హ్యాపీడేస్‌ నటి కన్నుమూత | Happy Days actress Erin Moran dies at 56 | Sakshi
Sakshi News home page

హ్యాపీడేస్‌ నటి కన్నుమూత

Published Sun, Apr 23 2017 12:26 PM | Last Updated on Tue, Sep 5 2017 9:31 AM

హ్యాపీడేస్‌ నటి కన్నుమూత

హ్యాపీడేస్‌ నటి కన్నుమూత

న్యూయార్క్‌: ప్రముఖ హాలీవుడ్‌ నటి ఎరిన్‌ మోరాన్‌(56) కన్నుమూశారు. నిన్నమొన్నటి వరకు ఆరోగ్యంగానే ఉన్న ఆమె హఠాత్తుగా మరణించారు. శనివారం మధ్యాహ్నం తమకు ఆమె చనిపోయినట్లు కబురందిందని ఆ వెంటనే అక్కడికి చేరుకున్నామని, ఆమె మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు.

ఎరిన్‌ 1970లో హాలీవుడ్‌ విడుదలైన హ్యాపీ డేస్‌లో జోనీ అనే పాత్రలో అద్భుతంగా నటించారు. అంతేకాకుండా 1982లో ప్రారంభమైన జోనీ లవ్స్‌ చాచీ అనే సిరీస్‌లల్లో కూడా నటించింది. ఈ సందర్భంగా ఆమెకు హాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆమె ఇండియానాలోని టైలర్‌ పార్క్‌లో ఉండేవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement