Happy Days
-
ఇన్నేళ్ల కెరీర్లో ఎక్కడా రాజీపడలేదు: శేఖర్ కమ్ముల
‘‘కోవిడ్ తర్వాత ప్రేక్షకుల అభిరుచి, సినిమాల పరిధి పెరిగింది. ఇప్పుడంతా పాన్ ఇండియా అంటున్నారు. మాది పాన్ ఇండియా మూవీ అని ప్రకటించుకుంటే సరిపోదు. ప్రేక్షకుల మైండ్ సెట్ గమనించాలి. కథ పరంగా మన నేటివిటీకి తగినట్లు సరైన సినిమా తీస్తే తప్పకుండా పాన్ ఇండియా స్థాయికి చేరుతుంది’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘హ్యాపీ డేస్’ మూవీ 2007లో విడుదలై, హిట్‌గా నిలిచింది. ఆ సినిమాను నేడు రీ రిలీజ్ చేస్తున్నారు. అలాగే శేఖర్ కమ్ముల చిత్ర పరిశ్రమలోకి వచ్చి 25 ఏళ్లవుతోంది. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని శేఖర్ కమ్ముల పంచుకున్న విశేషాలు. ► చిత్ర పరిశ్రమలో 25 సంవత్సరాల ప్రయాణంలో నేను నిలబడడం చూస్తే చాలా గర్వంగా ఉంది. నా తొలి చిత్రం ‘డాలర్ డ్రీమ్స్’ (2000) నుంచి ‘లవ్ స్టోరీ’ (2021) సినిమా వరకూ ఇన్నేళ్ల కెరీర్లో ఎక్కడా రాజీ పడకుండా నా విలువలకు తగినట్లు సినిమా తీయడం గొప్పగా అనిపిస్తోంది. నేను ఏ సినిమా చేసినా విలువలు, సిద్ధాంతాలతో తీయాలని, చెడు చెప్పకూడదు అనే ఆలోచనతోనే తీశాను. పేరు, డబ్బు కోసం చిత్ర పరిశ్రమకి రాలేదు. అలాంటి ఆలోచనతో సినిమాలూ తీయలేదు.. అదే నాకు గర్వంగా ఉంది. ఇప్పుడు సినిమా రంగంలో పోకడ చాలా హార్‡్షగా ఉంది. ► ‘హ్యాపీ డేస్’ సినిమా చేస్తున్నప్పుడు నా గ్రాడ్యుయేషన్ పూర్తయి పదేళ్లయింది. అప్పటి పరిస్థితుల రీత్యా ఆ మూవీకి స్టూడెంట్ బ్యాక్‌గ్రౌండ్ చక్కగా కుదిరింది. అయితే నేడు టెక్నాలజీ మారింది. ప్రతి స్టూడెంట్ చేతిలో మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి. కోవిడ్, గ్లోబలైజేషన్ వంటి పరిస్థితుల తర్వాత ఆలోచనా విధానం మారింది. సాంకేతిక పరంగా ఇప్పుడు విద్యార్థులు ఎవరి లోకంలో వారు ఉన్నారు. ‘హ్యాపీ డేస్’ సినిమా విడుదలై ఇన్నేళ్లయినా చాలా ఫ్రెష్‌గా ఉంది. రీ రిలీజ్ కూడా యూత్‌కు ఓ పండగలా ఉంటుందని అనిపించింది. ‘హ్యాపీ డేస్’కి సీక్వెల్ తీయాలనిపించింది.. కానీ, కథ కుదరలేదు. ► ఇన్నేళ్ల నా ప్రయాణంలో పది చిత్రాలు చేశాను. అయితే నా ప్రయాణం నిదానంగా సాగుతోందనుకోవడం లేదు. నేను ఏ సినిమా చేసినా ఈ కథ అవసరమా? అని ఆలోచించి చేస్తాను. నేను సినిమా చేసే పద్ధతి, నా సినిమాలే మాట్లాడతాయి. కాపీ కొట్టే కథలు నేను చేయను. కంటెంట్ పరంగా బాగా, సూటిగా చె΄్పాలనుకుంటాను. మనసులో ఓ ఆలోచన రావడానికి, అది కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుంది. అలా కాకుండా వెంట వెంటనే సినిమాలు చేయాలనుకోను. ► నా తొలి చిత్రం ‘డాలర్ డ్రీమ్స్’కి జాతీయ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత నంది అవార్డులతో పాటు మరికొన్ని అవార్డులు కూడా అందుకున్నాను. అయితే మళ్లీ జాతీయ అవార్డు అందుకోవాలనే ఆలోచన లేదు. నేను రాజీపడకుండా సినిమా తీస్తున్నాను.. అందుకే సంతోషంగా ఉన్నాను. నా చిత్రాలకు ప్రేక్షకులు ఇచ్చే అవార్డే గొప్పది. ఒక్కో ఏడాది జాతీయ స్థాయిలో మనకంటే మంచి సినిమాలు వస్తుంటాయి.. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని అవార్డుకి ఎంపిక చేస్తారు. అయితే మంచి కంటెంట్ తీసుకుని ముందుకెళ్లడమే మన పని. ► నా కెరీర్లో తొలిసారి నాగార్జున, ధనష్ వంటి స్టార్ హీరోలతో ‘కుబేర’ అనే మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాను. ఈ కథకు వారిద్దరూ సరిపోతారనిపించి చేస్తున్నాను.. అంతేకానీ, పెద్ద ్రపాజెక్ట్, బిగ్ స్కేల్లో సినిమా చేయాలనే ఆలోచనతో కాదు. వారిద్దరితో పని చేయడం గొప్ప అనుభూతి. నిర్మాత, దర్శకుడికి మధ్య స్వేచ్ఛ, నమ్మకం అనేది ఉండాలి. అది ఏషియన్ మూవీస్ బేనర్లో నాకెక్కువగా ఉంది. ‘లీడర్’ సినిమాకి సీక్వెల్ తీయాలనే ఆలోచన ఉంది. కానీ సమయం కుదరడం లేదు. చేస్తే మాత్రం తప్పకుండా రానాతోనే చేస్తాను. -
మళ్లీ హ్యాపీ డేస్
కాలేజ్ బ్యాక్‌డ్రాప్ చిత్రాల్లో ‘హ్యాపీ డేస్’ (2007) ఓ ట్రెండ్ సెట్టర్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ యూత్‌ఫుల్ చిత్రం విడుదలై పదిహేడేళ్లయింది. వరుణ్ సందేశ్, తమన్నా భాటియా, నిఖిల్ సిద్ధార్థ్ తదితరుల కాంబినేషన్లో అమిగోస్ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో మంచి వసూళ్లతో సంచలన విజయం సాధించింది. శేఖర్ కమ్ముల టేకింగ్, నటీనటుల పెర్ఫార్మెన్స్, మిక్కీ జే మేయర్ సంగీతం, విజయ్ సి. కుమార్ కెమెరా పనితనం అన్నీ అద్భుతంగా కుదిరిన ఈ చిత్రం ఇప్పుడు మళ్లీ విడుదల కానుంది. ఏప్రిల్ 12న ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్ సినిమాస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
హీరో అవ్వడానికి రూ.5 లక్షలు ఇచ్చా.. మోసం చేశారు : నిఖిల్
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నాడు. కార్తికేయ చిత్రంతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నిఖిల్ రీసెంట్గా 18 పేజెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ తన సినీ కెరీర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ''అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన నేను ఆ తర్వాత ఓ సీరియల్లో కూడా నటించాను. కానీ అక్కడే ఉండే బుల్లితెరకే పరిమితం అవుతాననిపించింది. దీంతో సినిమాలకు ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించాను. కొందరికి నా యాక్టింగ్ నచ్చి అవకాశాలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత పట్టించుకోలేదు. ఇంకొందరేమో నిన్ను హీరోగా చేయాలా? రూ 50లక్షలు, కోటి రూపాయలు తీసుకురా అనేవాళ్లు. అలా నేను హీరో అవ్వడానికి రూ.5లక్షలు ఇచ్చాను కూడా. లక్ష రూపాయల వరకు షూటింగ్ చేసి ఆపేశారు. ఆ తర్వాత ఇదంతా ఫేక్ అని అర్థమయ్యింది. ఇక శేఖర్ కమ్ముల గారు చాలా జెన్యూన్. నా యాక్టింగ్ నచ్చి ఛాన్స్ ఇచ్చారు. ఆయనే ఫస్ట్ చెక్ ఇచ్చారు. ఇప్పటికీ దాన్ని దాచుకున్నాను. ఆ సినిమా తర్వాతే నాకు వరుసగా అవకాశాలు వచ్చాయి. కార్తికేయతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇదంతా ఎలా జరిగిందా అని అప్పుడప్పుడు ఆలోచిస్తుంటా'' అంటూ చెప్పుకొచ్చాడు. -
‘హ్యాపీడేస్’ అప్పు ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?
Happy Days Appu: సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీడేస్’మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అప్పటి యూత్ ఆడియెన్స్‌ని ఓ రేంజ్లో ఆకట్టుకుండి ఈ సినిమా. తన మార్క్ సహజమైన కథ, కథనాలతో ఆకట్టుకునే శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’తో ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కాలేజీలో ఎనిమిది మంది స్నేహితులు.. వాళ్ళ పరిచయాలు.. ప్రేమలు.. అపార్ధాలు.. ద్వేషాలు.. మళ్ళీ తిరిగి కలిసే ప్రయత్నాలు ఇదే హ్యాపీడేస్ సినిమా. ఇది సినిమాలా కాకుండా మన పక్కన జరిగే.. మన జీవితంలో జరిగే కథలా అనిపిస్తుంది. సినిమా మొత్తం ఎనిమిది మంది క్యారెక్టర్ల చుట్టే తిరుగుతోంది. అందులో పొట్టి జుట్టుతో కనిపించే అమ్మాయి గుర్తుందా? అదేనండి నిఖిల్ క్లోజ్ ఫ్రెండ్‌గా మూవ్ అయ్యే అప్పు అలియాస్ అపర్ణ. హ్యాపీడేస్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అప్పు క్యారెక్టర్ని మర్చిపోలేరు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయింది గాయత్రీరావు. తొలి సినిమాయే అయినా.. ఎంతో అనుభవం ఉన్నట్లు నటించింది. హ్యాపీ డేస్ సినిమా తరువాత రామ్ చరణ్ నటించిన ‘ఆరంజ్’పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలోనూ నటించిన గాయత్రిరావు.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో 2019లో వివాహం చేసుకొని చెన్నైలో స్థిరపడిపోయింది. ఇక గాయత్రీ ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఆమె తల్లిదండ్రులు సినీ పరిశ్రమకు చెందిన వారు. తల్లి పేరు బెంగుళూర్ పద్మ. తండ్రి అరుణ్ కుమార్. పద్మ టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించింది. హ్యాపీ డేస్ సినిమాలో కూడా పద్మ నిఖిల్ కి అమ్మగా నటించింది. ఈమె పాత చిత్రాలలో చాలా హిట్ సినిమాల్లో కూడా నటించింది. సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో గాయత్రీ రావు విఫలమైంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పుటికీ.. ఫ్యామిలీ లైఫ్‌ని మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది గాయత్రీ. అవకాశాలు వస్తే.. మళ్లీ నటించేందుకు సిద్దమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. త్వరగా అవకాశాలు వచ్చి మరోసారి వెండితెరపై ‘అప్పు’ అలరించాలని ఆశిద్దాం. చదవండి: ఈ ఏడాదైనా స్టార్ హీరోల దర్శనం దొరికేనా? -
‘టైసన్’ ఇలా మారిపోయాడేంటి? షాక్‌లో ఫ్యాన్స్!
హ్యాపీడేస్.. 14 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెట్టిన ఈ సినిమా శేఖర్ కమ్ములను డైరెక్టర్‌గా మరో మెట్టు ఎక్కించింది. అంతేకాదు ఎంతోమంది కొత్తవారిని ప్రేక్షకులకు పరిచయం చేసిందీ చిత్రం.. వారందరికీ మంచి గుర్తింపు వచ్చినప్పటికీ కొందరికి మాత్రమే అవకాశాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో జనాలకు బాగా కనెక్ట్ అయిన పాత్ర టైసన్. అదిరిపోయే డైలాగ్‌లతో, రివర్స్ పంచులతో టైసన్ పాత్రలో ఆకట్టుకున్నాడు రాహుల్. View this post on Instagram A post shared by Rahul Dayakiran (@raahultyson) ఇందులో అతడు మరీ బక్కగా ఉండటంతో అందరూ అతడిని వెటకారంగా ‘టైసన్’ అని ఆటపట్టిస్తుంటారు. అంతెందుకు ఓ సన్నివేశంలో తనకు మంచి బాడీ లేదంటూ తను ప్రేమించిన శ్రావ్స్తోనే చెప్తాడు. కానీ ఇప్పుడు రాహుల్ గుర్తుపట్టకుండా మారిపోయాడు. కండలు తిరిగిన దేహం, మీసకట్టుతో కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. అతడిని ఈ గెటప్‌లో చూసిన అభిమానులు అసలు ఆ టైసన్ నువ్వేనా? అని షాకవుతున్నారు. నిన్ను అసలు గుర్తుపట్టలేకపోతున్నాం, మాస్ చేంజ్ ఓవర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rahul Dayakiran (@raahultyson) ఇప్పుడు కానీ శ్రావ్స్ నిన్ను చూస్తే ఫ్లాట్ అయిపోద్ది అన్నా.. అంటూ ఫన్నీగా మెసేజ్ చేస్తున్నారు. ఈ రోజు కష్టపడితేనే రేపు మరింత బలంగా తయారవుతాం, నేను ఇక్కడివరకు చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. నన్ను సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు అంటూ తన ఫొటోలను షేర్ చేశాడు. కాగా రాహుల్ ఆ మధ్య వెంకటాపురం సినిమాలో నటించాడు. ఇది అతడి కెరీర్‌కు ఏమాత్రం ప్లస్ కాలేదు. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత 100 క్రోర్స్ అనే మరో కొత్త చిత్రంలో నటించనున్నాడు. చదవండి: నేను తాగింది మందు కాదు: హీరోయిన్ -
చేతినిండా ఉపాధి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు.. ఊర్లోనే చేతినిండా ఉపాధీ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా మత్స్య సంపదపై మక్కువ పెరిగేలా వివిధ కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టింది. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, వ్యక్తిగత సహకారం అందించడంతో పాటు జిల్లాలోని చెరువులు, కుంటల్లో వందశాతం సబ్సిడీపై చేపపిల్లలను వదిలి మత్స్య సంపదను పెంచి నీలి విప్లవాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం జిల్లా మత్స్య శాఖ అందుకు తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేసింది. 3.95 కోట్ల చేపపిల్లలు లక్ష్యం మహబూబ్‌నగర్, నారాయణపేట రెండు జిల్లాల్లో కలిపి ఈసారి 3.95 కోట్ల చేప పిల్లలను చెరువులు, కుంటలు, జాలాశయాల్లో వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కట్ల, రోహు, బంగారుతీగ, మ్రిగాల రకాలైన చేపపిల్లలను చెరువులు, కుంటలు, జలాశయాల్లో వదిలేందుకు ప్రణాళికలు తయారు చేశారు. వందశాతం సబ్సిడీపై అందించే ఈ చేపవిత్తనాల ద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని టెండర్లు నిర్వహించి వర్షాలు రాగానే చేప విత్తనాలను చెరువులు, కుంటలు, జలాశయాల్లో వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి జూలై లేదా ఆగస్టు నెలల్లో చేప విత్తనాలను చెరువుల్లో వదలాలని అంచనా వేస్తున్నారు. 243 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ప్రయోజనం జిల్లాలో మొత్తం 245 డిపార్ట్మెంటర్ చెరువులు, 1671 గ్రామ పంచాయతీ చెరువులు, కుంటలు ఉన్నాయి. వాటి పరిధిలో 243 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 14,723 మంది మత్స్యకారులున్నారు. 18 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 674 మంది సభ్యులు ఉన్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలలో కోయిల్‌సాగర్, సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్, సాలార్‌నగర్ ప్రాజెక్టులతో పాటు జూరాల బ్యాక్ వాటర్‌లో చేపల వేట సాగించేందుకు 1520 మంది లైసెన్సు దారులు ఉన్నారు. లైసెన్సుదారులు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లోని సభ్యులందరికి ఉపాధి కల్పించి వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను పెంపొందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందుకోసం ప్రభుత్వం వంద శాతం సబ్సిడీ కింద చేపవిత్తనాల పంపిణీతో పాటు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. టెండర్ల ఖరారుకు నివేదిక జిల్లాలో గుర్తించిన చెరువులు, కుంటలు, జలాశయాల్లో చేపవిత్తనాలు సరఫరా చేసేందుకు ఇటీవల ప్రభుత్వం టెండర్ దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లాలో చేప విత్తనాలు సరఫరా చేసేందుకు ఆరు మంది టెండరుదారులు దరఖాస్తులు సమర్పించగా వాటిని పరిశీలించిన జిల్లా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ కె.