జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నిర్వహించిన కౌన్సెలింగ్ మొదటిరోజు మంగళవారం ప్రశాంతంగా జరిగింది.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నిర్వహించిన కౌన్సెలింగ్ మొదటిరోజు మంగళవారం ప్రశాంతంగా జరిగింది. ఐటీఐల జిల్లా కన్వీనర్ కృష్ణయ్య పర్యవేక్షణలో డీఎల్‌టీసీ, బాలికల ఐటీఐలలో కౌన్సెలింగ్ నిర్వహించారు. 7 ప్రభుత్వ, 29 ప్రైవేట్ ఐటీఐలలో ప్రవేశానికి కౌన్సెలింగ్ జరిగింది.
9.7 గ్రేడ్ నుంచి 7.8 గ్రేడ్ పాయింట్ల వరకు సాధించిన 1 నుంచి 527 వరకు గల విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలవగా.. మొత్తం 269 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారికి కోరుకున్న కళాశాలల్లో సీట్లు కేటాయించారు. బుధవారం జరిగే కౌన్సెలింగ్‌కు 7.7 నుంచి 7.3గ్రేడ్ పాయింట్ల వరకు సాధించిన 528 నుంచి 1018 వరకు సంఖ్య గల విద్యార్థులు హాజరు కావాలని కన్వీనర్ కృష్ణయ్య కోరారు.