తిరుపతి: మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అప్పు అలియాస్ అన్బు సెల్వంను పోలీసులు మంగళవారం చిత్తూరులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్కు తరలించి... తమదైన శైలిలో విచారించారు. ఈ సందర్భంగా అతడి నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో అప్పు అత్యంత కీలకంగా వ్యవహారించాడని పోలీసులు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో తనకు సహకరించిన పలువురు వ్యక్తుల పేర్లను అప్పు వెల్లడించాడని పోలీసులు చెప్పారు. అప్పును శ్రీకాళహస్తి కోర్టులో బుధవారం పోలీసులు హాజరుపరచనున్నారు. అతడికి బెయిల్ ఇప్పించేందుకు చెన్నై లాయర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
గతంలో కంచి శంకరమఠం మేనేజర్ రామన్ హత్య కేసులో అప్పు ప్రధాన నిందితడని పోలీసులు తెలిపారు. చెన్నైలోని అప్పుకు ఓ హోటల్ కూడా ఉందని పోలీసులు పేర్కొన్నారు. అప్పు కోసం గత కొంత కాలంగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆ క్రమంలో అప్పు బుధవారం పోలీసులకు చిక్కాడు.
మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అప్పు అరెస్ట్
Published Wed, Dec 3 2014 9:19 AM | Last Updated on Mon, Aug 13 2018 3:25 PM
Advertisement
Advertisement