స్వర్ణలత ఆమోదంతో జిల్లా మత్స్య శాఖ అధికారులు ఈనెల 2న రాష్ట్ర మత్స్సశాఖ కమిషనర్ కార్యాలయానికి నివేదిక పంపారు. జిల్లా కొనుగోలు కమిటీ బృందం సభ్యులు క్షేత్ర స్థాయిలో చేపల పిల్లల విత్తన హెచరీస్‌లను పరిశీలించేందుకు వెళతారు. వారిచ్చే నివేదిక ఆధారంగా టెండర్లను ఖరారు చేయనున్నారు. నిర్ణీత సైజులోనే.. ప్రభుత్వం నిర్ణయించిన సైజులో చేప విత్తనాలను వదిలేందుకు జిల్లా మత్స్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చెరువులు, కుంటల్లో వదిలే చేపవిత్తనాలు, జలాశయాల్లో వదిలే చేపవిత్తనాలు వేర్వేరు సైజుల్లో ఉంటాయి. చెరువులు, కుంటల్లో 35 మిల్లీమీటర్ల నుంచి 40 మిల్లీమీటర్ల సైజులో ఉన్న బొచ్చ, రాహు, బంగారుతీగ రకాల చేపవిత్తనాలను వదులుతారు. సంవత్సరం పొడవునా నీరు ఉండే జలాశయాలు, ప్రాజెక్టుల్లో 80 మిల్లీ మీటర్ల నుంచి 100 మిల్లీమీటర్ల సైజులో గల బొచ్చ, రాహు, మ్రిగాల రకాలైన చేపవిత్తనాలను వదులుతారు. ప్రణాళికలు సిద్ధం చేశాం ప్రభుత్వం మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థిక స్థోమత అందించేందుకు చర్యలు తీసుకుంది. ప్రతీఏడాదిలాగే ఈ సారి కూడా వంద శాతం సబ్సిడీపై చేపపిల్లలను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. రెండు జిల్లాల పరిధిలో ఈ సంవత్సరం 3.95 కోట్ల చేప విత్తనాలు అవసరమవుతాయని లక్ష్యాన్ని పెట్టుకొని ప్రభుత్వానికి నివేదించాం. అందుకు గాను టెండర్లు ఆహ్వనించగా ఆరుమంది దరఖాస్తులు ఇచ్చారు. – డా.లక్ష్మప్ప, మత్స్య శాఖ ఏడీ -
కాలేజ్ డేస్.. హ్యాపీ డేస్
కాలేజీ రోజులు ఎప్పుడూ హ్యాపీడేసే. ఎగ్జామ్స్, ల్యాబ్స్, అటెండెన్స్.. ఇలా.. చదివేటప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా గడిచిపోయిన ఆ మూమెంట్స్‌ని తలుచుకుంటే ఎవరైనా నోస్టాల్జియా ఫీల్ అవుతారు. ఇప్పుడు హీరోయిన్ నివేథా థామస్ కూడా అదే ఫీలింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే నివేథ ఆర్కిటెక్చర్ డిగ్రీ పూర్తి చేశారు. కాలేజ్ డేస్‌ను గుర్తుచేసుకుంటూ ‘‘ఐదేళ్లు.. ముగింపు దశకు వచ్చేశాయి. 5 ఇయర్స్.. స్టడీయింగ్, ట్రావెలింగ్, కేస్ స్టడీ కోసం సిటీలు, దేశాలు తిరిగొచ్చాం. కాలేజ్ టూర్ మిస్ కాకూడదని మూవీ డేట్స్ రీ–షెడ్యూల్ చేసుకున్నాను. సెట్స్‌లో డ్రాఫ్టింగ్ చేసేదాన్ని, ఏరోప్లైన్లో స్కెచ్‌లు గీసేదాన్ని. ఒకేసారి ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేయడం. సెమిస్టర్ హాలిడేస్‌లో మూవీస్‌కు డేట్స్ ఇవ్వడం. కొన్నిసార్లు అవి కూడా ఇవ్వకుండా డిగ్రీ కంప్లీట్ చేయడం కోసం కష్టపడటం. ఇలా అన్నీ దాటుకొని డిగ్రీ కంప్లీట్ చేశాను. ఈరోజు ఇంత స్పెషల్‌గా ఉండటానికి కారణం నా వర్క్‌ని అభినందించిన వాళ్లంతా ఈ జర్నీలో నాతో ఉండటం. నా స్టడీ బ్రేక్స్, మూవీ బ్రేక్స్ అన్నింట్లో ఉన్నారు. నా లైఫ్‌లో నాకు మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ రోజున అందరికీ గ్రేట్‌ఫుల్‌గా థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. కాలేజ్ డేస్ ఆర్ హ్యాపీడేస్’’ అని పేర్కొన్నారు నివేథ. ‘జై లవకుశ’ సినిమా తర్వాత డిగ్రీ కంప్లీట్ చేయడం కోసం ఏ సినిమా సైన్ చేయలేదు నివేథ. ఇప్పుడు కల్యాణ్ రామ్‌తో ఓ చిత్రం, నారా రోహిత్ మరో సినిమా అంగీకరించారు. -
మరపురాని స్నేహగీతం...
స్నేహం ఒక నిరంతర స్రవంతి. వయసుతో పని లేని వాత్సల్యం దానిది. అమ్మ అనురాగాన్ని, అనంతమైన ఆప్యాయతని దోసిళ్లకు అందించే దోస్తీ అది.‘పాదమెటు పోతున్నా... పయనమెందా కైనా... అడుగు తడబడుతున్నా... తోడు రానా...’’ అంటూ నీ నీడలా మారుతుంది. నీకు కష్టమొస్తే కుంగిపోతుంది. నీకు దూరమైతే తల్లడిల్లిపోతుంది.ఓ మై ఫ్రెండ్... తడి కన్నులనే తుడిచిన నేస్తమా... ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా... అంటూ నువ్వు తనని ఆదుకున్న సందర్భాలను మళ్లీ ఒకసారి మనసులో తలుస్తుంది. ఈ పాట పుట్టుకని నెమరువేసుకుంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తాజాగా అనిపిస్తుంది. అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుంది.... జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది... అని స్నేహం ఔన్నత్యాన్ని కీర్తించాను. అమ్మని కూడా మించిన మమతల్ని నాకు పంచుతున్న నేస్తాన్ని చూసి గర్వించాను. ‘మీరు... మీరు నుంచి మన స్నేహగీతం.... ఏరా ఏరాల్లోకి మారె... మోమాటాలే లేని కళలే జాలువారే...’ అంటూ పాడుకున్నాను.చిన్నప్పటి సంగతుల్ని చిత్రిక పట్టి మనసు పటంలో దాచుకునే స్నేహ పరిమళం దాచాలన్నా దాగదు. అది మెదడు పుటల్లో మెదులుతూనే ఉంటుంది. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే... నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంత వాలే... అని మురిసిపోతుంది మనసు.గిల్లికజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్లింతల్లో తేలే స్నేహం...మొదలో తుదలో తెలిపే ముడి వీడకుందే...నిజంగా తెలుస్తుందా... ఏ స్నేహం ఎప్పుడు మొదలయ్యిందో? ఏ నిమిషం ఒకే ప్రాణంగా మారిపోయిందో? ఏ ఊపిరి ఎవరిదో పోల్చుకోవడం కష్టమవుతుందో? ఎలా తెలుస్తుంది నేస్తమే లోకమైనప్పుడు! ఎలా తెలుస్తుంది సమస్తమూ తానై మనలో ఏకమైనప్పుడు! ఎలా తెలుస్తుంది... స్నేహతత్త్వమే మనల్ని, ఈ లోకాన్ని పునీతుల్ని చేస్తుందని...!! – సంభాషణ: డా. వైజయంతి చిత్రం: హ్యాపీడేస్ రచన: వనమాలి సంగీతం: మిక్కీ జె మేయర్ గానం: ప్రిన్స్ శ్యామ్ -
హ్యాపీడేస్ నటి కన్నుమూత
న్యూయార్క్: ప్రముఖ హాలీవుడ్ నటి ఎరిన్ మోరాన్(56) కన్నుమూశారు. నిన్నమొన్నటి వరకు ఆరోగ్యంగానే ఉన్న ఆమె హఠాత్తుగా మరణించారు. శనివారం మధ్యాహ్నం తమకు ఆమె చనిపోయినట్లు కబురందిందని ఆ వెంటనే అక్కడికి చేరుకున్నామని, ఆమె మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. ఎరిన్ 1970లో హాలీవుడ్ విడుదలైన హ్యాపీ డేస్‌లో జోనీ అనే పాత్రలో అద్భుతంగా నటించారు. అంతేకాకుండా 1982లో ప్రారంభమైన జోనీ లవ్స్ చాచీ అనే సిరీస్‌లల్లో కూడా నటించింది. ఈ సందర్భంగా ఆమెకు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆమె ఇండియానాలోని టైలర్ పార్క్‌లో ఉండేవారు. -
క్రిమినల్ కాదు!
‘హ్యాపీడేస్’, ‘లవ్ యు బంగారమ్’ చిత్రాలతో ఆకట్టుకున్న రాహుల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వెంకటాపురం’. వేణుని దర్శకునిగా పరిచయం చేస్తూ, గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ సారధ్యంలో శ్రేయాస్ శ్రీనివాస్, తుము ఫణికుమార్ నిర్మించారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. మా చిత్రం ఫస్ట్‌లుక్‌కు మంచి క్రేజ్ వచ్చింది. చిత్ర పరిశ్రమలోని పలువురు పెద్దలు అభినందించారు. ఈ చిత్రంలో రాహుల్ విభిన్నంగా కనిపిస్తారు. త్వరలో పాటలు, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. మహిమా మఖ్వానా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కెమేరా: సాయి ప్రకాష్, సంగీతం: అచ్చు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తాళ్లూరి ఆనంద్, లైన్ ప్రొడ్యూసర్: కె.అరుణ్ మోహన్, నిర్మాత: ఎంవివి సత్యనారాయణ. -
బాలీవుడ్లో హ్యాపిడేస్
టాలీవుడ్లో కమర్షియల్ సినిమా హవా నడుస్తున్న సమయంలో కూడా కాఫీలాంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. సింపుల్ సబ్జెక్ట్లతో సున్నితమైన భావోద్వేగాలను పలికించే శేఖర్ కమ్ముల తన రూటు మార్చి తెరకెక్కించిన అనామిక సినిమాతో ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో గ్యాప్ తీసుకొని ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. 2007లో తన దర్శకత్వంలో తెరకెక్కి, సూపర్ హిట్ అయిన హ్యాపిడేస్ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోసం పూణే లోనే ఓ కాలేజ్‌ను సెలెక్ట్ చేసిన శేఖర్, ప్రస్తుతం నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. మార్చి నుంచి షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్న హ్యాపిడేస్ రీమేక్‌ను సల్మాన్ ఖాన్‌తో కలిసి శేఖర్ కమ్ముల స్వయంగా నిర్మిస్తున్నట్టుగా వార్తలు వినిపించినా చిత్రయూనిట్ మాత్రం అఫీషియల్‌గా కన్ఫామ్ చేయలేదు. -
డిసెంబర్ 7న వరుణ్ నిశ్చితార్థం
చాలా రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్న వార్తలకు యంగ్ హీరో వరుణ్ సందేశ్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. త్వరలోనే తన ప్రియురాలు వితికా షేరుతో నిశితార్థానికి రెడీ అవుతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించేశాడు. సోమవారం తన ట్విట్టర్ పేజ్‌పై వితికా షేరుతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన వరుణ్.. డిసెంబర్ 7వ తేదీన నిశ్చితార్థం జరగనున్నట్టు ప్రకటించాడు. హ్యాపీడేస్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న వరుణ్ సందేశ్, తరువాత కొత్త బంగారులోకం సినిమాతో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్‌కు దగ్గరవుతున్నాడనుకున్న సమయంలో వరుస ఫ్లాప్‌లతో డీలా పడిపోయాడు. ప్రస్తుతం ఉదయం, ట్విస్ట్ సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈ యంగ్ హీరో.. తనతో 'పడ్డానండీ ప్రేమలో మరి' సినిమాలో కలిసి నటించిన వితికా షేరును పెళ్లాడనున్నాడు. Getting ENGAGED on DECEMBER 7th to the LOVE of my LIFE @IamVithikaSheru :-) #HappyDays God Bless!!! pic.twitter.com/ucf9AMHuqM — Varun Sandesh (@iamvarunsandesh) November 30, 2015 -
ఈ చిత్రంతో నాకు బ్రేక్ ఖాయం : అదిత్
తెలుగులో కథ, వీకెండ్ లవ్, తెలుగు ‘హ్యాపీ డేస్’ తమిళ రీమేక్‌తో పాటు మరో రెండు తమిళ చిత్రాల్లో హీరోగా నటించారు అదిత్. ఇప్పటివరకు చేసినవి ట్రయల్ బాల్స్ లాంటివనీ, ఇప్పుడు చేసిన ‘తుంగభద్ర’ ఫస్ట్ బాల్ లాంటిదని అంటున్నారు. సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. శ్రీనివాసకృష్ణ గోగినేని దర్శకుడు. ఈ చిత్రవిశేషాలను అదిత్ పాత్రికేయులతో పంచుకున్నారు. ‘‘‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణతో ఈ సంస్థలో నేనో సినిమా చేయాల్సి ఉంది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడీ సినిమాకి కుదిరింది. సాయి కొర్రపాటిగారు మంచి చిత్రాలు నిర్మిస్తారు. అందుకే, ఈ చిత్రం ‘నా కెరీర్‌కి సరైన పునాది’ అంటున్నా’’ అని అదిత్ చెప్పారు. ఈ చిత్రకథ గురించి చెబుతూ, ‘‘ఇది నది నేపథ్యంలో సాగే కథ కాదు. ఒక ఊరిలో రెండు వర్గాల మధ్య జరిగే కథ. ఆ కథలో ఓ ప్రేమకథ ఉంటుంది. ఇందులో చేసిన కొర్లపూడి శ్రీను పాత్ర కోసం గుంటూరు యాసలో మాట్లాడాలి. మాటలు తక్కువ, హావభావాలు ఎక్కువ. నటనకు అవకాశం ఉన్న పాత్ర’’ అన్నారు. ‘‘ఇప్పటివరకు నేను చేసిన చిత్రాల్లో నటనపరంగా నాకే లోపాలు కనిపించాయి. కానీ, ఈ చిత్రంలో బాగా నటించాననే సంతృప్తి కలిగింది. హీరో బాలకృష్ణ ఈ సినిమా చూసి, అభినందించారు. క్లయిమాక్స్ అర్థవంతంగా ఉంటుంది. నా కెరీర్‌కి తొలి బ్రేక్ ఖాయం అనే నమ్మకం ఉంది’’ అని అదిత్ అన్నారు. -
