మళ్లీ హ్యాపీ డేస్‌ | Happy Days re release in theatres on April 12 | Sakshi
Sakshi News home page

మళ్లీ హ్యాపీ డేస్‌

Published Wed, Mar 27 2024 5:57 AM | Last Updated on Wed, Mar 27 2024 12:14 PM

Happy Days re release in theatres on April 12 - Sakshi

కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రాల్లో ‘హ్యాపీ డేస్‌’ (2007) ఓ ట్రెండ్‌ సెట్టర్‌. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ యూత్‌ఫుల్‌ చిత్రం విడుదలై పదిహేడేళ్లయింది. వరుణ్‌ సందేశ్, తమన్నా భాటియా, నిఖిల్‌ సిద్ధార్థ్‌ తదితరుల కాంబినేషన్‌లో అమిగోస్‌ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో మంచి వసూళ్లతో సంచలన విజయం సాధించింది.

శేఖర్‌ కమ్ముల టేకింగ్, నటీనటుల పెర్ఫార్మెన్స్, మిక్కీ జే మేయర్‌ సంగీతం, విజయ్‌ సి. కుమార్‌ కెమెరా పనితనం అన్నీ అద్భుతంగా కుదిరిన ఈ చిత్రం ఇప్పుడు మళ్లీ విడుదల కానుంది. ఏప్రిల్‌ 12న ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్‌ సినిమాస్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement