న్యూఢిల్లీ: భారత్ రైళ్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి వాటిపై రాళ్లదాడులు జరగడం సర్వ సాధారణమైపోయింది. వందేభారత్‌కు సంబంధించి రోజూ ఏదో ఒక వార్త ఎక్కడో ఒక చోట చూస్తుంటాం.
అయితే తాజాగా లక్నో-డెహ్రాడూన్ వందేభారత్ రైలులో టికెట్‌లేని ప్రయాణికులు చాలా మంది ఎక్కి టికెట్ ఉన్న ప్రయాణికులకు ఇబ్బందులు కలుగజేసిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రీమియం రైలులో ఈ పరిస్థితి తలెత్తితే మిగిలిన రైళ్ల పరిస్థితి ఏంటని వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో రైళ్ల సంఖ్యను పెంచడంతో పాటు బోగీలను కూడా పెంచాలని వారు రైల్వే శాఖను డిమాండ్ చేశారు.
అయితే వందేభారత్ వీడియోపై రైల్వేశాఖ స్పందించింది. ఇది పాత వీడియో అని తెలిపింది. కొందరు రైతులు గతంలో బలవంతంగా రైలులోకి ఎక్కినపుడు తీసిన వీడియో అని వెల్లడించింది. ఇలాంటి పాత వీడియోలను మళ్లీ వైరల్ చేసి ప్రయాణికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment