పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా తెరకెక్కిన ఆదిపురుష్ కోసం సుమారు రూ. 500 కోట్ల ఖర్చు పెట్టారు. భారీ డిమాండ్, క్రేజ్ ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా 7500 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఫస్ట్ డే మిక్స్‌డ్ టాక్ వచ్చినా కలెక్షన్స్‌లలో మాత్రం దుమ్ములేపినట్లు తెలుస్తోంది. మొదటిరోజే రూ. 140 కోట్ల మార్క్‌ను అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
(చదవండి: ఆదిపురుష్ మూవీ రివ్యూ)
నేడు, రేపు వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్స్ రూ. 250 కోట్లకు కూడా చేరవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ గత చిత్రాలు బాహుబలి 2, సాహో మాత్రమే మొదటి రోజున రూ. 100 కోట్లు కలెక్ట్ చేశాయి. తాజాగా ఆదిపురుష్ వాటి కలెక్షన్స్‌ను దాటి రికార్డ్ నెలకొల్పింది. ప్రస్తుతం హిందీలో పఠాన్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఆదిపురుష్ నిలిచింది.
(ఇదీ చదవండి: 'అయోధ్య'లో ప్రభాస్ చేసిన డైలాగ్.. ఓం రౌత్ దెబ్బతో మళ్లీ వైరల్)
ఎక్కడెక్కడ ఎంత కలెక్ట్ చేసింది?
కొన్ని లెక్కల ప్రకారం ఆదిపురుష్ సినిమా మొదటి రోజు కలెక్షన్లు.. నైజాం రూ.50 కోట్లు, విశాఖపట్టణం 12.5 కోట్లు, ఈస్ట్ 8 కోట్లు, వెస్ట్ 7 కోట్లు, కృష్ణా 7.5 కోట్లు, గుంటూరు 9 కోట్లు, నెల్లూరు 4 కోట్లు, సీడెడ్ 17.5 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది.
అమెరికాలో రికార్డ్ కలెక్షన్స్
ఇండియాతో పాటు యూఎస్‌లోనూ 'ఆదిపురుష్'పై భారీ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ నిర్వహించిన ర్యాలీ నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. అమెరికా వ్యాప్తంగా ఈ మూవీ మొదటిరోజు 1 మిలియన్ ప్లస్ యూఎస్ డాలర్ల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసిందని పీపుల్స్ మీడియా ప్రకటించింది. ఈ లెక్కన వీకెండ్ పూర్తయ్యేలోగా యూఎస్‌లో 4 మిలియన్ డాలర్లు ఆదిపురుష్ కలెక్ట్ చేస్తుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
#Adipurush smashes all the records!! Collects 1 Million + USD Day on First Day! 🙏🏹#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage @AjayAtulOnline @vishwaprasadtg @vivekkuchibotla @TSeries… pic.twitter.com/YlyHDgmmyk
— People Media Factory (@peoplemediafcy) June 16, 2023
(ఇదీ చదవండి: Adipurush: ప్రభాస్ ఎక్కడ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు)
Comments
Please login to add a commentAdd a comment