Degree completed
-
14 ఏళ్లకే డిగ్రీ పూర్తి చేసిన అగస్త్య జైస్వాల్
సాక్షి, కాచిగూడ (హైదరాబాద్) : జాతీయస్థాయిలో టేబుల్ టెన్నిస్ క్రీడలో రాణిస్తూనే పిన్న వయసులోనే పెద్ద చదువులు చదువుతూ రికార్డు సృష్టిస్తున్నాడు కాచిగూడకు చెందిన 14 ఏళ్ల బాలుడు ఆగస్త్య జైస్వాల్. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించిన డిగ్రీ ఫలితాల్లో మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యాడు. యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీ కాలేజీలో బీఏ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివాడు. 9 ఏళ్ల వయసులోనే 10వ తరగతి, 11 ఏళ్లలో ఇంటర్ పూర్తి చేశాడు. తెలంగాణ రాష్ట్రంలోనే 14 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేసిన బాలుడిగా ఆగస్త్య జైస్వాల్ రికార్డు సృష్టించాడు. ఆగస్త్య జైస్వాల్ సోదరి నైనా జైస్వాల్ టేబుల్ టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ 13 ఏళ్ల వయసులోనే డిగ్రీ పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా మంగళవారం కాచిగూడలో తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి, అశ్విన్‌కుమార్‌లతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు అగస్త్య జైస్వాల్‌ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆగస్త్య జైస్వాల్ మాట్లాడుతూ చిన్న వయసులోనే విభిన్న రంగాల్లో రాణించడం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నాడు. స్కూల్‌కు వెళ్లకుండా తల్లిదండ్రులనే తన గురువులుగా చేసుకుని క్రీడా, విద్యా రంగాల్లో రాణిస్తున్నట్లు తెలిపాడు. -
కాలేజ్ డేస్.. హ్యాపీ డేస్
కాలేజీ రోజులు ఎప్పుడూ హ్యాపీడేసే. ఎగ్జామ్స్, ల్యాబ్స్, అటెండెన్స్.. ఇలా.. చదివేటప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా గడిచిపోయిన ఆ మూమెంట్స్‌ని తలుచుకుంటే ఎవరైనా నోస్టాల్జియా ఫీల్ అవుతారు. ఇప్పుడు హీరోయిన్ నివేథా థామస్ కూడా అదే ఫీలింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే నివేథ ఆర్కిటెక్చర్ డిగ్రీ పూర్తి చేశారు. కాలేజ్ డేస్‌ను గుర్తుచేసుకుంటూ ‘‘ఐదేళ్లు.. ముగింపు దశకు వచ్చేశాయి. 5 ఇయర్స్.. స్టడీయింగ్, ట్రావెలింగ్, కేస్ స్టడీ కోసం సిటీలు, దేశాలు తిరిగొచ్చాం. కాలేజ్ టూర్ మిస్ కాకూడదని మూవీ డేట్స్ రీ–షెడ్యూల్ చేసుకున్నాను. సెట్స్‌లో డ్రాఫ్టింగ్ చేసేదాన్ని, ఏరోప్లైన్లో స్కెచ్‌లు గీసేదాన్ని. ఒకేసారి ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేయడం. సెమిస్టర్ హాలిడేస్‌లో మూవీస్‌కు డేట్స్ ఇవ్వడం. కొన్నిసార్లు అవి కూడా ఇవ్వకుండా డిగ్రీ కంప్లీట్ చేయడం కోసం కష్టపడటం. ఇలా అన్నీ దాటుకొని డిగ్రీ కంప్లీట్ చేశాను. ఈరోజు ఇంత స్పెషల్‌గా ఉండటానికి కారణం నా వర్క్‌ని అభినందించిన వాళ్లంతా ఈ జర్నీలో నాతో ఉండటం. నా స్టడీ బ్రేక్స్, మూవీ బ్రేక్స్ అన్నింట్లో ఉన్నారు. నా లైఫ్‌లో నాకు మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ రోజున అందరికీ గ్రేట్‌ఫుల్‌గా థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. కాలేజ్ డేస్ ఆర్ హ్యాపీడేస్’’ అని పేర్కొన్నారు నివేథ. ‘జై లవకుశ’ సినిమా తర్వాత డిగ్రీ కంప్లీట్ చేయడం కోసం ఏ సినిమా సైన్ చేయలేదు నివేథ. ఇప్పుడు కల్యాణ్ రామ్‌తో ఓ చిత్రం, నారా రోహిత్ మరో సినిమా అంగీకరించారు. -
కాళ్లపారాణి ఆరకముందే...
రిమ్స్ క్యాంపస్ :మూడుముళ్లూ పడి మూడు నెలలు కూడా పూర్తికాలేదు. పెళ్లి సమయంలో పెట్టిన కాళ్ల పారాణి ఇంకా ఆరనేలేదు. నిండా పాతికేళ్లు నిండని యువతి ఉరివేసుకుని తనువు చాలించింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం పట్టణం ఎ.ఎస్.ఎన్ కాలనీ వద్ద బ్యాంకర్స్ కాలనీలో నివాసముంటున్న మల్లేశ్వరరావు, యాకాశి దంపుతులకు కుమారుడు సూర్యప్రకాశ్, కుమార్తె రత్నకుమారి ఉన్నారు. సూర్యప్రకాశ్ డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. రత్నకుమారి శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో ఐదేళ్లుగా ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఈ ఏడాది ఆగస్టు 15న దవళపేటకు చెందిన రాజేశ్వరరావుతో వివాహమైంది. రత్నకుమారి దంపతులు కూడా బ్యాంకర్స్ కాలనీలోనే తమ కన్నవారింటికి దగ్గర్లొనే అద్దెకు దిగారు. సహోద్యోగి వేధింపులే కారణమా? పెళ్లైనప్పటి నుంచి ఎంతో ఆనందంగా ఉన్న ఈ దంపతుల జీవితం ఒక్కసారిగా పెనుతుపానులా మారింది. రత్నకుమారి తన సహోద్యోగి అయిన హరితో మాట్లాడుతుండటాన్ని భర్త రాజేశ్వరరావు గమనించారు. మరోసారి అతనితో మాట్లడటం తగదంటూ మందలించాడు. శుక్రవారం రాత్రి రత్నకుమారి అన్నయ్య అయిన సూర్యప్రకాశ్ రత్నకుమారి సెల్‌ఫోన్‌తో హరికి ఫోన్ చేశాడు. ఇంకోసారి తన చెల్లితో మాట్లాడితే బాగోదంటూ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య ఫోన్లో స్వల్ప వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. తర్వాత శనివారం ఉదయం 8 గంటలకు రాజేశ్వరరావు తన విధులకు బయలుదేరగా, సూర్యప్రకాశే ద్విచక్రవాహనంపై తీసుకుని వెళ్లి ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద దించాడు. అక్కడికి రాజేశ్వరరావు పనిచేస్తున్న కంపెనీ బస్సు రావటంతో దాంట్లో ఎక్కి ఆయన వెళ్లిపోయాడు. ఏలా తెలిసిందంటే? తిరిగి సూర్యప్రకాశ్ ఇంటికి వచ్చి తన తల్లి యాకాశిని చెల్లి ఇంటికి వెళ్లమని చెప్పి పంపించాడు. ఆమె ఇంటికి వెళ్లి చూసేసరికి ఇంటి బయట గెడ పెట్టి ఉండటంతో దాన్ని తీసి లోపలకు వెళ్లారు. లోపల గదిలో రత్నకుమారి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఉండటాన్ని గమనించారు. వెంటనే కేకలు వేస్తూ సూర్యప్రకాశ్‌ను పిలవటంతో వచ్చి ఆ చీర ముడి విప్పటానికి ప్రయత్నించి, వీలుకాకపోవడంతో కత్తితో తెంచి రత్నకుమారిని కిందికి దించారు. కొనఊపిరి ఉండటంతో వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రత్నకుమారి మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం త హశీల్దార్ దిలీప్ చక్రవర్తి పంచనామా చేపట్టారు. శ్రీకాకుళం పట్టణ ఇన్చార్జి సీఐ అయిన మహిళా పోలీసుస్టేషన్ సీఐ సూర్యనారాయణ, శ్రీకాకుళం రూరల్ పోలీసుస్టేషన్ ఇన్చార్జి అయిన ఒకటవ పట్టణ ఎస్ఐ కె.భాస్కరరావు సంఘటన స్థలాన్ని, మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హరి వేధించేవాడు తన చెల్లెలు రత్నకుమారిని సహోద్యోగి అయిన హరి నిత్యం ఫోన్లో వేధించేవాడని సూర్యప్రకాశ్ తెలిపాడు. తన మాట్లాడవద్దని ఎన్నిసార్లు చెప్పినా మాట్లాడుతుండేవాడని రత్నకుమారి చెప్పిందన్నాడు. దీంతో శుక్రవారం రాత్రి ఫోన్ చేయంగా, ఎట్టి పరిస్థితిలోనూ మీ చెల్లెల్ని వదిలే ప్రసక్తే లేదంటూ హరి బెదిరించడాని పేర్కొన్నాడు. తన చెల్లిని హరే చంపి ఉంటాడని ఆనుమానం వ్యక్తం చేశాడు. మృతిపై అనుమానాలు! రత్నకుమారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రత్నకుమారిది నిజంగా ఆత్మహత్యేనా... లేక ఎవరైనా హత్య చేసి ఉంటరా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్యాభర్తల మధ్య మూడు రోజులుగా హరి విషయమై వివాదం జరుగుతూ వస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రత్నకుమారి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని కొందరు చెబుతున్నారు.. అలాగని హత్య కాదని చెప్పేందుకు సరైన ఆధారాలు లేకుండా పోయాయి. ఇంటి బయట గడియ పెట్టి ఉంది. ఇంటి లోపల నుంచి కూడా బయట గడియ పెట్టే అవకాశం ఉంది. అయినంత మాత్రాన ఇంటి లోపల ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధపడ్డ రత్నకుమారి లోపల గడియ పెట్టుకోకుండా బయట గడియ గ్రిల్ తలుపు లోపల నుంచి చెయ్యిపెట్టి మరీ వేయాల్సిన అవసరం ఏముందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి మెడపై మాత్రం ఉరివేసుకున్నట్లు అచ్చులున్నాయి. అయితే నిజంగా ఆత్మహత్యేనా? లేదా హత్య చేసి ఉరి వేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నారుు. అసలు రత్నకుమారిది హత్యే అయి ఉంటే బాధ్యులెవరన్నది ప్రశ్నర్థకంగానే మిగిలింది. ఇక పోస్టుమార్టం రిపోర్టు అధారంగా పోలీసుల విచారణలో అసలు గుట్టు బయటపడనుంది.