విజయవాడ సూపర్బ్
CHITCHAT ‘సాక్షి’తో యువహీరో వరుణ్ సందేశ్ ‘హ్యాపీడేస్’ సినిమాతో తన హ్యాపీడేస్‌ను మొదలుపెట్టి.. ‘కొత్తబంగారులోకం’తో తన సినీ జీవితాన్ని బంగారుమయం చేసుకుని.. ‘కుర్రాడు’తో కుర్రాళ్లను ఆకట్టుకున్న హీరో వరుణ్ సందేశ్ తాజాగా ‘పడ్డానండి ప్రేమలో మరి..’ అంటూ ప్రేమికుల రోజున మన ముందుకు రాబోతున్నాడు. కేబీఎన్ కళాశాలలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం ఆయన నగరానికి వచ్చారు. విజయవాడ సూపర్బ్.. అంటూ నగర వాతావరణాన్ని, నగరవాసులను మెచ్చుకున్న యువహీరో వరుణ్ సందేశ్‌తో ‘సాక్షి’ చిట్‌చాట్. - వన్‌టౌన్ సాక్షి : న్యూజెర్సీ నుంచి తెలుగ చిత్ర పరిశ్రమకు ఎలా వచ్చారు? వరుణ్ : మేము తెలుగువాళ్లమే అరుునా న్యూజెర్సీలో స్థిరపడ్డాం. మా తాతగారు జీడిగుంట శ్రీరామచంద్రమూర్తి ప్రముఖ సాహితీవేత్త. మా బాబాయ్ జీడిగుంట శ్రీధర్ నటుడు. ఈ క్రమంలోనే నాకు నటనపై ఆసక్తి కలిగింది. ‘హ్యాపీడేస్’ చిత్రం కోసం శేఖర్‌కమ్ముల కొత్త నటీనటుల కోసం అన్వేషిస్తుండగా, నేనూ ప్రయత్నించి విజయం సాధించా. సాక్షి : మీకు మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రాలు..? వరుణ్ : హ్యాపీడేస్, కొత్తబంగారులోకం నాకు మంచి బ్రేక్నిచ్చారుు. మరికొన్ని సినిమాలు నటుడిగా నిలదొక్కుకోవడానికి సహాయపడ్డాయి. ఏదిఏమైనా జీవితం హ్యాపీగానే నడుస్తోంది. సాక్షి : ఇటీవల ఒకటి రెండు చిత్రాలు మీకు నిరాశ మిగిల్చినట్లున్నారుు..? వరుణ్ : అవును. కారణాలు ఏమైనా ఒకటి రెండు చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కొంత నిరాశ కలిగిన మాట వాస్తవమే. సాక్షి : కారణాలు ఏమని భావిస్తున్నారు. వరుణ్ : కారణాలు చాలానే ఉన్నారుు. ఏ సినిమా అరుునా ప్రేక్షకులకు నచ్చాలనే కదా తీసేది. అరుుతే, అందులోని కొన్ని అంశాలే నిరాదరణకు గురవుతున్నారుు. ఇకపై అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడతా. సాక్షి : మీ కొత్త సినిమాలేమిటి? వరుణ్ : రామచంద్రప్రసాద్ మహేష్ దర్శకత్వంలో నిర్మించిన ‘పడ్డానండి ప్రేమలో మరి’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తేదీని కూడా విజయవాడలోనే నిర్ణయించుకున్నాం. మంచి ఫలితం ఉంటుందని ఆశిస్తున్నాం. సాక్షి : ‘పడ్డానండి ప్రేమలో మరి’ చిత్ర కథాంశం ఏమిటి? వరుణ్ : లవ్‌స్టోరీనే అరుునా యూక్షన్తో సాగుతుంది. కుటుంబమంతా కలిసి చక్కగా చూడొచ్చు. ప్రతి మనిషీ ‘మానవత్వం’ కలిగి ఉండాలనే సందేశాన్ని ఇందులో చెప్పాం. సాక్షి : మీ కొత్త ప్రాజెక్టులు.. వరుణ్ : ‘లవకుశ్’, ‘లైలా ఓ లైలా’ షూటింగ్ జరుగుతోంది. మరికొన్ని సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. సాక్షి : కథ ఓకే అరుుతే మల్టీస్టారర్ సినిమాలు చేస్తారా? వరుణ్ : మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి నాకు అభ్యంతరమేమీ లేదు. నేను స్టార్ అని అనుకోవట్లేదు. నటుడిగానే భావిస్తున్నాను. ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో మోహన్‌బాబు, మనోజ్ సోదరులతో కలిసి చేశాను. అలాగే, ‘డి ఫర్ దోపిడీ’లో సందీప్‌కిషన్‌తో కలిసి నటించా. కథ కుదిరితే మల్టీస్టారర్‌లో తప్పక నటిస్తా. విజయవాడ ఎలా ఉంది? విజయవాడ సూపర్బ్. గతంలో నాలుగైదు సార్లు ఇక్కడకు వచ్చాను. బుధవారం రాత్రి కేబీఎన్ కళాశాల మేనేజ్మెంట్ మీట్లో పాల్గొన్నాను. విద్యార్థులంతా నన్ను చక్కగా ఆదరించారు. మొదటిసారిగా కనక దుర్గమ్మను దర్శించుకున్నాను. ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమా ప్రమోషన్ కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. -
హ్యాపీ డేస్
