FIRST DAY
-
‘భారత్ మొబిలిటీ ఎక్స్పో’ ప్రారంభం.. కొత్త కార్లు, బైక్‌లతో సందడే సందడి (ఫొటోలు)
-
సత్సంకల్పం.. సత్సంవత్సరం
సాధారణంగా కొత్తసంవత్సరం వస్తోంది అంటే పండుగ వాతావరణం నెలకొంటుంది. సంవత్సరంతోపాటు తమ జీవితాలలో కూడా మార్పు వస్తుందనే ఆశతో అందరిలోనూ ఉత్సాహం ఉరకలెత్తుతూ ఉంటుంది. ఎవరి పద్ధతులలో వారు వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. కొత్తసంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు. విందులు, వినోదాలు, శుభాకాంక్షలు తెలుపుకోటం. ఒకటే సంబరం. రాబోయే కాలం ఆనందదాయకంగా ఉండాలనే ఆకాంక్ష, ఉంటుందనే విశ్వాసం వ్యక్తం చేయటంతోపాటు ఇంతకాలం జీవితాన్ని ఆనందంగా గడిపినందుకు, ఆ విధంగా గడిపే అవకాశం ఇచ్చినందుకుభగవంతుడికి కృతజ్ఞతని ఆవిష్కరించటం వీటిలోని అసలు అర్థం. సంవత్సరంలో మొదటిరోజు ఏ విధంగా గడిపితే సంవత్సరం అంతా అదేవిధంగా ఉంటుందని అందరి విశ్వాసం. కనుక వీలైనంత ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాలాన్ని నారాయణ స్వరూపంగా భావించి పూజించటం, ఆరాధించటం భారతీయ సంప్రదాయం. అంటే, ఆయా సమయాలలో ప్రకృతిలో వచ్చే మార్పులకి తగినట్టుగా ప్రవర్తించటం అందులో ఒక భాగం. నిత్యవ్యవహారానికి ప్రధానంగా చాంద్రామానాన్నేపాటించినా సంక్రమణాలు, విషువులు మొదలయినవి సూర్యమానానికి సంబంధించినవి. ప్రస్తుతం ప్రపంచం చాలావరకు సౌరమానాన్ని అనుసరిస్తోంది. ఇందులో సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. ఒకరకంగా లెక్క తేలిక. కాలచక్ర భ్రమణం వర్తులాకారంలో ఉంటుంది. ఎక్కడి నుండి లెక్క పెట్టటం మొదలుపెట్టామో అక్కడికి వచ్చి ఆగి మరొక ఆవృతం ప్రారంభం అవుతుంది. అందుకని ఎక్కడి నుండి అయినా లెక్కించటం మొదలు పెట్టవచ్చు.రాజకీయమైన అనేక వత్తిడుల కారణంగా చాలా మార్పులు, సద్దుబాట్లు జరిగిన తరువాత తయారైన గ్రెగేరియన్ కాలెండర్ ప్రకారం జనవరి ఒకటవ తేదీని కొత్త సంవత్సరప్రారంభ దినంగా నిర్ణయించటం జరిగింది. భూగోళాన్ని ఒక కుగ్రామంగా పరిగణిస్తున్న ఈ రోజుల్లో అందరూ ఒకే కాలమానాన్నిపాటించటం సౌకర్యం. వ్యక్తిగత ఇష్టానిష్టాలని పక్కకిపెట్టి అందరూ ‘‘కామన్ ఎరా’’ అని ప్రపంచంలో ఎక్కువ దేశాలలో అమలులో ఉన్న ఈ కాలమానాన్ని అనుసరిస్తున్నారు. చాంద్రమానాన్నిపాటించే భారతీయులు కూడా లౌకిక వ్యవహారాలకి కామన్ ఎరానే అనుసరిస్తున్నారు. విద్యాలయాలలో ప్రవేశానికి, ఉద్యోగ దరఖాస్తుకి,పాస్‌పోర్ట్, వీసా మొదలయిన వాటికి తేదీనే ఇస్తున్నాం కాని, తిథి, మాసం మొదలయిన వివరాలు ఇవ్వటం లేదు కదా! తమ వ్యక్తిగత, ఆధ్యాత్మిక వ్యవహారాలకి చాంద్రమానాన్నిపాటిస్తున్నారు. ఉదాహరణకి పుట్టిన రోజులు,పెళ్లి, గృహప్రవేశం మొదలయిన శుభ కార్యాల ముహూర్తాలు, పితృకార్యాలు మొదలైన వాటిని చాంద్రమానాన్ని అనుసరించి నిర్ణయిస్తారు. కాలం ఎవరికోసం ఆగదు. కాలచక్రంలో మరొక ఆకు ముందుకి కదిలింది. కొత్త ఆవృతం మొదలవుతోంది. అంటే మరొక సంవత్సరం కాలగర్భంలో కలిసింది. కొత్త సంవత్సరంప్రారంభం కాబోతోంది. కాని, అనుభవజ్ఞులైన పెద్దలు చేసే సూచన ఏమంటే జరిగిపోయిన సంవత్సరంలో ఏం చేశాము అని సమీక్షించుకుని, తీపి,చేదు అనుభవాలని నెమరు వేసుకుని, గెలుపోటములని, మానావమానాలని, బేరీజు వేసుకుని, తమ లక్ష్యాలని, లక్ష్యసాధన మార్గాలని నిర్ధారించుకుని, పనికిరానివాటిని పక్కకిపెట్టి, అవసరమైనవాటిని చేపడతామని నిర్ణయించుకోవలసిన సమయం ఇది అని. తమ ఆయుర్దాయంలో మరొక సంవత్సరం గడిచిపోయింది, చేయవలసిన పనులు త్వరగా చేయాలి అని తమని తాము హెచ్చరించుకోవాలి. అందుకే ఎంతోమంది ఒక చెడు అలవాటుని మానుతామనో, కొత్తపని ఏదైనా మొదలు పెడతామనో అని నూతన సంవత్సర నిర్ణయాలని ప్రకటిస్తూ ఉంటారు. రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలని ఆనందాన్ని ఇతోధికంగా ఇవ్వాలని, యుద్ధవాతావరణం ఉపశమించి ప్రపంచంలో శాంతి నెలకొనాలని, చేసుకున్న తీర్మానాలు అమలు జరిపే శక్తిసామర్థ్యాలు ప్రసాదించాలని ఒకరికొకరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుందాం. – డా. ఎన్.అనంతలక్ష్మి -
మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్-10 ఇండియన్ సినిమాలు (ఫొటోలు)
-
Uttar Pradesh: నేడు వందేభారత్ రైలులో ఉచిత ప్రయాణం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్-లక్నోల మధ్య నేటి నుంచి వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. మీరట్-లక్నో-మీరట్(22490/22491) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు, రాకపోకల జాబితాను రైల్వేశాఖ విడుదల చేసింది.ఈరోజు (శనివారం) ఈ రైలు తొలిసారిగా పట్టాలు ఎక్కనుంది. నేడు అతిథి ప్రయాణికులకు రైల్వేశాఖ మీరట్-లక్నోల మధ్య ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. లక్నో-మీరట్(22491), మీరట్-లక్నో(22490) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల రెగ్యులర్ ఆపరేషన్ ఆదివారం నుండి ప్రారంభంకానుంది. శుక్రవారం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఈ రైలు అప్డేట్ అయిన తర్వాత టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారు.బరేలీ జంక్షన్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ రైలు మీరట్-లక్నో మధ్య మొరాదాబాద్, బరేలీ జంక్షన్లలో మాత్రమే ఆగుతుంది. ఈ రైలుకు సంబంధించిన బుకింగ్ ప్రారంభమైన నేపధ్యంలో సెప్టెంబర్ 5 తర్వాత తేదీల ప్రయాణం కోసం సీట్లు వేగంగా బుక్ అవుతున్నాయి. ప్రస్తుతం బరేలీ జంక్షన్లో రైలుకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మీరట్-లక్నో వందే భారత్ మీరట్ నుండి ఉదయం 6:35 గంటలకు బయలుదేరి, 8:35 గంటలకు మొరాదాబాద్, 9:56 గంటలకు బరేలీ చేరుకుని మధ్యాహ్నం 1:45 గంటలకు లక్నో చేరుకుంటుంది. అలాగే లక్నో-మీరట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లక్నో నుండి మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:02 గంటలకు బరేలీకి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి రాత్రి 7:32 గంటలకు మొరాదాబాద్, రాత్రి 10 గంటలకు మీరట్ చేరుకుంటుంది. -
‘ఐదు’తో అదరగొట్టారు
ఈసారి పతకాల వేటలో ‘సెంచరీ’ దాటాలని చైనాలో అడుగుపెట్టిన భారత క్రీడాకారులు తొలిరోజే పతకాల ఖాతా తెరిచారు. 19వ ఆసియా క్రీడల్లో మొదటి రోజు ఐదు పతకాలతో అదరగొట్టారు. స్వర్ణ పతకం అందకపోయినా మూడు రజతాలు, రెండు కాంస్యాలతో శుభారంభం చేశారు. అంచలను అందుకుంటూ షూటర్లు తమ గురిని పతకాలపై పెట్టగా... రోయింగ్‌లోనూ భారత క్రీడాకారులు తమ సత్తా చాటుకున్నారు. మహిళల బాక్సింగ్, పురుషుల హాకీ, టెన్నిస్ క్రీడాంశాల్లోనూ మనోళ్లు రాణించారు. టేబుల్ టెన్నిస్, వాలీబాల్, మహిళల ఫుట్‌బాల్‌లో భారత్ పతకాల రేసు నుంచి ని్రష్కమించారు. హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో తొలి రోజు భారత క్రీడాకారులు మెరిపించారు. షూటింగ్లో రెండు, రోయింగ్‌లో మూడు పతకాలతో రాణించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం టీమ్ ఈవెంట్లో రమితా జిందాల్, మెహులీ ఘోష్, ఆశి చౌక్సీలతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. క్వాలిఫయింగ్‌లో భారత బృందం 1886 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. హాన్ జియావు, యుటింగ్ హువాంగ్, జిలిన్ వాంగ్‌లతో కూడిన చైనా జట్టు 1896.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. గాన్‌హుయగ్, యసుజెన్, నరన్‌తుయాలతో కూడిన మంగోలియా జట్టు 1880 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించింది. క్వాలిఫయింగ్‌లో రమిత 631.9 పాయింట్లతో రెండో స్థానంలో, మెహులీ 630.8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్‌లో టాప్–8లో నిలిచిన వారి మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో ఫైనల్‌ను నిర్వహిస్తారు. ఫైనల్లో రమిత 230.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకోగా... మెహులీ 208.3 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. యుటింగ్ హువాంగ్ (252.7 పాయింట్లు) స్వర్ణం, హాన్ జియావు (251.3 పాయింట్లు) రజతం గెల్చుకున్నారు. రోయింగ్‌లో పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ ఈవెంట్లో అర్జున్ లాల్ జాట్–అరవింద్ సింగ్ ద్వయం రజత పతకంతో బోణీ కొట్టింది. భారత జోడీ 6ని:28.18 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. జున్‌జీ ఫాన్–మన్ సున్ (చైనా; 6ని:23.42 సెకన్లు) జంట స్వర్ణ పతకం సాధించింది. పురుషుల పెయిర్ విభాగంలో బాబూలాల్ యాదవ్–లేఖ్ రామ్ జోడీ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. ఫైనల్ రేసులో బాబూలాల్–లేఖ్ రామ్ జంట 6ని:50.41 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానాన్ని దక్కించుకుంది. అనంతరం పురుషుల కాక్స్డ్ ఎయిట్ ఈవెంట్లో భారత జట్టు రజతం గెల్చుకుంది. నీరజ్, నరేశ్ కల్వానియా, నితీశ్ కుమార్, చరణ్‌జీత్ సింగ్, జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్ కుమార్, ఆశిష్‌లతో కూడిన భారత జట్టు 5ని:43.01 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని పొందింది. వాలీబాల్‌లో భారత పురుషుల జట్టు పతకం రేసు నుంచి నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 16–25, 18–25, 17–25తో జపాన్ చేతిలో ఓడిపోయింది. పురుషుల టెన్నిస్ డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ (భారత్) 6–2, 6–3తో అభిషేక్–ప్రదీప్ (నేపాల్)లపై గెలిచారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ 6–0, 6–0తో మార్కో టిన్ (మకావు)పై ఘనవిజయం సాధించాడు. ఏషియాడ్‌లో నేటి భారతీయంమెడల్ ఈవెంట్స్ షూటింగ్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్, వ్యక్తిగత విభాగం: రుద్రాం„Š పాటిల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్, దివ్యాంశ్ (ఉదయం గం. 6:30 నుంచి 9 వరకు). మహిళల క్రికెట్ ఫైనల్: భారత్‌గీశ్రీలంక (ఉదయం గం. 11:30 నుంచి). రోయింగ్: పురుషుల సింగిల్ స్కల్స్ (బల్రాజ్ పన్వర్; ఉదయం గం. 7 నుంచి); పురుషుల క్వాడ్రాపుల్ స్కల్స్ (ఉదయం గం. 8:30 నుంచి); మహిళల ఎయిట్ (ఉదయం గం. 8:50 నుంచి). -
విభజనతో చేదు అనుభవాలు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందని, అనేక చేదు అనుభవాలను మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనతో ఇటు తెలంగాణగానీ, అటు ఏపీగానీ సంబరాలు చేసుకోలేపోయాయని.. విభజన సమయంలో విషపు బీజాలు నాటబడ్డాయని విమర్శించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా సోమవారం పార్లమెంట్ 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రసంగించిన మోదీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అందరి సమ్మతితో కష్టతరమైన పనులనూ పార్లమెంటు పూర్తి చేసింది. ఇదే సభలో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో ప్రణాళికాబద్ధంగా మూడు రాష్ట్రాల విభజన జరిగింది. ఆ రాష్ట్రాల విభజన సమయంలో అన్నిచోట్లా సంబరాలు జరిగాయి. ఉత్తరాఖండ్ ఏర్పాటు సమయంలో దాని మాతృ రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ సంబరాలు చేసుకుంది. అలాగే ఛత్తీస్‌గఢ్ ఏర్పాటు సమయంలో మధ్యప్రదేశ్.. జార్ఖండ్ ఏర్పాటు సమయంలో బిహార్ కూడా సంబరాలు చేసుకున్నాయి. అందరి సమ్మతితో సుహృద్భావ వాతావరణంలో విభజన జరిగింది. కానీ కొన్ని చేదు జ్ఞాపకాలు మిగిలిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగింది. రక్తపుటేర్లు పారాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రెండూ సంబరాలు చేసుకోలేకపోయాయి. విభజన సమయంలో విష బీజాలు నాటబడ్డాయి. వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటైన మాదిరిగా అదే ఉత్సాహంతో తెలంగాణను ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. ఈ రోజు తెలంగాణ ఒక కొత్త శిఖరానికి చేరుకునేది..’’అని మోదీ పేర్కొన్నారు. నిజానికి గత ఏడాది ఫిబ్ర వరి 8న బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రధాని మోదీ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. విభజన సరిగా జరగలేదని.. కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన ఏపీని సిగ్గుపడేలా కాంగ్రెస్ విభజించిందని ఆరోపించారు. పోరాట స్ఫూర్తిని కించపర్చేలా మోదీ వ్యాఖ్యలు: రేవంత్‌రెడ్డి తెలంగాణ పోరాట స్ఫూర్తిని కించపర్చేలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘తెలంగాణ త్యాగాల విలువ, పోరాట స్ఫూర్తిని కించపర్చేలా మోదీ మాట్లాడటం ఘోరం. రాష్ట్రం ఏర్పాటు చేసిన పార్టీగా తెలంగాణ గుండె చప్పుడు తెలుసుకాబట్టే మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తిప్పికొట్టారు. మనం బీజేపీని తరిమికొడదాం’’అని ‘ఎక్స్’లో పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడమే: రాహుల్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపట్టేలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘‘తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడటం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానించడమే..’’అని మంగళవారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలు సరికాదు: బీఆర్ఎస్ విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు సభలో తిప్పికొట్టారు. బీఆర్ఎస్ తరఫున ప్రసంగించిన నామా... ‘‘తెలంగాణ ఏర్పాటు చేదు జ్ఞాపకాలను మిగిలి్చందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు సరికాదు. తెలంగాణ నేడు దేశంలోనే నంబర్‌వన్‌గా ఉంది. తలసరి ఆదాయం, తల సరి విద్యుత్ వినియోగంలో నంబర్‌వన్ స్థానంలో ఉంది. రైతు బంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు దేశంలో తెలంగాణ మోడల్ రావాల్సి ఉంది..’’అని పేర్కొన్నారు. ఒకప్పుడు బీజేపీకి కేవలం ఇద్దరు ఎంపీలే ఉంటే ఇప్పుడు 300కు పైగా ఉన్నారని, పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారని... అదే మాదిరి గా ఇద్దరు ఎంపీలే ఉన్నా తమ పార్టీ కొట్లాడి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని సాధించిందని చెప్పారు. ఇక నూతన పార్లమెంట్ భవనానికి బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని నామా డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టామని, హైదరాబాద్‌లో 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళిత పక్షపాతని కేసీఆర్ నిరూపించుకున్నారని చెప్పారు. -
Babu In Jail: తొలి రోజు గడిచిందిలా..
సాక్షి, అమరావతి, సాక్షి, రాజమహేంద్రవరం: పొద్దున్నే యోగా.. కాసేపు పత్రికల పఠనం... ప్రత్యేకంగా తెప్పించిన ఆహారం... రెండు సార్లు వైద్య పరీక్షలు.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి భద్రత నడుమ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా తొలిరోజు గడిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టై రిమాండ్ ఖైదీ 7691గా ఉన్న ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా, పూర్తి భద్రతతో కూడిన ప్రత్యేక గదిలో ఉంటున్నారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రత్యేకంగా సహాయకుడు.. వంటకు ప్యాంట్రీ కార్ న్యాయస్థానం ఆదేశాలతో జైలు అధికారులు చంద్రబాబుకు స్నేహ బ్యారక్‌లో ప్రత్యేక గదిని ఆదివారం రాత్రే కేటాయించారు. అందులో వెస్ట్రన్ మోడల్ టాయిలెట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు ప్రత్యేకంగా ఓ సహాయకుడిని అందుబాటులో ఉంచారు. చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో ఆయన కాన్వాయ్‌లో ఉండే ప్రత్యేక ప్యాంట్రీ కార్‌ను జైలుకు సమీపంలో ఉంచారు. నారా లోకేష్ రాజమహేంద్రవరంలోనే ఓ టీడీపీ నేత ఇంటి వద్ద మకాం వేసి చంద్రబాబుకు అవసరమైనవన్నీ సమకూరుస్తున్నారు. ఉదయం అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్‌తో పాటు వేడినీళ్లు, బ్లాక్ కాఫీని పంపారు. మధ్యాహ్న భోజనంలో 100 గ్రాముల బ్రౌన్ రైస్, బెండకాయ వేపుడు, పన్నీర్ కూర, పెరుగు పంపించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీ తాగేందుకు వేడినీళ్లు అందజేసినట్లు తెలిసింది. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం, మధ్యాహ్న భోజనం అనంతరం చంద్రబాబుకు రెండు సార్లు వైద్య పరీక్షలు చేశారు. ఆయన ఉంటున్న స్నేహ బ్యారక్‌కు ఎదురుగానే జైలుకు సంబంధించిన ఆస్పత్రి ఉండటంతో అక్కడ వైద్య పరీక్షలు చేపట్టారు. రాత్రి కూడా ప్యాంట్రీ కార్ నుంచే పుల్కాలు, పెరుగు తెప్పించి ఆహారాన్ని అందించారు. నిరంతరం 1 + 4 భద్రత జైలు అధికారులు చంద్రబాబు భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయన ఉన్న జైలు గది వద్ద 24 గంటలపాటు విధులు నిర్వహించేలా 1 + 4 భద్రతను వినియోగించారు. జైలు లోపల, చుట్టుపక్కల పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు కల్పించారు. కట్టుదిట్టమైన భద్రతతోపాటు జైలులో ఉన్న సీసీ కెమెరాల ద్వారా భద్రతను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో పూర్తిస్థాయి భద్రత నడుమ ఉన్నారు. తొలిరోజు ములాఖత్‌లు లేవు సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును తొలిరోజు ఎవరూ కలవలేదు. జైలు నిబంధనల ప్రకారం వారానికి రెండు ములాఖత్‌లను అనుమతిస్తారు. సోమవారం ములాఖత్ కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, కుమారుడు లోకేష్ మంగళవారం ఆయన్ను ములాఖత్‌లో కలిసేందుకు జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. -
Adipurush: ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్.. ఆ సినిమాలను దాటేసింది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా తెరకెక్కిన ఆదిపురుష్ కోసం సుమారు రూ. 500 కోట్ల ఖర్చు పెట్టారు. భారీ డిమాండ్, క్రేజ్ ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా 7500 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్స్‌లలో మాత్రం దుమ్ములేపినట్లు తెలుస్తోంది. మొదటిరోజే రూ. 140 కోట్ల మార్క్‌ను అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. (చదవండి: ఆదిపురుష్ మూవీ రివ్యూ) నేడు, రేపు వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్స్ రూ. 250 కోట్లకు కూడా చేరవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ గత చిత్రాలు బాహుబలి 2, సాహో మాత్రమే మొదటి రోజున రూ. 100 కోట్లు కలెక్ట్ చేశాయి. తాజాగా ఆదిపురుష్ వాటి కలెక్షన్స్‌ను దాటి రికార్డ్ నెలకొల్పింది. ప్రస్తుతం హిందీలో పఠాన్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఆదిపురుష్ నిలిచింది. (ఇదీ చదవండి: 'అయోధ్య'లో ప్రభాస్ చేసిన డైలాగ్.. ఓం రౌత్ దెబ్బతో మళ్లీ వైరల్) ఎక్కడెక్కడ ఎంత కలెక్ట్ చేసింది? కొన్ని లెక్కల ప్రకారం ఆదిపురుష్ సినిమా మొదటి రోజు కలెక్షన్లు.. నైజాం రూ.50 కోట్లు, విశాఖపట్టణం 12.5 కోట్లు, ఈస్ట్ 8 కోట్లు, వెస్ట్ 7 కోట్లు, కృష్ణా 7.5 కోట్లు, గుంటూరు 9 కోట్లు, నెల్లూరు 4 కోట్లు, సీడెడ్ 17.5 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. అమెరికాలో రికార్డ్ కలెక్షన్స్ ఇండియాతో పాటు యూఎస్‌లోనూ 'ఆదిపురుష్'పై భారీ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ నిర్వహించిన ర్యాలీ నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. అమెరికా వ్యాప్తంగా ఈ మూవీ మొదటిరోజు 1 మిలియన్ ప్లస్ యూఎస్ డాలర్ల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసిందని పీపుల్స్ మీడియా ప్రకటించింది. ఈ లెక్కన వీకెండ్ పూర్తయ్యేలోగా యూఎస్‌లో 4 మిలియన్ డాలర్లు ఆదిపురుష్ కలెక్ట్ చేస్తుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. #Adipurush smashes all the records!! Collects 1 Million + USD Day on First Day! 🙏🏹#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage @AjayAtulOnline @vishwaprasadtg @vivekkuchibotla @TSeries… pic.twitter.com/YlyHDgmmyk — People Media Factory (@peoplemediafcy) June 16, 2023 (ఇదీ చదవండి: Adipurush: ప్రభాస్ ఎక్కడ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు) -
లాభాలతో కొత్త ఏడాదిలోకి!
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరం తొలి ట్రేడింగ్ రోజైన సోమవారం స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ఆటో, బ్యాంకింగ్, వినిమయ షేర్లు రాణించడంతో మార్కెట్ మూడోరోజూ ముందడుగేసింది. భారత తయారీ రంగ కార్యకలాపాలు మార్చిలో పుంజుకొని మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం కలిసొచ్చింది. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కొద్దిసేపటికే నష్టాల్లోకి మళ్లాయి. రోజంతా పరిమిత శ్రేణిలో తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. అయితే చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఉదయం సెన్సెక్స్ 139 పాయింట్ల లాభంతో 59,131 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 412 పాయింట్ల పరిధిలో 58,793 వద్ద కనిష్టాన్ని, 59,205 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 115 పాయింట్ల లాభంతో 59,106 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 68 పాయింట్లు బలపడి 17,428 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 17,313–17,428 శ్రేణిలో కదలాడింది. ఆఖరికి 38 పాయింట్లు పెరిగి 17,398 వద్ద ముగిసింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎఫ్‌పీఐలు రూ.322 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.328 కోట్ల షేర్లను అమ్మేశారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 9 పైసలు క్షీణించి 82.30 స్థాయి వద్ద స్థిరపడింది. మహవీర్ జయంతి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి బుధవారం ప్రారంభమవుతాయి. ముడిచమురు ధరలు పెరుగుదలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ‘‘ఈ వారంలో ట్రేడింగ్ మూడురోజులకే పరిమితం కావడంతో పాటు ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ కీలక నిర్ణయాలను వెల్లడించనున్న నేపథ్యంలో ట్రేడర్లు పొజిషన్లను తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. మార్చిలో ఆటో అమ్మకాలు గణనీయంగా పెరగడంతో పాటు భారత తయారీ రంగ కార్యకలాపాలు పుంజుకొని మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం మార్కెట్లో ఒత్తిళ్లను తగ్గించాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► హీరో మోటోకార్ప్ షేరు నాలుగుశాతం లాభపడి రూ.2,434 వద్ద ముగిసింది. వార్షిక ప్రాతిపదికన మార్చి విక్రయాలు 15% వృద్ధిని సాధించడంతో ఈ కంపెనీ షేరుకు డిమాండ్ నెలకొంది. ► అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ రేటింగ్ తగ్గించడంతో కేపీఐటీ టెక్నాలజీ షేరు 12 శాతం క్షీణించి రూ.810 వద్ద నిలిచింది. ► పలు ఆర్డర్లను దక్కించుకోవడంతో రైల్ వికాస్ నిగమ్ షేరు 10% ఎగసి రూ.75 వద్ద నిలిచింది. -
తొలిరోజే ప్రయాణికులకు షాక్ ఇచ్చిన కువైట్ సమ్మర్ సర్వీస్
సాక్షి, గన్నవరం: విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (గన్నవరం) నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు ప్రారభిస్తున్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కువైట్ సమ్మర్ ఎయిర్ఇండియా సర్వీస్‌ను బుధవారమే ప్రారంభమైంది. ఐతే తొలిరోజే కువైట్ సమ్మర్ సర్వీస్ ప్రయాణికులకు గట్టి షాక్ ఇచ్చింది. ప్రయాణికులను వదిలేసి ముందే విమానం వెళ్లిపోవడంతో ఎయిర్‌పోర్ట్‌లో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఎయిర్ ఇండియా ఉదయం 9.55 నిమిషాలకు దాదాపు 67 మంది ప్రయాణికులుతో గన్నవరం నుంచి కువైట్‌కి బయల్దేరిపోయింది. అయితే ఫ్లైట్ వెళ్లిన కొద్ది నిమిషాలకు కువైట్‌కి వెళ్లేందుకు వచ్చిన సుమారు 20 మంది ప్రయాణికులు విషయం తెలుసుకుని ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. విమానం 1.10 నిమషాలకు వెళ్లాల్సి ఉండగా.. ముందుగా బయల్దేరడమేమిటని ఎయిర్ ఇండియా సిబ్బందిని ప్రశ్నించారు. అయితే సిబ్బంది మాత్రం విమానం ఉదయం 9.55 నిమిషాలకే బయల్దేరుతుందని మెసేజ్ పెట్టామంటున్నారు. ప్రయాణకులేమో మాకు ఎలాంటి మెసేజ్‌లు రాలేదంటూ ఎయిండ్ ఇండియా అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ..గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద ఆందోళనకు దిగారు ప్రయాణికులు. కాగా, ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా దుబాయ్, కువైట్ల నుంచి గన్నవరం ఎయిర్పోర్టకి పూర్తిస్థాయిలో సర్వీస్‌లు నడిపేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎయిర్ ఇండియా ఈ కువైట్ సమ్మర్ సర్వీర్ని బుధవారం ప్రారంభించింది. ఈ సర్వీస్‌ను ఈరోజు నుంచి అక్టోబర్ చివరి వరకూ ప్రతి బుధవారం కువైట్‌కు ఎయిర్ ఇండియాను నడపనున్నారు. (చదవండి: 162 స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులు భర్తీ) -
Border-Gavaskar Trophy: ఆస్ట్రేలియా కాస్త మెరుగ్గా...
ఓపెనర్లు అర్ధసెంచరీ భాగస్వామ్యం అందించారు. గత మ్యాచ్‌లో విఫలమైన ఇద్దరు బ్యాటర్లు ఈసారి చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చారు. రెండు సందర్భాల్లో జట్టు మెరుగైన స్థితిలో నిలిచి భారీ స్కోరు దిశగా వెళుతున్నట్లు అనిపించింది. అయినా సరే చివరకు వచ్చేసరికి ఆస్ట్రేలియా సాధారణ స్కోరుకే పరిమితమైంది. తొలి టెస్టుతో పోలిస్తే కాస్త ఫర్వాలేదనిపించినా ఓవరాల్‌గా మొదటి రోజే ఆలౌట్ అయిన జట్టు ఆట ఆశలు రేపేలా లేదు! షమీ పదునైన పేస్‌కు తోడు అశ్విన్, జడేజా స్పిన్‌తో ఆసీస్‌ను దెబ్బ కొట్టారు. బ్యాటింగ్‌కు ఏమాత్రం ఇబ్బందిగా లేని పిచ్‌పై రెండో రోజు భారత్ ఎంత స్కోరు సాధిస్తుందనేది ఆసక్తికరం. న్యూఢిల్లీ: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ రెండో టెస్టులోనూ మొదటి రోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 78.4 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖాజా (125 బంతుల్లో 81; 12 ఫోర్లు, 1 సిక్స్), హ్యాండ్స్కాంబ్ (142 బంతుల్లో 72 నాటౌట్; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. మొహమ్మద్ షమీ (4/60) ప్రత్యర్థిని పడగొట్టగా, అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం ఎలాంటి ఇబ్బంది లేకుండా 9 ఓవర్లు ఎదుర్కొన్న భారత్ ఆట ముగిసే సమయానికి 21 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (13 బ్యాటింగ్), రాహుల్ (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నా రు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్న భారత సీనియర్ క్రికెటర్ పుజారా ను దిగ్గజం సునీల్ గావస్కర్ సన్మానించారు. స్మిత్ డకౌట్... గత మ్యాచ్‌తో పోలిస్తే ఈసారి ఆస్ట్రేలియా ఓపెనర్లు తొలి గంట పాటు కాస్త ప్రతిఘటన కనబర్చగలిగారు. ఖాజా ఆత్మవిశ్వాసంతో ఆడగా, వార్నర్ (15; 3 ఫోర్లు)లో తడబాటు కొనసాగింది. 21వ బంతికి గానీ అతను తొలి పరుగు తీయలేకపోయాడు. ఈ క్రమంలో సిరాజ్ బౌలింగ్‌లో మోచేతికి, హెల్మెట్‌కు బంతి బలంగా తగలడంతో వార్న ర్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. షమీ ఓవర్లో రెండు వరుస ఫోర్లు కొట్టిన వార్నర్ అతని తర్వాతి ఓవర్లోనే వెనుదిరిగాడు. మరోవైపు స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్వీప్ షాట్లతో పరుగులు రాబట్టిన ఖాజా 71 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆసీస్‌కు అసలు దెబ్బ అశ్విన్ ఓవర్లో తగిలింది. 91/1తో మెరుగ్గా ఉన్న స్థితిలో లబుషేన్ (18)ను అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా... మరో రెండు బంతులకే భరత్ చక్కటి క్యాచ్‌తో స్మిత్ (0) డకౌట్ కావడం ఒక్కసారిగా కంగారూలు వెనక్కి తగ్గేలా చేసింది. రెన్షా స్థానంలో ఈ మ్యాచ్‌లోకి వచ్చిన ట్రవిస్ హెడ్ (12; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువసేపు నిలవలేదు. కీలక భాగస్వామ్యాలు... ఆసీస్‌ను గట్టెక్కించే బాధ్యత ఖాజా, హ్యాండ్స్కాంబ్లపై పడింది. వీరిద్దరు క్రీజ్‌లో ఉన్నంతసేపు చకచకా పరుగులు జోడించారు. ముఖ్యంగా జడేజాను లక్ష్యంగా చేసుకొని వీరు పరుగులు రాబట్టారు. అయితే స్వీప్ షాట్లతోనే 29 పరుగులు సాధించిన ఖాజా చివరకు అదే షాట్‌కు వికెట్‌ను సమర్పించుకున్నాడు. క్యారీ (0) వెంటనే అవుట్ కాగా... ఈసారి ప్యాట్ కమిన్స్ (33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించాడు. మరోవైపు 110 బంతుల్లో హ్యాండ్స్కాంబ్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆసీస్ జోరు పెంచుతున్న దశలో రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో కమిన్స్, మర్ఫీ (0) వికెట్లతో దెబ్బ కొట్టాడు. చివరి రెండు వికెట్ల షమీ ఖాతాలోకి వెళ్లాయి. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) భరత్ (బి) షమీ 15; ఖాజా (సి) రాహుల్ (బి) జడేజా 81; లబుషేన్ (ఎల్బీ) (బి) అశ్విన్ 18; స్మిత్ (సి) భరత్ (బి) అశ్విన్ 0; హెడ్ (సి) రాహుల్ (బి) షమీ 12; హ్యాండ్స్కాంబ్ (నాటౌట్) 72; క్యారీ (సి) కోహ్లి (బి) అశ్విన్ 0; కమిన్స్ (ఎల్బీ) (బి) జడేజా 33; మర్ఫీ (బి) జడేజా 0; లయన్ (బి) షమీ 10; కున్మన్ (బి) షమీ 6; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (78.4 ఓవర్లలో ఆలౌట్) 263. వికెట్ల పతనం: 1–50, 2–91, 3–91, 4–108, 5–167, 6–168, 7–227, 8–227, 9–246, 10–263. బౌలింగ్: షమీ 14.4–4–60–4, సిరాజ్ 10–2–30–0, అశ్విన్ 21–4–57–3, జడేజా 21–2–68–3, అక్షర్ 12–2–34–0. భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బ్యాటింగ్) 13, రాహుల్ (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 21. బౌలింగ్: కమిన్స్ 3–1–7 –0, కున్మన్ 4–1–6–0, లయన్ 2–0–4–0. 13: భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 13వ క్రికెటర్‌గా పుజారా గుర్తింపు పొందాడు. గతంలో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్‌దేవ్, సునీల్ గావస్కర్, వెంగ్ సర్కార్, గంగూలీ, కోహ్లి, ఇషాంత్ శర్మ, హర్భజన్æ, సెహ్వాగ్ ఈ ఘనత సాధించారు. 1: అంతర్జాతీయ టి20 ఫార్మాట్ మొదలయ్యాక ఒక్క అంతర్జాతీయ టి20 కూడా ఆడకుండానే 100 టెస్టులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్ పుజారా. -
మైండ్ బ్లాక్ చేస్తున్న అవతార్ 2 తొలిరోజు కలెక్షన్స్
-
అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ప్రారంభం
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. తెనాలి మునిసిపాలిటీ సహకారంతో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న రెండురోజుల చలన చిత్రోత్సవాన్ని స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రొజెక్టర్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలనతో ఎమ్మెల్యే శివకుమార్‌తోపాటు చైర్పర్సన్ సయ్యద్ ఖాలీదా నసీమ్, బాలనటుడు మాస్టర్ భానుప్రకాష్, సినీ దర్శకుడు నాగమురళి తెడ్ల అతిథులుగా పాల్గొన్నారు. ప్రారంభ సభకు ఫిలిం సొసైటీ చైర్మన్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. ఈ చలన చిత్రోత్సవం స్ఫూర్తితో తెనాలిలో ఇదే కళాక్షేత్రంలో ప్రతినెలా ఓ ఆదివారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంతర్జాతీయ బాలల సినిమాలను ప్రదర్శింపజేస్తామని చెప్పారు. తెనాలి మునిసిపాలిటీ, ఫిలిం సొసైటీ పెద్దల కమిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపడుతుందన్నారు. -
ఊరించి... ఉసూరుమనిపించి...
భారీ అంచనాలు, ఆశల మధ్య క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)కు ఆదిలోనే అడ్డంకి ఎదురైంది. ఎడతెరిపి లేని వర్షం తొలి రోజు ఆటను తుడిచి పెట్టేసింది. ఒక్క బంతి కూడా వేసేందుకు అవకాశం లేకపోవడంతో ఆటగాళ్లు మైదానంలోకి దిగాల్సిన అవసరం కూడా లేకుండా మొదటి రోజు ముగిసింది. శనివారం నుంచి వాతావరణ పరిస్థితి మెరుగుపడి భారత్, న్యూజిలాండ్ పోరు అనుకున్న విధంగా సాగుతుందా లేక ఇదే వాన చివరకు నిస్సారమైన ఫలితానికి దారి తీసి చివరకు సంయుక్త విజేతను అందిస్తుందా అనేది చూడాలి. సౌతాంప్టన్: భారత్, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తొలి రోజు ఆటకు వర్షంవల్ల కొద్దిసేపు అంతరాయం కలగవచ్చని ఊహించినా... వాన అనుకున్న దానికంటే ఎక్కువే ప్రభావం చూపించింది. ఫలితంగా మ్యాచ్ తొలి రోజు శుక్రవారం ఆట పూర్తిగా రద్దయింది. మ్యాచ్ ముందు రోజునుంచే కురుస్తున్న వర్షం తెరిపినివ్వలేదు. కనీసం టాస్ వేసే అవకాశం కూడా కలగలేదు. స్థానిక సమయం ప్రకారం ఉదయం 10.30కి (భారత కాలమానం ప్రకారం మ.3.00 గంటలు) మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వాన తగ్గకపోవడంతో అంపైర్లు ముందుగా తొలి సెషన్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి వాన ఆగింది. సుమారు అరగంట పాటు చినుకులు లేకపోవడంతో సూపర్ సాపర్లతో మైదానాన్ని సిద్ధం చేసేందుకు సిబ్బంది ప్రయత్నించారు. లంచ్ విరామం ముగిసిన తర్వాత అంపైర్లు మైదానాన్ని పరిశీలించేందుకు వెళ్లాల్సి ఉంది. ఈలోగా మళ్లీ వాన ప్రారంభం కావడంతో ఆ సమయానికి ముందే తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆరో రోజుకు ఆట... డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఐసీసీ ఈ నెల 23ను రిజర్వ్ డేగా ప్రకటించింది. ఐదు రోజుల్లోనే పూర్తి ఆట ఆడించేందుకు ప్రయత్నిస్తామని, అవసరమైతేనే ఆరో రోజుకు వెళతామని గతంలోనే చెప్పింది. అయితే ఇప్పుడు అది తప్పనిసరి కావచ్చు. నేటి నుంచి రోజుకు అరగంట అదనపు సమయం చొప్పున గరిష్టంగా 98 ఓవర్ల వరకు (ఎలాంటి అంతరాయం లేకపోతే) ఆడించవచ్చు. అలా చేసినా నాలుగు రోజుల్లో 32 ఓవర్లకు మించి అదనంగా ఆడించే ఛాన్స్ లేదు. దీని ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్ రిజర్వ్ డేన కొనసాగే అవకాశం ఉంది. లార్డ్స్ ఉండగా సౌతాంప్టన్ ఎందుకు... డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వేదికగా సౌతాంప్టన్‌ను ప్రకటించినప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు లండన్‌లోని లార్డ్స్ లేదా ఓవల్ మైదానం కాకుండా దీనిని ఎంచుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు వర్షంతో తొలి రోజు రద్దు కావడంతో దీనిపై మళ్లీ చర్చ మొదలైంది. నిజానికి తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎవరు వచ్చినా క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్‌లోనే జరపాలని ఐసీసీ ఎప్పుడో నిర్ణయించింది. ముందుగా లార్డ్స్‌ను వేదికగా కూడా ప్రకటించింది. అయితే కరోనా కారణంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో బయో బబుల్ కోసం సరైందిగా భావిస్తూ స్టేడియం పరిధిలోనే హోటల్ ఉండటంతో సౌతాంప్టన్‌ను ఎంపిక చేసింది. అయితే భారత్‌లో ఇటీవల ఇంగ్లండ్ వచ్చినప్పుడు చేపాక్ స్టేడియానికి ఎక్కడో దూరంగా ఉన్న లీలా హోటల్లో ఇరు జట్లను బయో బబుల్‌లో ఉంచారు. అలాంటిది ఇంగ్లండ్‌లాంటి చోట సాధ్యం కాదా అనిపించవచ్చు. అయితే ఇంగ్లండ్‌లో అలాంటి వేదిక ఒకటి అందుబాటులో ఉంది కాబట్టే సౌతాంప్టన్‌కు ఎంపిక చేశారు. సాధారణంగా ఇంగ్లండ్‌లో జూన్‌లో పెద్దగా వర్షాలు పడవు. పైగా గత రెండు వారాలుగా ఇక్కడ తీవ్ర ఎండ, వేడి ఉన్నాయి. అయితే అప్పడప్పడూ అనుకోకుండా వాన పలకరించే అనిశ్చితి మాత్రం ఇంగ్లండ్ అంతటా సహజం. కాబట్టి మరో నగరాన్ని వేదికగా ఎంచుకున్నా వాన రాకపోయేదని ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. -
ఎంతో చేయాలి.. సమయమే లేదు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జో బైడెన్ పూర్తి స్థాయిలో పనిలో నిమగ్నమయ్యారు. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను తిరగతోడుతూ పాలనలో తనదైన ముద్ర వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. చేయాల్సిందెంతో ఉంది, సమయమే తక్కువ ఉందని వ్యాఖ్యానించిన బైడెన్ తొలిరోజే బిజీ బిజీగా గడిపారు. కరోనా విసిరిన సవాళ్లను ఎదుర్కోవడానికి రేయింబవళ్లు పని చేయాలని అన్నారు. కోవిడ్–19పై పోరాటం నుంచి పారిస్ ఒప్పందంలో తిరిగి చేరేవరకు తొలిరోజే పలు నిర్ణయాలను తీసుకున్నారు. మొత్తం 17 ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కట్టడికి ప్రజలందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్న కార్యనిర్వాహక ఉత్తర్వుపై అధ్యక్షుడి హోదాలో బైడెన్ విలేకరుల ఎదుటే తొలి సంతకం చేశారు. బైడెన్ ప్రధాన నిర్ణయాలివే.. ► బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలి. 100 రోజుల మాస్కు చాలెంజ్‌ని స్వీకరించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో భౌతికదూరం తప్పనిసరి. ఒబామా హయాంలో ఏర్పాటైన డైరెక్టరేట్ ఫర్ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ అండ్ బయోడిఫెన్స్ పునరుద్ధరణ. అందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు, ప్రపంచ ఆరోగ్య సంస్థలో తిరిగి చేరిక. ► 1.1 కోట్ల డాలర్ల రుణాలపై మారటోరియం, విద్యార్థి రుణాల రికవరీ గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు ► ట్రంప్ హయాంలో మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం నిమిత్తం జాతీయ అత్యవస ర నిధి కింద విరాళాల సేకరణ నిలిపివేత ► పర్యావరణ పరిరక్షణకు పారిస్ ఒప్పందంలో తిరిగి చేరేలా ఉత్తర్వులు జారీ. గత ఏడాది ట్రంప్ ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చారు. బైడెన్ ఆ నిర్ణయాన్ని మారుస్తూ తిరిగి ఒప్పందంలో చేరాలని నిర్ణయించారు. అయితే అధికారికంగా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో నెలరోజులు పడుతుంది. కీస్టోన్ పైప్‌లైన్ ప్రాజెక్టు రద్దు చేశారు. ► మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా చర్యలు. జాతి వివక్షకు తావు లేకుండా ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ. నిధుల విడుదల అన్ని ప్రాంతాలకు సక్రమంగా జరిగేలా ప్రభుత్వ సంస్థలు సమీక్షిస్తూ ఉండాలి. పని చేసే ప్రాంతాల్లో లింగ వివక్షకు తావు లేకుండా పకడ్బందీ చర్యలు. ఎల్జీబీటీక్యూ హక్కుల పరిరక్షణ ► జనాభా లెక్కల సేకరణ. వీరిలో అమెరికన్లు కాని వారిని కూడా చేర్చాలి. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వారిని జనాభా లెక్కల్లో చేర్చవద్దంటూ ట్రంప్ చేసిన ఆదేశాలు రద్దు చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీ. ► లైబీరియా నుంచి వలస వచ్చి కొన్నేళ్లుగా అమెరికాలో స్థిరనివాసం ఉంటున్న వారిని తిరిగి స్వదేశానికి పంపించే కార్యక్రమం వచ్చే ఏడాది జూన్ 30 వరకు వాయిదా ► వివిధ ముస్లిం దేశాల నుంచి ట్రంప్ విధించిన ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత. 2017లో ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే సిరియా, ఇరాన్, ఇరాక్, సూడాన్, లిబియా, యెమన్ వంటి దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించారు. అలా 13 దేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలున్నాయి. వాటినన్నింటినీ ఎత్తివేస్తూ బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దేశాల నుంచి వీసా దరఖాస్తులు తీసుకోవాలం టూ విదేశాంగ శాఖను ఆదేశించారు. వలస విధానం ప్రక్షాళన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలి రోజే వలస విధానాన్ని సమూలంగా సంస్కరిస్తూ రూపొందించిన కొత్త ఇమిగ్రేషన్ బిల్లుని కాంగ్రెస్‌కు పంపించారు. వలసదారులకు పూర్తిగా అండదండలుగా ఉండేలా పౌరసత్వ చట్టం 2021 పేరుతో ఈ బిల్లుని తీసుకువచ్చారు. సరిహద్దుల సక్రమ నిర్వహణ, కుటుం బాలను ఏకం చెయ్యడం, అమెరికా ఆర్థిక వ్యవస్థకి సహకరించే ప్రతీ ఒక్కరి ప్రయో జనాల పరిరక్షణ, శరణార్థులకి అమెరికా అండదండలు ఉంటాయన్న లక్ష్యాలతో ఈ బిల్లుని రూపొందించారు. దీని ప్రకారం చట్టవిరుద్ధంగా దేశంలో తలదాచుకుం టున్న 1.1 కోట్ల మందికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు ఇక ఏళ్ల తరబడి వేచి చూడనక్కర్లేదు. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల జారీలో దేశాల కోటా పరిమితుల్ని రద్దు చేసే ప్రతిపాదన బిల్లులో ఉంది. దీంతో వేలాదిమంది భారత్ టెక్కీలకు ప్రయోజనం చేకూరనుంది. ఇక ఈ బిల్లులో హెచ్–1బీ వీసాదారుల భాగస్వాములకు పనిచేయడానికి అవకాశం, వారి పిల్లలకు వయసుతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం కల్పించే సదుపాయాల్ని పొందే అవకాశం వస్తుంది. గ్రీన్ కార్డు వచ్చిన వారు మూడేళ్లలోనే అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. ఎంతో ఉదాత్తంగా రాశారు ట్రంప్ లేఖపై బైడెన్ ప్రశంసలు వాషింగ్టన్ : వైట్‌హౌస్ వీడి వెళ్లడానికి ముందు డొనాల్డ్ ట్రంప్ తనకు రాసిన లేఖ చాలా ఉదాత్తంగా, గొప్పగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసించారు. ఆ లేఖలో ఏముందో ఆయన వెల్లడించలేదు. కొత్త అధ్యక్షుడిని అభినందించడం సహా అన్ని రకాల సంప్రదాయాలను తోసి రాజని శ్వేత సౌధాన్ని వీడి వెళ్లిన ట్రంప్ లేఖ రాసే ఆనవాయితీ మాత్రం పాటించారు. ఫ్లోరిడాకు వెళ్లే ముందు ఓవల్ ఆఫీసులోని రిజల్యూట్ డెస్క్ దగ్గర లేఖని ఉంచిన విషయం తెలిసిందే. ఐరాస హర్షం ఐక్యరాజ్యసమితి: ప్రపంచ ఆరోగ్య సంస్థలో తిరిగి చేరుతున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలి రోజే ఉత్తర్వులు జారీ చేయడంపై ఐక్యరాజ్య సమితి హర్షం వ్యక్తం చేసింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుట్టెరస్కు బైడెన్ లేఖ రాశారు. డబ్ల్యూహెచ్ఒలో మళ్లీ చేరుతామని పేర్కొన్న ఆయన కరోనా కట్టడికి సంస్థ తీసుకుంటున్న చర్యల్ని ప్రశంసించారు. ప్రపంచ దేశాల ప్రజల ఆరోగ్యం కోసం డబ్ల్యూహెచ్ఓ చేస్తున్న కృషిని అభినందించారు. అమెరికా తిరిగి రావడాన్ని స్వాగతించిన గుట్టెరస్ ప్రపంచ దేశాల్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి అందరూ సమైక్యంగా పోరాడాల్సిన సమయం ఇదేనని అన్నారు. డబ్ల్యూహెచ్ఓకు అగ్రరాజ్యమే అత్యధికంగా నిధులిస్తుంటుంది. -
ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను: సమంత
‘‘జాంబిరెడ్డి’ సినిమా టీజర్ అదిరిపోయింది. నా ఊహను మించిపోయింది. ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. నాకు సినిమాలంటే ప్రాణం’’ అన్నారు సమంత. తేజ సజ్జా, ఆనంది, దక్షా నగార్కర్ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజ్ శేఖర్ వర్మ నిర్మించిన చిత్రం ‘జాంబిరెడ్డి’. ఈ సినిమా టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో సమంత విడుదల చేశారు. పోస్టర్‌ను విడుదల చేసిన ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘టైటిల్ డిఫరెంట్‌గా ఉంది. టీజర్‌తో ప్రశాంత్ వర్మ భయపెడుతున్నాడు. ‘ఇంద్ర’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన తేజ సజ్జా హీరోగా పరిచయం అవుతుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్‌ను సగం పూర్తి చేశాం. మిగిలిన భాగాన్ని లాక్డౌన్ తర్వాత పూర్తి చేశాం. నేనేదో తెలివైనవాడిని అని చెప్పుకోవడానికి ఈ సినిమా తీయలేదు. ఎంటర్టైన్ చేయడం కోసం తీశాను. ఈ సినిమా హిట్ సాధిస్తే ‘జాంబిరెడ్డి’ లెవల్ 2 స్క్రిప్ట్ ఉంది. నన్ను నమ్మిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాకు ముందు సమంతగారితో ఓ సినిమా అనుకున్నాను’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘ప్రేక్షకులు ఓ కొత్త సినిమాను చూస్తారు’’ అన్నారు తేజ సజ్జా. ఈ కార్యక్రమంలో ఆనంది, దక్షా నగార్కర్, నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి, దర్శకురాలు నందినీ రెడ్డి, నిర్మాతలు పి. కిరణ్, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన కార్మిక సంఘాలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె తొలిరోజైన మంగళవారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు కార్మిక సం ఘాల బాధ్యులు కదం తొక్కారు. కేంద్రప్రభుత్వ విధానాలపై జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాల ద్వారా నిరసన తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రం లోని టౌన్‌హాల్ నుంచి సీఐటీయూ, ఐఫ్టీయూ, ఐఎన్టీయూసీ సంయుక్త ఆధ్వర్యాన భారీ ర్యాలీగా తెలంగాణ చౌరస్తాకు చేరుకుని అక్కడ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల బాధ్యు లు కురుమూర్తి, వెంకటేశ్, రాములుయాదవ్ మా ట్లాడుతూ మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక వి ధానాలతో అన్ని వర్గాలకు నష్టం జరగనుందన్నా రు. గత ఎన్నికల సమయంలో తమను గెలిసిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని, కార్మికులు హామీలను పరిరక్షిస్తామని చెప్పిన మోదీ వాటిని విస్మరించారని ఆరోపించారు. చంద్రకాంత్, సతీష్, తిరుమలయ్య, నర్సిములు, దాసు, శేఖర్, కౌర్ణిసా, వినయ్, గాలెన్న పాల్గొన్నారు. గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి స్టేషన్ మహబూబ్‌నగర్: గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఆర్ఆర్బీఈఏ అధ్యక్షుడు రవికాంత్ డిమాం డ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో మంగళవారం ఏపీజీవీబీ బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సం దర్భంగా జిల్లా కేంద్రంలోని రీజినల్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో రవికాంత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చర్యలను నిరసిస్తూ దేశంలోని 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల అధికారులు, ఉద్యోగులు రెండు రోజుల సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. వాణిజ్య బ్యాంకుల మాదిరిగా గ్రామీణ బ్యాంకు ఉద్యోగులకు వేతనాలు అమలుచేయాలని, ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో రీజినల్ కార్యదర్శి ఎం.శ్రీనివాస్, రవికుమార్, నాగేశ్వర్, నాగరాజు, ఆంజనేయులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా మహబూబ్‌నగర్ రూరల్ : అఖిల భారత ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం కలెక్టరేట్ ముఖద్వారం ఎదుట టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. కలెక్టరేట్లోని వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాలలో పని చేసే ఉద్యోగులు కలెక్టరేట్‌కు చేరుకుని భోజన విరామ సమయంలో తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అ«ధ్యక్షుడు రామకృష్ణారావు మాట్లాడుతూ ఉద్యోగుల పాలిట ఆశనిపాతంలా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పింఛనర్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ ధర్నాలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
మెట్రోత్సాహం
సాక్షి, హైదరాబాద్ : కలల మెట్రోలో తొలిసారి ప్రయాణం.. ఈ ఒక్క అంశం సగటు హైదరాబాదీని ఎంతో ఉద్వేగానికి గురిచేసింది. బుధవారం తొలిరోజే మెట్రో ప్రయాణం కోసం వారిని తొందర పెట్టింది. అంతే మెట్రో జర్నీ కోసం జనం పోటెత్తారు. దీంతో బుధవారం నాగోల్–అమీర్‌పేట్ (17కి.మీ.), అమీర్‌పేట్–మియాపూర్ (13కి.మీ.) మార్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో రైళ్ల బోగీలన్నీ ప్రయాణికులతో కిక్కిరిశాయి. మెట్రో జర్నీ కోసం వయోభేదం లేకుండా ప్రజలంతా వేలాదిగా తరలిరావడంతో ప్రతీ మెట్రో స్టేషన్ ప్రాంగణం ఎగ్జిబిషన్‌ను తలపించింది. తొలి రోజు కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా మొత్తంగా హైదరాబాదీలతో మెట్రో జర్నీ అదుర్స్ అనిపించింది. మొత్తంగా తొలిరోజు రెండు మార్గాల్లో 14 రైళ్లు పరుగులు తీయగా.. సుమారు 2 లక్షల మంది ప్రయాణించినట్టు మెట్రో అధికారులు వెల్లడించారు. తొలిరోజు జర్నీ.. యమ స్లో గురూ.. బుధవారం తొలి రోజు నాగోల్–అమీర్‌పేట్ మార్గంలో ప్రతి 15 నిమిషాలకో రైలు పరుగులు తీసింది. ఈ మార్గంలో ఒక చివరి నుంచి మరో చివరకు 25 నిమిషాల్లో గమ్యం చేరాలి. కానీ బుధవారం గరిష్టంగా 55 నిమిషాల సమయం పట్టడం గమనార్హం. అమీర్‌పేట్–మియాపూర్ మార్గంలో ప్రతి 10 నిమిషాలకు ఓ రైలు రాకపోకలు సాగించింది. ఈ రూట్లో 20 నిమిషాల్లో గమ్యం చేరుకోవాలి. కానీ 25 నిమిషాలు పట్టింది. ప్రతీ స్టేషన్లో రైలును 20 సెకన్లపాటు నిలపాలి. కానీ కొన్నిచోట్ల నిమిషానికి పైగా నిలిపారు. తొలిరోజు ప్రయాణీకులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో స్టేషన్లలో అధిక సమయం రైళ్లను నిలపడం.. రైలు కనీస వేగాన్ని గంటకు 33 కి.మీ.లకుగానూ గంటకు 20 కి.మీ.లకు తగ్గించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. క్రమంగా రైళ్ల వేగం పెరుగుతుందని స్పష్టం చేశారు. టోకెన్లు.. స్మార్ట్‌కార్డుల తికమక.. ప్రతీ స్టేషన్లో మెట్రో జర్నీకి అవసరమైన టోకెన్లు, స్మార్ట్‌కార్డులను ఎలా కొనుగోలు చేయాలో తెలియక తొలిరోజు ప్రయాణీకులు తికమకపడ్డారు. పలు స్టేషన్లలో రెండు వైపుల మాత్రమే కౌంటర్లు ఉండడంతో భారీ క్యూలో నిల్చొని అవస్థలు పడ్డారు. ఇప్పటికే స్మార్ట్‌కార్డులు కొనుగోలు చేసినవారు తిరిగి రీచార్జి చేసుకునేందుకు స్టేషన్‌లోని కౌంటర్లో సంప్రదిస్తే సాఫ్ట్వేర్ అప్డేట్ కాలేదని సిబ్బంది సమాధానం ఇవ్వడంతో గందరగోళానికి గురయ్యారు. ఇక బుధవారం అన్ని మెట్రో స్టేషన్లలో కలిపి మొత్తం పది వేల స్మార్ట్ కార్డుల విక్రయించినట్టు అధికారులు తెలిపారు. పార్కింగ్ తిప్పలు.. రెండు మార్గాల్లో 24 స్టేషన్లకుగానూ నాగోల్, మియాపూర్ డిపోలు, సికింద్రాబాద్‌లోని పాత జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద మినహా మిగతా 21 స్టేషన్ల వద్ద పార్కింగ్ లేకపోవడంతో వ్యక్తిగత వాహనాలపై వచ్చినవారు అవస్థలు పడ్డారు. -
మొదటి రోజే జనంతో కిక్కిరిసిన మెట్రో..
-
ప్రశాంతంగా ఎంసెట్–17
ఏలూరు సిటీ : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎంసెట్–17 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా మొదలయ్యాయి. తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం పట్టణాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్షలు జరిగాయి. భీమవరంలో మొదటి విడత నిర్వహించిన పరీక్షలకు 676 మందికి గాను 654 మంది, రెండో విడతలో 676 మందికి గాను 635 మంది పరీక్ష రాశారు. ఏలూరులో మొదటి విడత పరీక్షకు 631 మందికి గాను 620, రెండో విడతలో 630 మందికి గాను 595 మంది, నరసాపురంలో మొదటి విడత పరీక్షకు 250 మందికి గాను 238 మంది, రెండో విడతలో 250 మందికి గాను 235 మంది, తాడేపల్లిగూడెంలో మొదటి విడత పరీక్షకు 501 మందికి గాను 493 మంది, రెండో విడతలో 500 మందికి గాను 496 మంది పరీక్షలు రాశారు. విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షపై కళాశాలల యాజమాన్యాలు ముందునుంచే అవగాహన కల్పించటంతో పెద్దగా ఇబ్బందులేమీ తలెత్తలేదు. -
కష్టాల క్యూ
అమ్మో ఒకటో తారీఖు. ఊహించుకుంటేనే గుండె బరువెక్కుతోంది. ఇప్పటికే నగదు కష్టాలను ఎదుర్కొంటున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఒకటో తారీఖు కష్టాలను తలుచుకొని మరింత ఆందోళన చెందుతున్నారు. బుధవారం బ్యాంకుల వద్ద చాంతాడు క్యూలైన్లను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. స్టేట్ బ్యాంకు ఏటీఎంలు మినహా తక్కిన బ్యాంకుల ఏటీఎంలు పని చేయకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమైంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
తొలిరోజు భారత్ అదరహో
విశాఖపట్టణం: ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో ఆతిధ్య భారత జట్టు అదరగొడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 317 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి పటిష్ట స్ధితిలో నిలిచింది. ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్లు లోకేష్ రాహుల్(0), మురళీ విజయ్(20)లు శుభారంభాన్ని అందించలేకపోయినా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఛటేశ్వర పుజారా(119), కెప్టెన్ విరాట్ కోహ్లీ(151)లు సెంచరీలతో అదరగొట్టారు. పుజారా ఔటయిన తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్య రహానే(23) కూడా త్వరగా ఔటయ్యాడు. తొలి రోజు ఆట మరో పదిహేను నిమిషాల్లో ముగుస్తుందనగా రహానే వెనుదిరగడం భారత్ కు దెబ్బే. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్(1)తో జతకలిసిన కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ మూడు వికెట్లు పడగొట్టగా.. స్టువర్ట్ బ్రాడ్ కు ఒక వికెట్ దక్కింది. బెన్ స్టోక్స్, జాఫర్ అన్సారీ, అదిల్ రషీద్, మొయీన్ అలీలు పెద్ద సంఖ్యలో ఓవర్లు సంధించినా వికెట్లను పడగొట్టలేకపోయారు. -
టీమిండియా తడబాటు
కోల్ కతా: న్యూజిల్యాండ్ తో కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో తొలిరోజు భారత క్రికెటర్లు తడబడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా టాప్ ఆర్డర్ వికెట్లను త్వరగా చేజార్చుకుంది. మొదటి ఇన్నింగ్స్ ను ఆరంభించిన భారత ఓపెనర్లు శిఖర్ ధావన్(1), మురళి విజయ్(9), కెప్టెన్ విరాట్ కోహ్లీ(9) పరుగులకే అవుటయ్యారు. దీంతో కష్టాల్లో చిక్కుకున్న భారత్ ను పూజారా(87), రహానే(77)లు మరో వికెట్ పడకుండా పరుగులు జోడించారు. టీ విరామానికి భారత్ గౌరవప్రదమైన చేస్తుందని అనిపించే దశకు తెచ్చారు. తర్వాత వాగ్నర్ బౌలింగ్ లో పూజారా వెనుదిరిగాడు. ఒక్కసారిగా కివీస్ బౌలర్లు విజృంభించడంతో మరో మూడు వికెట్లు త్వరగా నేల కూలాయి. కివీస్ బౌలర్లలో ఎంజే హెన్రీ మూడు వికెట్లు, జేఎస్ పటేల్ రెండు వికెట్లు, బౌల్ట్, వాగ్నెర్ లు చెరో వికెట్ తీశారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. వృద్ధిమాన్ సాహా(14), రవీంద్ర జడేజా(0)లతో క్రీజులో ఉన్నారు. వెలుతురు సరిగా లేని కారణంగా నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే అంపైర్లు తొలిరోజు ఆటను నిలిపివేశారు. -
ప్రశాంతంగా మొదటి రోజు స్పెషల్ డీఎస్సీ
రంపచోడవరం : రెండు రోజులపాటు జరిగే ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ–2016 శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. స్థానిక లెనోరా కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఐటీడీఏ పీవో కేవీఎన్ చక్రధరబాబు సందర్శించారు. పరీక్షలకు 1136 మందికిగానూ 1104 మంది హాజరైనట్టు డీడీ సరస్వతి తెలిపారు. -
పుష్కరునికి పునఃస్వాగతం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అంత్య పుష్కర సంరంభం ఆరంభమైంది. గోదావరి తీరాన భక్తిభావం ఉప్పొంగింది. ఆదివారం ఉదయం 8.25 గంటలకు అంత్యపుష్కరాలు ప్రారంభమవుతాయని తొలుత ప్రచారం జరగడంతో ఉదయం ఏడు గంటలవరకూ కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో భక్తుల జాడ అంతంతమాత్రంగానే కనిపించింది. ఈ సమయంలో ఘాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ జనం లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఉదయం తొమ్మిది గంటల తర్వాత భక్తుల రద్దీ పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచీ యాత్రికులు తరలివచ్చారు. తొలిరోజు పుష్కరఘాట్లను మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీలు మాగంటి మురళీమోహన్, గోకరాజు గంగరాజు, స్థానిక ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. ఘాట్లలో ఇదీ పరిస్థితి.. అధికారులు నిర్ణయించిన ప్రధాన ఘాట్లలోనే కాకుండా మిగిలిన ఘాట్లలోనూ భక్తులు స్నానాలకు ఆసక్తికనబరిచారు. పెరవలి మండలం తీపర్రు, ముక్కామల, ఉమ్మిడివారిపాలెం, కాకరపర్రు, ఉసులుమర్రు, కానూరు అగ్రహారం, మల్లేశ్వరం, ఖండవల్లి ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించారు. యలమంచలి మండలంలో ఆరు పుష్కరఘాట్లు ఉండగా.. ఒక్క లక్ష్మీపాలెం, దొడ్డిపట్ల ఘాట్లకు మాత్రమే భక్తులు చెప్పుకోదగ్గ స్థాయిలో వచ్చారు. సిద్ధాంతంలో పెనుగొండ వాసవీ కన్యకాపరమేశ్వరి పీఠాధిపతి కృష్ణానంద పురిస్వామిజీ అంత్యపుష్కరాలను ప్రారంభించారు. గోదావరిమాతకు పూజలు చేసి, పుష్కర స్నానం వల్ల కలిగే ఫలాలను భక్తులకు వివరించారు. కేదారీ ఘాట్‌లోని మూడు పుష్కర రేవులు భక్తులతో కిటకిటలాడాయి. వృద్ధులకు, వికలాంగులకు జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. ఆచంట మండలంలోని కరుగోరుమిల్లి పుష్కరఘాట్‌లో అధికారులు భక్తుల రక్షణను అంతగా పట్టించుకోలేదు. ఘాట్ చుట్టూ మూడు పడవలతోపాటు, ప్రమాద సూచికగా వెదరు గెడను మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులపుకున్నారు. కొవ్యూరు గోష్పాదక్షేత్రం ఘాట్‌లో భక్తులు పెద్ద సంఖ్యలో స్నానాలు ఆచరించారు. సోమవారం నుంచి భక్తుల రద్దీ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొవ్వూరులో అధికారికంగా మూడు ఘాట్లలోనే స్నానాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మిగిలిన ఘాట్లు మూసివేశారు. వీఐపీ(సుబ్రమణ్య) ఘాట్‌కు భక్తులు అంతంత మాత్రంగానే వచ్చారు. పట్టణ శివారున ఉన్న న్యూగౌతమీ ఘాట్‌లో కేవలం పదుల సంఖ్యలోనే భక్తులు కనిపించారు. వాడపల్లి, ఆరికిరేవుల, చిడిపి, కుమారదేవంలో భక్తులు స్వల్ప సంఖ్యలో స్నానాలు చేశారు. నర్సాపురంలో భక్తుల సంఖ్య పరవాలేదనిపిం చింది. నరసాపురం పట్టణంలో మూడు, రూరల్‌లో రెండు, మొత్తం ఐదు ఘాట్లలో అధికారులు స్నానాలకు ఏర్పాట్లు చేసారు. భక్తుల రద్దీ మొత్తం వలంధర్ఘాట్పైనే పడింది. తాళ్లపూడిలోని పార్వతీ సమేత ఉమామహేశ్వరస్వామి ఆలయం నుంచి ఉత్సవవిగ్రహలను పల్లకీపై ఊరేగింపుగా గౌతమీఘాట్ తీసుకు వచ్చి అర్చకులు, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.అంత్య పుష్కరాలకు ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఒరిస్సా తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. అనుకున్న స్థాయిలో రాలేదు అంత్యపుష్కరాల తొలిరోజున యాత్రికులు అనుకున్నంత స్థాయిలో రాలేదు. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య అరలక్షలోపే ఉంటుందని జిల్లా యంత్రాంగం పేర్కొంది. జిల్లావ్యాప్తంగా కేవలం 47,190 మంది మాత్రమే స్నానాలు ఆచరించినట్టు వివరించింది. దీనికి అధికారులు, ప్రభుత్వ ప్రచారలోపమే కారణంగా కనిపిస్తోంది. అంత్యపుష్కరాలపై ప్రభుత్వం అంతగా శ్రద్ధపెట్టలేదని, ఏర్పాట్లను నాలుగైదు రోజుల ముందే ప్రారంభించారని, ప్రచారం చేయడంలోనూ విఫలమయ్యారని, అందుకే యాత్రికులు అనుకున్నంత స్థాయిలో రాలేదనే భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నరసాపురం డివిజన్లోని 15 స్నాన ఘట్టాల్లో సుమారు 27వేల మంది, జంగారెడ్డిగూడెం డివిజన్లో ఏర్పాటు చేసిన 20 స్నాన ఘట్టాల్లో సుమారు 10వేల మంది, కొవ్వూరు డివిజన్లో ఏర్పాటు చేసిన ఐదు స్నాన ఘట్టాల్లో 10వేల మంది భక్తులు పుష్కర స్నానమాచరించారని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.