
వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నింద. రాజేశ్ జగన్నాధం దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరుణ్‌కు హిట్టు వచ్చి చాలాకాలమే అవుతోంది. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆరాటపడుతున్నాడు. భర్త విజయం కోసం వితికా సైతం ఎదురుచూస్తోంది.
మా ఆయన కోసం వచ్చా
నింద ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం (జూన్ 16) జరిగింది. ఈ కార్యక్రమంలో వరుణ్ సందేశ్ సతీమణి, హీరోయిన్ వితికా షెరు ఎమోషనలైంది. 'సందేశ్ సినిమా ఫంక్షన్స్‌కు నేను రానని చెప్పేదాన్ని. చాలారోజుల తర్వాత మా ఆయన కోసం ఈ ఈవెంట్‌కు రావాలనిపించింది. నింద సినిమా కోసం సందేశ్ ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఆ విశేషాలన్నీ రోజూ ఇంటికొచ్చి చెప్తుండేవాడు. అయితే చాలామంది రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు.
అవకాశాలు రావట్లేదు
మీరు చాలా ఫెయిల్యూర్స్ చూశారు కదా.. నటుడిగా ఫెయిలయ్యారు. అవకాశాలు కూడా రావడం లేదు అని మాట్లాడుతున్నారట! వరుణ్ నటుడిగా ఎన్నడూ ఫెయిల్ అవలేదు. అతడు ఫెయిల్యూర్ యాక్టర్ కాదు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి గత 17 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
వాళ్లు మాత్రమే ఫెయిల్యూర్ యాక్టర్స్
ఎవరైతే ఇక సినిమాలు వద్దనుకుని అన్నీ సర్దేసుకుని వెళ్లిపోతారో వాళ్లు మాత్రమే ఫెయిల్యూర్ యాక్టర్స్. వరుణ్ సినిమాలు చేస్తున్నాడు, మున్ముందు కూడా చేస్తూనే ఉంటాడు. తనకు మంచి అవకాశాలు ఇస్తున్న దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. ఏ యాక్టర్ అయినా సక్సెస్ కోసమే కష్టపడతారు. వరుణ్ కూడా అంతే! ఏదో ఒకరోజు హిట్టు కొడతాడు అని చెప్పుకొచ్చింది.
చదవండి: బాహుబలి పోస్టర్‌ను రీక్రియేట్ చేసిన స్టార్..
ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!
Comments
Please login to add a commentAdd a comment