మా అమ్మమ్మగారి ఊరు విజయవాడలో పుట్టడమైతే పుట్టాను గానీ, చిన్ననాటి నుంచి నేను పెరిగింది హైదరాబాద్‌లోనే. బాల్యంలో ఎక్కువకాలం సికింద్రాబాద్ పరిసరాల్లో గడిపాను. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ స్కూల్లో చదువుకున్నాను. సైనిక్‌పురి కాలేజీలో బి.కామ్ పూర్తి చేశాను. చిన్నప్పుడు సికింద్రాబాద్, మారేడ్‌పల్లి, సైనిక్‌పురి ప్రాంతాలనే నగరంలో పోష్ ఏరియాలనుకునే దాన్ని. మా నాన్న రిటైర్డ్ బ్యాంకు అధికారి, అమ్మ గృహిణి. నాకో తమ్ముడు ఉన్నాడు. మాది ఎనిమిది మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం. నన్ను చాలా స్పెషల్‌గా తీర్చిదిద్దిన నగరం ఇదే. అందుకే హైదరాబాద్ అంటే నాకు వల్లమాలిన ఇష్టం. ఔట్‌డోర్ షూటింగుల కోసం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు హైదరాబాద్‌ను మిస్సవుతున్నానే అని ఫీలవుతుంటాను. హైదరాబాద్ కంఫర్ట్‌కు మరే నగరమూ సాటిరాదు. ఇక్కడి ప్రజలు తమ తమ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా, సంస్కృతిని, పండుగలను ఎన్నడూ మరచిపోరు. కేకుల తయారీలో ప్రయోగాలు.. బేకరీ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆన్లైన్లో ఫుడ్ వెబ్‌సైట్స్ చూస్తూ, వంటల్లో.. ముఖ్యంగా కేకుల తయారీలో ప్రయోగాలు చేస్తుంటాను. నేనెప్పుడు వంటగదిలోకి వెళ్లినా.. ఇంటిల్లిపాదీ నేను చేసే వంటకాల కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. ఇక హైదరాబాదీ ఫుడ్ విషయానికొస్తే, నాకు హైదరాబాద్ హౌస్‌లోని దమ్కీ బిర్యానీ, కుబానీ కా మీఠా చాలా ఇష్టం. నేను ఎక్కువగా మొఘలాయ్ ఫుడ్‌ను ఇష్టపడతాను. మాదాపూర్‌లోని మంజర్ రెస్టారెంట్‌కు కూడా తరచూ వెళుతుంటాను. అప్పటి పచ్చదనం తిరిగి రావాలి.. నగరంలో నాకు చార్మినార్, బిర్లామందిర్, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ ఇష్టమైన ప్రదేశాలు. నా చిన్నప్పుడు నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుతూ కనిపించేవి. వీధివీధినా పార్కులు ఉండేవి. వాహనాల రద్దీ తక్కువగా ఉండేది. ఇప్పుడన్నీ మారిపోయాయి. వాహనాలు.. వాటి వల్ల కాలుష్యం పెరిగాయి. పచ్చదనం తగ్గింది. చాలా ప్రాంతాల్లో పార్కులు మాయమయ్యాయి. అప్పటి పచ్చదనం తిరిగి రావాలని కోరుకుంటాను. ఇక పండుగలంటే నాకు చాలా ఉత్సాహం. ముంబై తరహాలోనే మన నగరంలోనూ వినాయక నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. సంక్రాంతికి గొబ్బెమ్మలు, ముగ్గులు, గాలిపటాలు.. సందడే సందడి. మాది ఉమ్మడి కుటుంబం కావడంతో సంక్రాంతికి అందరం టైపైకి వెళ్లి గాలిపటాలు ఎగరేస్తూ ఉత్సాహంగా గడుపుతాం. శిరీష చల్లపల్లి -
రాముడిలా మారే కృష్ణుడు
కృష్ణుడిలాంటి కుర్రాడు రాముడిలా మారడానికి కారణం ఏంటి? మారిన తర్వాత అతను రాముడిలానే ఉన్నాడా? మళ్లీ మారాడా? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘రాముడు మంచి బాలుడు’. ‘హ్యపీడేస్’ ఫేం రణధీర్, గౌతమి చౌదరి జంటగా టి. సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంపత్ రాజ్ దర్శకుడు. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ - ‘‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలనే ఆశయంతో ఈ సినిమా చేస్తున్నాం. ఇందులో షకీలా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. త్వరలో పాటలను, వచ్చే నెల చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. కథాబలం ఉన్న చిత్రం ఇదని, అన్ని వర్గాలవారూ చూసే విధంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. టైటిల్ రోల్‌ను రణధీర్ అద్భుతంగా చేస్తున్నారని కూడా చెప్పారు. ఇందులో తనది రెండు కోణాలున్న పాత్ర అని, ‘హ్యాపీడేస్’, ‘బ్రేకప్’ తర్వాత చేస్తున్న మరో మంచి సినిమా ఇదని రణధీర్ చెప్పారు. ఈ చిత్రానికి మాటలు-పాటలు: భాషశ్రీ, కెమెరా: సంతోష్ శానినేని, సంగీతం: నవనీత్ చారి. -
బాలీవుడ్ లాభం లేదు
ఆశించింది జరగకపోతే ఇక లాభం లేదు ప్రత్యామ్నాయం చూసుకోవలసిందే అని అనుకోవడం సహజం. ప్రస్తుతం నటి తమన్నా ఇలాంటి చింతలోనే ఉన్నారని సమాచారం. ఈ ముంబయి బ్యూటీకి బాలీవుడ్ అచ్చిరాలేదు. ఆదిలో ఒకసారి చాన్సా రోషన్ చేట్రా చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అది ఆశాజనకంగా లేకపోవడంతో దక్షిణాదిపై దృష్టి సారించింది. టాలీవుడ్లో శ్రీ చిత్రంలో, కోలీవుడ్‌లో కేడీ చిత్రంతో రంగప్రవేశం చేసినా ఆ రెండు చిత్రాలూ ఆశించిన విజయాన్ని అందించకపోయాయి. అయితే టాలీవుడ్ చిత్రం హ్యాపీడేస్ తమన్నా జీవితంలో వెలుగు నింపింది. ఆ తర్వాత ఈ ఉత్తరాది బ్యూటీ దక్షిణాది (తెలుగు, తమిళం)లో దూసుకుపోతోంది. ఇక్కడే నంబర్‌వన్ హీరోయిన్లకు దీటుగా ఎదిగిన తమన్నా బాలీవుడ్ మోహం తిరిగి చూడలేదు. గత ఏడాది హిమ్మత్వాలా చిత్రంతో మరోసారి బాలీవుడ్లో ప్రవేశించి విజయమే లక్ష్యంగా అందాలను ఆరబోసింది. అలా ఎంత శ్రమించినా చిత్రం విజయం సాధిస్తేనే కథ నేమ్ అయినా ఫేమ్ అయినా వచ్చేది. ఆ తర్వాత మరోసారి హమ్‌షకల్స్ చిత్రంలో నటించే అవకాశాన్ని బాలీవుడ్ కల్పించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడడంతో బాలీవుడ్లో వెలగాలన్న తమన్నా ఆశ నీరుగారిపోయింది. దీంతో పిచేముడ్ అంటూ మళ్లీ తమిళం, తెలుగు భాషలపై దృష్టి సారించింది. తెలుగులో ప్రోత్సాహకంగానే ఉన్నా తమిళంలోనే అవకాశాలు రావడం లేదు. టాలీవుడ్లో అనుష్క హీరోయిన్గా నటిస్తున్న బాహుబలి చిత్రంలో ముఖ్య భూమిక పోషిస్తున్న తమన్నా మహేష్‌బాబు సరసన ఆగడు చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. మధ్యలో గ్యాప్ రావడంతో స్పెషల్ సాంగ్స్‌లో కూడా తన లెగ్స్‌ను షేక్ చేసింది. అలా తెలుగులో సమంత హీరోయిన్గా నటించిన అల్లుడు శ్రీను, తమిళంలో నయనతార నాయకిగా నటించిన నన్బేండ చిత్రాలు త్వరలో తెరపైకి రానున్నాయి. ప్రస్తుతం నటిస్తున్న ఈ చిత్రాలు సాధించే సక్సెస్‌లపైనే తమన్నా నట భవిష్యత్ ఆధారపడి ఉదంటుదని చెవులు కొరుక్కుంటున్నాయి సినీవర్గాలు. విదేశీ విహారం ఈ ముద్దుగుమ్మ నటనకు గ్యాప్ రావడంతో ఈ సమయాన్ని విదేశీ విహారానికి సద్వినియోగం చేసుకుంటోంది. ఈ నెలలో యూఎస్‌కు పయనమవుతున్నారు. తమన్నాకు ఫిలడెల్ఫియాలో జర గనున్న ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం ముగించుకుని తమన్నా తన తల్లితోసహా న్యూయార్క్‌ను చుట్టిరానున్నారు. ఈ విహారయాత్రలో ఈ బ్యూటీ ఎలాంటి సెలబ్రిటీ హంగులు లేకుండా ముఖానికి మేకప్ కూడా లేకుండా ఒక సాధారణ అమ్మాయిగా ఎంజాయ్ చేయనున్నారట. అనంతరం స్వదేవానికి తిరిగొచ్చి తెలుగు చిత్ర షూటింగ్‌ల్లో పాల్గొననున్నారని సమాచారం. -
లవ్ యు బంగారమ్
‘హ్యాపీడేస్’ ఫేం రాహుల్, సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘లవ్ యు బంగారమ్’. గోవి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. కేఎస్ రామారావు సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘ఈ రోజుల్లో’ఫేం మారుతి, కె.వల్లభ నిర్మాతలు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. కె.ఎస్.రామారావు మాట్లాడుతూ -‘‘చిన్న బడ్జెట్‌తో విజయవంతమైన సినిమాలు తీసి కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టాడు మారుతి. అందుకే అతనితో ఓ సినిమా చేయాలనిపించింది. క్యాచీ టైటిల్ పెట్టి భిన్నమైన లుక్‌తో సినిమాకు క్రేజ్ తెచ్చాడు మారుతి. ఇటీవలే రషెస్ చూశాను. మారుతీ ఖాతాలో మరో విజయం ఖాయం’’ అన్నారు. ‘‘స్టోరి లైన్‌ని ఎంత ఆసక్తికరంగా చెప్పాడో... అలాగే తెరకెక్కించాడు గోవి. అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. ఈ నెల 20న పాటలను, డిసెంబర్ తొలివారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని మారుతి తెలిపారు. ఈ చిత్రానికి పనిచేయడం పట్ల చిత్రం యూనిట్ ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో బి.ఏ.రాజు, భార్గవి, డిఓపి అరుణ్‌కుమార్, ఎస్.కె.ఎన్., జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ ఇష్క్ కాదల్ మరో ‘హ్యాపీడేస్’ కావాలి
‘‘నిర్మాత గోపీ ఓ నిబద్ధతతో ఈ స్థాయికి చేరుకున్నాడు. తను కథను బాగా జడ్జ్ చేయగలడు. తను ఇప్పుడు తీసిన ఈ సినిమా మరో ‘హ్యాపీడేస్’ కావాలి’’ అని హీరో శివాజీ అన్నారు. డి.సురేష్‌బాబు సమర్పణలో పవన్ సాదినేని దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ (గోపీ) నిర్మిస్తున్న ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. సునీల్ పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని ‘అల్లరి’ నరేష్, నారా రోహిత్‌కు అందించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ -‘‘దర్శకుడు పవన్ ఈ సినిమాతో పవన్‌కల్యాణ్‌ని డెరైక్ట్ చేసే స్థాయికి ఎదగాలి. అలాగే ఛాయాగ్రాహకుడు కార్తీక్ ఘట్టమనేని, మహేశ్‌బాబుతో పనిచేసే రేంజ్‌కి రావాలి’’ అని ఆకాంక్షించారు. ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ -‘‘బాలీవుడ్లో చిన్న సినిమాలకు చాలా వేదికలున్నాయి. టాలీవుడ్లో కూడా అలాంటి వేదిక కావాలనే ఈ సినిమాలో భాగస్వామినయ్యా’’ అన్నారు. సురేష్‌బాబు ఈ సినిమాలో భాగమైనందుకు గర్విస్తున్నానని బెక్కెం గోపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా తమ్మారెడ్డి భరద్వాజ్, బెల్లంకొండ సురేష్, నందినీరెడ్డి, దశరథ్, గోపీచంద్ మలినేని, కోన వెంకట్, మహత్, అరవింద్ కృష్ణ, కమల్ కామరాజు, విజయ్‌కుమార్ కొండా, తనీష్, అడివి శేష్, శ్రవణ్, హర్షవర్థన్ రాణే, వితిక శేరు, విష్ణువర్థన్, రీతూవర్మ, హరీష్, శ్రీముఖి, కృష్ణ చైతన్య తదితరులు మాట్లాడారు.