Happy Days Appu: సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీడేస్’మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అప్పటి యూత్ ఆడియెన్స్‌ని ఓ రేంజ్‌లో ఆకట్టుకుండి ఈ సినిమా. తన మార్క్ సహజమైన కథ, కథనాలతో ఆకట్టుకునే శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’తో ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కాలేజీలో ఎనిమిది మంది స్నేహితులు.. వాళ్ళ పరిచయాలు.. ప్రేమలు.. అపార్ధాలు.. ద్వేషాలు.. మళ్ళీ తిరిగి కలిసే ప్రయత్నాలు ఇదే హ్యాపీడేస్ సినిమా. ఇది సినిమాలా కాకుండా మన పక్కన జరిగే.. మన జీవితంలో జరిగే కథలా అనిపిస్తుంది. సినిమా మొత్తం ఎనిమిది మంది క్యారెక్టర్ల చుట్టే తిరుగుతోంది.
అందులో పొట్టి జుట్టుతో కనిపించే అమ్మాయి గుర్తుందా? అదేనండి నిఖిల్ క్లోజ్ ఫ్రెండ్‌గా మూవ్ అయ్యే అప్పు అలియాస్ అపర్ణ. హ్యాపీడేస్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అప్పు క్యారెక్టర్‌ని మర్చిపోలేరు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయింది గాయత్రీరావు. తొలి సినిమాయే అయినా.. ఎంతో అనుభవం ఉన్నట్లు నటించింది.
హ్యాపీ డేస్ సినిమా తరువాత రామ్ చరణ్ నటించిన ‘ఆరంజ్’పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలోనూ నటించిన గాయత్రిరావు.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో 2019లో వివాహం చేసుకొని చెన్నైలో స్థిరపడిపోయింది.
ఇక గాయత్రీ ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఆమె తల్లిదండ్రులు సినీ పరిశ్రమకు చెందిన వారు. తల్లి పేరు బెంగుళూర్ పద్మ. తండ్రి అరుణ్ కుమార్. పద్మ టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించింది. హ్యాపీ డేస్ సినిమాలో కూడా పద్మ నిఖిల్ కి అమ్మగా నటించింది. ఈమె పాత చిత్రాలలో చాలా హిట్ సినిమాల్లో కూడా నటించింది. సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో గాయత్రీ రావు విఫలమైంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పుటికీ.. ఫ్యామిలీ లైఫ్‌ని మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది గాయత్రీ. అవకాశాలు వస్తే.. మళ్లీ నటించేందుకు సిద్దమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. త్వరగా అవకాశాలు వచ్చి మరోసారి వెండితెరపై ‘అప్పు’ అలరించాలని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment