డిసెంబర్ 7న వరుణ్ నిశ్చితార్థం | varun sandesh vithika sheru engagment on december 7th | Sakshi
Sakshi News home page

డిసెంబర్ 7న వరుణ్ నిశ్చితార్థం

Published Tue, Dec 1 2015 11:44 AM | Last Updated on Sun, Sep 3 2017 1:19 PM

డిసెంబర్ 7న వరుణ్ నిశ్చితార్థం

డిసెంబర్ 7న వరుణ్ నిశ్చితార్థం

చాలా రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్న వార్తలకు యంగ్ హీరో వరుణ్ సందేశ్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. త్వరలోనే తన ప్రియురాలు వితికా షేరుతో నిశితార్థానికి రెడీ అవుతున్నట్టు అఫీషియల్గా ప్రకటించేశాడు. సోమవారం తన ట్విట్టర్ పేజ్పై వితికా షేరుతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన వరుణ్.. డిసెంబర్ 7వ తేదీన నిశ్చితార్థం జరగనున్నట్టు ప్రకటించాడు.

హ్యాపీడేస్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న వరుణ్ సందేశ్, తరువాత కొత్త బంగారులోకం సినిమాతో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్కు దగ్గరవుతున్నాడనుకున్న సమయంలో వరుస ఫ్లాప్లతో డీలా పడిపోయాడు. ప్రస్తుతం ఉదయం, ట్విస్ట్ సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈ యంగ్ హీరో.. తనతో 'పడ్డానండీ ప్రేమలో మరి' సినిమాలో కలిసి నటించిన వితికా షేరును పెళ్లాడనున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement