కాలేజ్‌ డేస్‌.. హ్యాపీ డేస్‌ | nivetha thomas says college days are happy days | Sakshi
Sakshi News home page

కాలేజ్‌ డేస్‌.. హ్యాపీ డేస్‌

Published Sat, May 12 2018 1:49 AM | Last Updated on Sat, May 12 2018 1:49 AM

nivetha thomas says college days are happy days - Sakshi

కాలేజీ రోజులు ఎప్పుడూ హ్యాపీడేసే. ఎగ్జామ్స్, ల్యాబ్స్, అటెండెన్స్‌.. ఇలా.. చదివేటప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా గడిచిపోయిన ఆ మూమెంట్స్‌ని తలుచుకుంటే ఎవరైనా నోస్టాల్జియా ఫీల్‌ అవుతారు. ఇప్పుడు హీరోయిన్‌ నివేథా థామస్‌ కూడా అదే ఫీలింగ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇటీవలే నివేథ ఆర్కిటెక్చర్‌ డిగ్రీ పూర్తి చేశారు. కాలేజ్‌ డేస్‌ను గుర్తుచేసుకుంటూ ‘‘ఐదేళ్లు.. ముగింపు దశకు వచ్చేశాయి. 5 ఇయర్స్‌.. స్టడీయింగ్, ట్రావెలింగ్, కేస్‌ స్టడీ కోసం సిటీలు, దేశాలు తిరిగొచ్చాం. కాలేజ్‌ టూర్‌ మిస్‌ కాకూడదని మూవీ డేట్స్‌ రీ–షెడ్యూల్‌ చేసుకున్నాను. సెట్స్‌లో డ్రాఫ్టింగ్‌ చేసేదాన్ని, ఏరోప్లైన్‌లో స్కెచ్‌లు గీసేదాన్ని. ఒకేసారి ఎగ్జామ్స్‌ అన్నీ కంప్లీట్‌ చేయడం.

సెమిస్టర్‌ హాలిడేస్‌లో మూవీస్‌కు డేట్స్‌ ఇవ్వడం. కొన్నిసార్లు అవి కూడా ఇవ్వకుండా డిగ్రీ కంప్లీట్‌ చేయడం కోసం కష్టపడటం. ఇలా అన్నీ దాటుకొని డిగ్రీ కంప్లీట్‌ చేశాను. ఈరోజు ఇంత స్పెషల్‌గా ఉండటానికి కారణం నా వర్క్‌ని అభినందించిన వాళ్లంతా ఈ జర్నీలో నాతో ఉండటం. నా స్టడీ బ్రేక్స్, మూవీ బ్రేక్స్‌ అన్నింట్లో ఉన్నారు. నా లైఫ్‌లో నాకు మోస్ట్‌ ఇంపార్టెంట్‌ మూమెంట్‌ రోజున అందరికీ గ్రేట్‌ఫుల్‌గా థ్యాంక్స్‌ చెప్పదలుచుకున్నాను. కాలేజ్‌ డేస్‌ ఆర్‌ హ్యాపీడేస్‌’’ అని పేర్కొన్నారు నివేథ. ‘జై లవకుశ’ సినిమా తర్వాత డిగ్రీ కంప్లీట్‌ చేయడం కోసం ఏ సినిమా సైన్‌ చేయలేదు నివేథ. ఇప్పుడు కల్యాణ్‌ రామ్‌తో ఓ చిత్రం, నారా రోహిత్‌ మరో సినిమా అంగీకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement