సాక్షి, గన్నవరం: విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (గన్నవరం) నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు ప్రారభిస్తున్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కువైట్ సమ్మర్ ఎయిర్‌ఇండియా సర్వీస్‌ను బుధవారమే ప్రారంభమైంది. ఐతే తొలిరోజే కువైట్ సమ్మర్ సర్వీస్ ప్రయాణికులకు గట్టి షాక్ ఇచ్చింది. ప్రయాణికులను వదిలేసి ముందే విమానం వెళ్లిపోవడంతో ఎయిర్‌పోర్ట్‌లో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
వాస్తవానికి ఎయిర్ ఇండియా ఉదయం 9.55 నిమిషాలకు దాదాపు 67 మంది ప్రయాణికులుతో గన్నవరం నుంచి కువైట్‌కి బయల్దేరిపోయింది. అయితే ఫ్లైట్ వెళ్లిన కొద్ది నిమిషాలకు కువైట్‌కి వెళ్లేందుకు వచ్చిన సుమారు 20 మంది ప్రయాణికులు విషయం తెలుసుకుని ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. విమానం 1.10 నిమషాలకు వెళ్లాల్సి ఉండగా.. ముందుగా బయల్దేరడమేమిటని ఎయిర్ ఇండియా సిబ్బందిని ప్రశ్నించారు.
అయితే సిబ్బంది మాత్రం విమానం ఉదయం 9.55 నిమిషాలకే బయల్దేరుతుందని మెసేజ్ పెట్టామంటున్నారు. ప్రయాణకులేమో మాకు ఎలాంటి మెసేజ్‌లు రాలేదంటూ ఎయిండ్ ఇండియా అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ..గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద ఆందోళనకు దిగారు ప్రయాణికులు. కాగా, ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా దుబాయ్, కువైట్‌ల నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టకి పూర్తిస్థాయిలో సర్వీస్‌లు నడిపేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎయిర్ ఇండియా ఈ కువైట్ సమ్మర్ సర్వీర్‌ని బుధవారం ప్రారంభించింది. ఈ సర్వీస్‌ను ఈరోజు నుంచి అక్టోబర్ చివరి వరకూ ప్రతి బుధవారం కువైట్‌కు ఎయిర్ ఇండియాను నడపనున్నారు.
(చదవండి: 162 స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులు భర్తీ)
Comments
Please login to add a commentAdd a comment