ప్రశాంతంగా ఎంసెట్–17
ప్రశాంతంగా ఎంసెట్–17
Published Tue, Apr 25 2017 1:05 AM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM
ఏలూరు సిటీ : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎంసెట్–17 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా మొదలయ్యాయి. తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం పట్టణాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్షలు జరిగాయి. భీమవరంలో మొదటి విడత నిర్వహించిన పరీక్షలకు 676 మందికి గాను 654 మంది, రెండో విడతలో 676 మందికి గాను 635 మంది పరీక్ష రాశారు. ఏలూరులో మొదటి విడత పరీక్షకు 631 మందికి గాను 620, రెండో విడతలో 630 మందికి గాను 595 మంది, నరసాపురంలో మొదటి విడత పరీక్షకు 250 మందికి గాను 238 మంది, రెండో విడతలో 250 మందికి గాను 235 మంది, తాడేపల్లిగూడెంలో మొదటి విడత పరీక్షకు 501 మందికి గాను 493 మంది, రెండో విడతలో 500 మందికి గాను 496 మంది పరీక్షలు రాశారు. విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్షపై కళాశాలల యాజమాన్యాలు ముందునుంచే అవగాహన కల్పించటంతో పెద్దగా ఇబ్బందులేమీ తలెత్తలేదు.
Advertisement