లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్-లక్నోల మధ్య నేటి నుంచి వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. మీరట్-లక్నో-మీరట్(22490/22491) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు, రాకపోకల జాబితాను రైల్వేశాఖ విడుదల చేసింది.
ఈరోజు (శనివారం) ఈ రైలు తొలిసారిగా పట్టాలు ఎక్కనుంది. నేడు అతిథి ప్రయాణికులకు రైల్వేశాఖ మీరట్-లక్నోల మధ్య ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. లక్నో-మీరట్(22491), మీరట్-లక్నో(22490) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల రెగ్యులర్ ఆపరేషన్ ఆదివారం నుండి ప్రారంభంకానుంది. శుక్రవారం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఈ రైలు అప్‌డేట్ అయిన తర్వాత టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారు.
బరేలీ జంక్షన్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ రైలు మీరట్-లక్నో మధ్య మొరాదాబాద్, బరేలీ జంక్షన్‌లలో మాత్రమే ఆగుతుంది. ఈ రైలుకు సంబంధించిన బుకింగ్ ప్రారంభమైన నేపధ్యంలో సెప్టెంబర్ 5 తర్వాత తేదీల ప్రయాణం కోసం సీట్లు వేగంగా బుక్ అవుతున్నాయి. ప్రస్తుతం బరేలీ జంక్షన్‌లో రైలుకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
మీరట్-లక్నో వందే భారత్ మీరట్ నుండి ఉదయం 6:35 గంటలకు బయలుదేరి, 8:35 గంటలకు మొరాదాబాద్, 9:56 గంటలకు బరేలీ చేరుకుని మధ్యాహ్నం 1:45 గంటలకు లక్నో చేరుకుంటుంది. అలాగే లక్నో-మీరట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లక్నో నుండి మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:02 గంటలకు బరేలీకి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి రాత్రి 7:32 గంటలకు మొరాదాబాద్, రాత్రి 10 గంటలకు మీరట్ చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment