టర్ని మర్చిపోలేరు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయింది గాయత్రీరావు. తొలి సినిమాయే అయినా.. ఎంతో అనుభవం ఉన్నట్లు నటించింది. హ్యాపీ డేస్ సినిమా తరువాత రామ్ చరణ్ నటించిన ‘ఆరంజ్’పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలోనూ నటించిన గాయత్రిరావు.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో 2019లో వివాహం చేసుకొని చెన్నైలో స్థిరపడిపోయింది. ఇక గాయత్రీ ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఆమె తల్లిదండ్రులు సినీ పరిశ్రమకు చెందిన వారు. తల్లి పేరు బెంగుళూర్ పద్మ. తండ్రి అరుణ్ కుమార్. పద్మ టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించింది. హ్యాపీ డేస్ సినిమాలో కూడా పద్మ నిఖిల్ కి అమ్మగా నటించింది. ఈమె పాత చిత్రాలలో చాలా హిట్ సినిమాల్లో కూడా నటించింది. సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో గాయత్రీ రావు విఫలమైంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పుటికీ.. ఫ్యామిలీ లైఫ్‌ని మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది గాయత్రీ. అవకాశాలు వస్తే.. మళ్లీ నటించేందుకు సిద్దమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. త్వరగా అవకాశాలు వచ్చి మరోసారి వెండితెరపై ‘అప్పు’ అలరించాలని ఆశిద్దాం. చదవండి: ఈ ఏడాదైనా స్టార్ హీరోల దర్శనం దొరికేనా? -
అప్పూః ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్
ప్రతిరోజూ ఇంటి పనులు, ఉద్యోగ బాధ్యతలు... ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడూ ఏదొక హడావుడి! మరి, పిల్లలతో కాస్త సమయం గడిపే వీలుంటుందా? వాళ్లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే తీరికుందా? అసలు, చిన్నారుల చిన్ని చిన్ని కోరికలను పెద్దలు నిర్లక్ష్యం చేస్తే ఏమౌతుంది? పసి వయసులో తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఏం కోరుకుంటారు? అనే సందేశంతో రూపొందిన బాలల సినిమా ‘అప్పూ’. ది క్రేజీ బాయ్.. అనేది ఉపశీర్షిక. మాస్టర్ సాయి శ్రీవంత్ టైటిల్ రోల్లో మోహన్ మూవీ మేకర్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో మోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత కె. మోహన్ మాట్లాడుతూ – ‘‘ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో మా సినిమా ఎంపిక కావడం హ్యాపీగా ఉంది. సాయి శ్రీవంత్తో పాటు బాల తారలు సుమిత్ జాషు, సాయి అభిషేక్, లాస్య, మనోజ్ఞ, ఆదా, చిరుహాస్, సద్దాంలు నటించారు. యాక్టర్స్ జాకీ, లోహిత్ కుమార్, కావ్య, బండ జ్యోతి, జ్వాలా చక్రవర్తి, ఫణి అద్భుతంగా నటించారు. మంచి సందేశంతో అందర్నీ అలరించేలా ఈ సినిమా ఉంటుంది. చిన్నారులతో పాటు తల్లిదండ్రులందరూ చూడాల్సిన చిత్రం’’ అన్నారు. -
అప్పూ గురి తప్పదు!
చదువులోనైనా... చురుగ్గా వ్యవరించడం లోనైనా అప్పూ గురి తప్పదు! అంత తెలివై నోడు కాబట్టే 8 ఏళ్ల వయసులో ఏనుగును చూడాలని ఇంటి నుంచి ఒంటరిగా బయట అడుగు పెట్టినోడు క్షేమంగా ఇంటికొస్తాడు. ఈ మధ్యలో అప్పూ ఏం చేశాడనేది తెరపై చూపిస్తామంటున్నారు దర్శక–నిర్మాత కె. మోహన్. మాస్టర్ సాయి శ్రీవంత్ టైటిల్ రోల్లో ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన బాలల సినిమా c జాకీ, లోహిత్, కావ్య, బండ జ్యోతి, జ్వాలా చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ లభించింది. చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కె. మోహన్ మాట్లాడుతూ– ‘‘చిన్నారుల చిన్ని చిన్ని కోరికలను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ఏమౌతుంది?’’ అనే çకథతో రూపొందిన చిత్రమిది’’ అన్నారు. బాలతారలుగా సుమిత్ జాషు, సాయి అభిషేక్, లాస్య, మేఘన, మనోజ్ఞ, ఆదా, చిరుహాస్, సద్దాం తదితరులు నటించారు. -
అప్పూ కోరిక ఏంటంటే...!
‘‘చిన్న చిత్రాల నిర్మాణం అంత సులువు కాదు. ఇక, బాలల చిత్రాలంటే మరీనూ. అయినప్పటికీ ఓ మంచి చిత్రం ఇవ్వాలనే ఆకాంక్షతో ‘అప్పూ’ మొదలుపెట్టాను. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ చిత్రాన్ని పూర్తి చేశాను’’ అని కె. మోహన్ అన్నారు. స్వీయదర్శకత్వంలో ఆయన రూపొందించిన ‘అప్పూ’ షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. టైటిల్ రోల్లో మాస్టర్ సాయి శ్రీవంత్ నటించగా, జాకీ, లోహిత్కుమార్, ప్రగ్య, బిందు, జేవీఆర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిత్రవిశేషాలను దర్శక-నిర్మాత మోహన్ తెలియజేస్తూ - ‘‘ఉద్యోగాలతో బిజీగా ఉండే తల్లితండ్రులు తన కోసం సమయం కేటాయించాలనీ, ఏనుగును చూడాలనే కోరికను తీర్చాలనీ అప్పూ అనుకుంటాడు. ఈ చిన్నారి చిన్ని కోరికను తీర్చే తీరిక తల్లితండ్రులకు ఉండదు. ఏనుగును చూడాలని తన స్నేహితులతో కలిసి అడవికి వెళ్లిన అప్పూ ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు? అనేది చిత్రకథ. కె.రాఘవేంద్రరావుగారితో పాటు పలువురి దర్శకుల దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన అనుభవంతో తొలి ప్రయత్నంగా నేను రూపొందించిన చిత్రం ఇది. కమర్షియల్ హంగులతో సాగే ఈ చిత్రానికి స్వర్గీయ శ్రీ ఇచ్చిన బాణీల్లో పాటలు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. బండ జ్యోతి, కావ్య, బాల తారలు సాయి అభి షేక్, లాస్య, మేఘన, జాషువా, మనోజ్ఞ, ఆదా, చిరుహాస్, సద్దాం నటించారు. -
ఏనుగు కోసం...
నగరజీవితంలో అంతా బిజీ. పిల్లల చిన్న చిన్న కోరికలను కూడా తీర్చే తీరిక ఈ రోజుల్లో తల్లిదండ్రులకు లేకుండా పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎనిమిదేళ్ల అప్పూకి ఏనుగును చూడాలనిపించింది. అమ్మా, నాన్నలను అడిగాడు.. కానీ కోరిక నెరవేరలేదు. అప్పుడు తన కోరికను తీర్చుకోవడానికి స్నేహితులతో ఎలాంటి సాహసానికి పూనుకున్నాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘అప్పూ’. టైటిల్ రోల్‌ను మాస్టర్ సాయి శ్రీవంత్ పోషిస్తున్నాడు. ఉపశీర్షిక ‘ది క్రేజీ బాయ్’. మోహన్ మూవీ మేకర్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కె. మోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను మోహన్ తెలియజేస్తూ -‘‘కె.రాఘవేంద్రరావు దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశాను. మంచి చిత్రం చేయాలన్న ఆకాంక్షతో ‘అప్పూ’ చేస్తున్నాను. బాలల చిత్రమే అయినప్పటికీ వాణిజ్య హంగులు కూడా ఉంటాయి. ఓ కీలక పాత్రను ఒక ప్రముఖ నటి చేయనున్నారు. ఇందులో ఉన్న నాలుగు పాటలకు శ్రీ అద్భుతమైన స్వరాలందించారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయింది’’ అని చెప్పారు. లోహిత్, కావ్య, బండ జ్యోతి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో బాల తారలు సాయి అభిషేక్, లాస్య, మేఘన, జాషువా, మనోజ్ఞ, ఆదా, చిరుహాస్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ. -
మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అప్పు అరెస్ట్
తిరుపతి: మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అప్పు అలియాస్ అన్బు సెల్వంను పోలీసులు మంగళవారం చిత్తూరులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్‌కు తరలించి... తమదైన శైలిలో విచారించారు. ఈ సందర్భంగా అతడి నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో అప్పు అత్యంత కీలకంగా వ్యవహారించాడని పోలీసులు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో తనకు సహకరించిన పలువురు వ్యక్తుల పేర్లను అప్పు వెల్లడించాడని పోలీసులు చెప్పారు. అప్పును శ్రీకాళహస్తి కోర్టులో బుధవారం పోలీసులు హాజరుపరచనున్నారు. అతడికి బెయిల్ ఇప్పించేందుకు చెన్నై లాయర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కంచి శంకరమఠం మేనేజర్ రామన్ హత్య కేసులో అప్పు ప్రధాన నిందితడని పోలీసులు తెలిపారు. చెన్నైలోని అప్పుకు ఓ హోటల్ కూడా ఉందని పోలీసులు పేర్కొన్నారు. అప్పు కోసం గత కొంత కాలంగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆ క్రమంలో అప్పు బుధవారం పోలీసులకు చిక్కాడు.