ప్రతిరోజూ ఇంటి పనులు, ఉద్యోగ బాధ్యతలు... ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడూ ఏదొక హడావుడి! మరి, పిల్లలతో కాస్త సమయం గడిపే వీలుంటుందా? వాళ్లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే తీరికుందా? అసలు, చిన్నారుల చిన్ని చిన్ని కోరికలను పెద్దలు నిర్లక్ష్యం చేస్తే ఏమౌతుంది? పసి వయసులో తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఏం కోరుకుంటారు? అనే సందేశంతో రూపొందిన బాలల సినిమా ‘అప్పూ’. ది క్రేజీ బాయ్.. అనేది ఉపశీర్షిక. మాస్టర్ సాయి శ్రీవంత్ టైటిల్ రోల్‌లో మోహన్ మూవీ మేకర్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో మోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది.
ఈ సందర్భంగా దర్శక–నిర్మాత కె. మోహన్ మాట్లాడుతూ – ‘‘ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో మా సినిమా ఎంపిక కావడం హ్యాపీగా ఉంది. సాయి శ్రీవంత్‌తో పాటు బాల తారలు సుమిత్ జాషు, సాయి అభిషేక్, లాస్య, మనోజ్ఞ, ఆదా, చిరుహాస్, సద్దాంలు నటించారు. యాక్టర్స్ జాకీ, లోహిత్ కుమార్, కావ్య, బండ జ్యోతి, జ్వాలా చక్రవర్తి, ఫణి అద్భుతంగా నటించారు. మంచి సందేశంతో అందర్నీ అలరించేలా ఈ సినిమా ఉంటుంది. చిన్నారులతో పాటు తల్లిదండ్రులందరూ చూడాల్సిన చిత్రం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment