Puneeth Rajkumar: Aunt Unaware Of Puneeth Death, Family Kept It As Secret Details Inside - Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar: పునీత్‌ మరణవార్తను రహస్యంగా ఉంచిన కుటుంబసభ్యులు..

Published Thu, Mar 17 2022 10:42 AM | Last Updated on Thu, Mar 17 2022 11:40 AM

Puneeth Rajkumar Aunt Unware Of Actors Death, Family Kept It As Secret - Sakshi

Puneeth Rajkumar Aunt Stil Unaware Of His Death: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం ఇప్పటికీ అభిమానులకు షాకింగ్‌గానే ఉంది. ఆయన మరణించి సుమారు నాలుగు నెలలు దాటినా అభిమానులు ఆ నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నడ నాట ఓ వెలుగు వెలిగిన పునీత్‌ గతేడాది అక్టోబర్‌29న చనిపోయిన సంగతి తెలిసిందే. 46ఏళ్ల వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించడం కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. పునీత్‌ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక  ఎంతోమంది అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే.

మరోవైపు పునీత్‌ మరణించాడన్న విషయం ఇప్పటికీ ఆయన మేనత్తకు తెలియదట. 90 ఏళ్ల నాగమ్మ పునీత్‌ తండ్రి రాజ్‌కుమార్‌కు సొంత చెలెల్లు. ఆమెకు అప్పు అంటే చాలా ఇష్టం. పునీత్‌కి, మేనత్తకి మధ్య ఎంతటి అనుబంధం ఉందో కుటుంబ సభ్యులందరికీ తెలుసు. అందుకే పునీత్‌ చనిపోయినప్పుడు ఆమెకు ఆ విషయం చెప్పకుండా దాచి పెట్టారు. అప్పు గురించి ఆమె ఎప్పుడైనా అడిగినా అవుట్‌డోర్‌ షూటింగ్‌లో ఉన్నాడని చెబుతున్నారు.

కొన్నాళ్ల క్రితం​ రాఘవేంద్ర రాజ్‌కుమార్‌(పునీత్‌ రెండో అన్న) గుండెపోటుకు గురయ్యాడని తెలిసి నాగమ్మ తట్టుకోలేకపోయిందట. ఆ షాక్‌తో ఆమెను హాస్పిటల్‌లో చేర్పించాల్సి వచ్చిందట. సోదరుడి పిల్లలను సొంత పిల్లల్లా చూసుకున్న నాగమ్మ.. వాళ్లకు ఏమైనా జరిగిందని తెలిస్తే తల్లడిల్లేవారట. అందుకే పునీత్‌ చనిపోయాడన్న విషయాన్ని ఇప్పటికీ ఆమెకు చెప్పకుండా సీక్రెట్‌గా ఉంచుతున్నాం అని పునీత్‌ కుటుంబసభ్యుల్లో ఒకరు వెల్లడించారు. ఇ​క చుట్టుపక్కల వాళ్లు కూడా ఎవరైనా ఇంటికి వచ్చినా పునీత్‌ విషయాన్ని ఇంట్లో ప్రస్తావించకుండా ముందే జాగ్రత్తపడతారట. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement