Puneeth Rajkumar James Movie Twitter Review In Telugu - Sakshi
Sakshi News home page

James Movie Twitter Review: 'జేమ్స్‌' మూవీ ఎలా ఉందంటే...

Published Thu, Mar 17 2022 11:29 AM | Last Updated on Thu, Mar 17 2022 12:19 PM

Puneeth Rajkumar James Movie Twitter Review In Telugu - Sakshi

Puneeth Rajkumar James Movie Twitter Review In Telugu: కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేంకగా చెప్పాల్సిన పనిలేదు. 'అప్పు' అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకునే కన్నడిగుల ఆర్యాధ్య నటుడాయన. స్టార్‌ హీరోగా ఓ వెలుగు వెలిగిన పునీత్‌ హఠాన్మరణం యావత్‌ పరిశ్రమను కదిలించింది. ఆయన మరణవార్తను ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే పునీత్‌ చనిపోవడం కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం జేమ్స్‌ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి17న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

చేతన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కన్నడ, తెలుగు,తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేశారు. టాలీవుడ్‌ హీరో శ్రీకాంత్‌ ఈ చిత్రంలో విలన్‌గా నటించారు. ప్రియా ఆనంద్‌ పునీత్‌కి జోడీగా నటించింది. పునీత్‌ నటించిన చివరి చిత్రం కావడంతో థియేటర్ల వద్ద అభిమానులు బారులు తీరారు. కర్నాటకలో ఎన్నలేని విధంగా 500 పైగా స్క్రీన్స్‌, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250 కి పైగా స్క్రీన్స్‌ ప్రపంచ వ్యాప్తంగా 4 వేలకు పైగా స్క్రీన్స్‌ లో ఈ సినిమాను విడుదల చేశారు.

బెనిఫిట్‌ షో మొదలైనప్పటి నుంచి ఈ చిత్రానికి హిట్‌ టాక్‌ వస్తోంది. పునీత్‌ యాక్షన్‌ సీన్స్‌ చూసి ఓవైపు ఆనందం వ్యక్తం చేస్తుంటే, తమ  ఆరాధ్య హీరో చివరి సినిమా ఇదేనంటూ మరికొందరు భావేద్వోగం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈసినిమా ఎలా ఉందన్నది ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరి అవేంటో చూసేయండి. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement