తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. తెనాలి మునిసిపాలిటీ సహకారంతో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న రెండురోజుల చలన చిత్రోత్సవాన్ని స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రొజెక్టర్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలనతో ఎమ్మెల్యే శివకుమార్‌తోపాటు చైర్‌పర్సన్ సయ్యద్ ఖాలీదా నసీమ్, బాలనటుడు మాస్టర్ భానుప్రకాష్, సినీ దర్శకుడు నాగమురళి తెడ్ల అతిథులుగా పాల్గొన్నారు.
ప్రారంభ సభకు ఫిలిం సొసైటీ చైర్మన్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. ఈ చలన చిత్రోత్సవం స్ఫూర్తితో తెనాలిలో ఇదే కళాక్షేత్రంలో ప్రతినెలా ఓ ఆదివారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంతర్జాతీయ బాలల సినిమాలను ప్రదర్శింపజేస్తామని చెప్పారు. తెనాలి మునిసిపాలిటీ,
ఫిలిం సొసైటీ పెద్దల కమిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment