క్రిమినల్‌ కాదు! | Rahul latest film venkatapuram | Sakshi
Sakshi News home page

క్రిమినల్‌ కాదు!

Published Fri, Jan 20 2017 11:29 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM

క్రిమినల్‌ కాదు!

క్రిమినల్‌ కాదు!

‘హ్యాపీడేస్‌’, ‘లవ్‌ యు బంగారమ్‌’ చిత్రాలతో ఆకట్టుకున్న రాహుల్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వెంకటాపురం’. వేణుని దర్శకునిగా పరిచయం చేస్తూ, గుడ్‌ సినిమా గ్రూప్‌ నిర్మాణ సారధ్యంలో శ్రేయాస్‌ శ్రీనివాస్, తుము ఫణికుమార్‌ నిర్మించారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. మా చిత్రం ఫస్ట్‌లుక్‌కు మంచి క్రేజ్‌ వచ్చింది.

చిత్ర పరిశ్రమలోని పలువురు పెద్దలు అభినందించారు. ఈ చిత్రంలో రాహుల్‌ విభిన్నంగా కనిపిస్తారు. త్వరలో పాటలు, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. మహిమా మఖ్వానా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కెమేరా: సాయి ప్రకాష్, సంగీతం: అచ్చు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: తాళ్లూరి ఆనంద్, లైన్‌ ప్రొడ్యూసర్‌: కె.అరుణ్‌ మోహన్, నిర్మాత: ఎంవివి సత్యనారాయణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement