Nindha
-
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వరుణ్ సందేశ్.. బాక్సాఫీస్ వద్ద జోరు!
వరుణ్ సందేశ్, అన్నీ, శ్రేయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం నింద. ఈ సినిమాను రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 21న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ తనలోని కొత్త కోణాన్ని చూపించి నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమా వరుణ్‌కు మంచి కమ్‌బ్యాక్ అవుతుందని ఆడియెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన వరుణ్ సందేశ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వారంలో రిలీజ్ అయిన అన్ని చిత్రాల్లోకెల్లా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. వరుణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఈ వీకెండ్లో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవనుంది. కాగా.. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ముఖ్య పాత్రలు పోషించారు. -
'నింద' సినిమా రివ్యూ
అప్పుడెప్పుడు 'హ్యాపీడేస్', 'కొత్త బంగారు లోకం' సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత సరైన మూవీస్ చేయలేకపోయాడు. ఓ దశలో పూర్తిగా యాక్టింగ్‌కే దూరమైపోయాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 'నింద' అనే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌తో ఇప్పుడు థియేటర్లలోకి వచ్చాడు. మరి ఈ మూవీ ఎలా ఉంది? వరుణ్ సందేశ్‌కి కమ్ బ్యాక్‌గా నిలిచిందా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?)కథేంటి?కాండ్రకోట అనే ఊరిలో ముంజు అనే అమ్మాయిని బాలరాజు (ఛత్రపతి శేఖర్) అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఉరిశిక్ష విధిస్తారు. అయితే ఈ తీర్పు ఇచ్చిన జడ్జి సత్యానంద్ (తనికెళ్ల భరణి) మాత్రం.. ఈ కేసులో సరైన తీర్పు ఇవ్వలేకపోయానని బాధతోనే కన్నుమూస్తారు. దీంతో ఈ కేసులో అసలైన నిందితుడు ఎవరో తెలుసుకోవాలని జడ్జి కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) ఫిక్స్ అవుతాడు. అలా ఓ ఆరుగురు వ్యక్తుల్ని కిడ్నాప్ చేసేసరికి అసలు నిజాలు బయటపడతాయి. ఇంతకీ వివేక్ ఏం తెలుసుకున్నాడు? 'నింద' పడిన బాలరాజుకి ఉరిశిక్ష పడకుండా అడ్డుకోగలిగాడా లేదా అనేది స్టోరీ.ఎలా ఉందంటే?చేయని నేరానికి జైలుకెళ్లడం, ఏళ్ల పాటు శిక్ష అనుభవించడం, పుణ్య కాలం పూర్తయిన తర్వాత ఇతడు నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వడం, ఆ తర్వాత బయటకు రావడం.. ఇలాంటి ఘటనలు మనం అప్పుడప్పుడు పేపర్, న్యూస్‌లో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తీసుకుని చేసిన సినిమానే 'నింద'.ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ అయ్యే సీన్‌తో సినిమా మొదలవుతుంది. వీళ్లలో ఎస్సై, ప్రభుత్వ డాక్టర్, లాయర్, పనోడు, ఆవారా, కానిస్టేబుల్ ఉంటారు. ఓ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఈ ఆరుగురి నుంచి మంజు హత్య కేసులో నిజం రాబట్టాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే భయపెట్టి బెదిరిస్తుంటాడు. అయితే ఈ సీన్స్ ఇంట్రెస్ట్ కలిగించాలి. కానీ సాగదీత వల్ల ఇదంతా బోరింగ్ అనిపిస్తుంది. జైల్లో ఉన్న బాలరాజుని వివేక్ కలిసే సీన్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)సెకండాఫ్ మాత్రం ఉన్నంతలో కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. బాలరాజు, మంజు ఎవరు? వాళ్ల బ్యాక్ స్టోరీ ఏంటి? కిడ్నాప్ అయిన ఆరుగురికి ఈ కేసుకి సంబంధమేంటి? అనేది ఉంటుంది. అయితే రెగ్యులర్‌గా థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్లకు సెకండాఫ్ మొదలైన కాసేపటికే హత్య చేసిందెవరో అర్థమైపోతుంది. కానీ క్లైమాక్స్‌లో మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చి దర్శకుడు ముగించడం కాస్త బాగుంది.తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదనే అనే స్టోరీ లైన్ బాగున్నప్పటికీ.. దాన్ని ఇంట్రెస్టింగ్గా డీల్ చేసే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. దీంతో రెండు గంటల సినిమా కూడా అక్కడక్కడ సాగదీతగా అనిపిస్తుంది. కాకపోతే కమర్షియల్ వాసనలు ఎక్కడ లేకుండా స్ట్రెయిట్‌గా కథ చెప్పడం మాత్రం రిలీఫ్.ఎవరెలా చేశారు?లవర్ బాయ్ పాత్రలతో మనకు బాగా తెలిసిన వరుణ్ సందేశ్.. ఇందులో వివేక్ అనే మానవ హక్కుల కమీషనర్ ఉద్యోగిగా సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బాలరాజుగా చేసిన ఛత్రపతి శేఖర్, మంజుగా చేసిన మధు బాగా చేశారు. కిడ్నాప్ అయిన ఆరుగురు కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించారు. టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాలో ఉన్నది తక్కువ లొకేషన్స్. ఉన్నంతలో వాటిని బాగానే క్యాప్చర్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నప్పటికీ కొన్నిచోట్ల దీని వల్ల డైలాగ్స్ సరిగా వినపడలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే 'నింద' ఓ డీసెంట్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంతే. మరీ అంత సూపర్ అయితే కాదు!-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్(ఇదీ చదవండి: 'కల్కి' మరో వీడియో.. స్టోరీని దాదాపు చెప్పేసిన డైరెక్టర్!) -
ఇక డైరెక్షన్పైనే ఫోకస్
‘‘మలయాళ సినిమాలు చూసి ఇలాంటి చిత్రాలు మన వద్దకు ఎందుకు రావడం లేదని తెలుగు ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, మా ‘నింద’ చూశాక ‘బాగా తీశారు.. మన వద్ద కూడా మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తున్నాయి’ అనుకుంటారు. ఒక్క మాటలో చె΄్పాలంటే ‘నింద’ అందరికీ నచ్చే చిత్రం అవుతుంది’’ అని చిత్ర దర్శక–నిర్మాత రాజేశ్ జగన్నాథం అన్నారు. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చిత్రం ‘నింద’. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజేశ్ జగన్నాథం మాట్లాడుతూ– ‘‘మాది నర్సాపురం. నెల్లూరు, చెన్నై, యూఎస్‌లో చదువుకుని, అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండి΄ోయాను. ఫిల్మ్ మేకింగ్‌లో కోర్సులు చేసి, అక్కడే షార్ట్ ఫిలింస్ చేశాను. వాస్తవ ఘటనలు, కల్పిత సన్నివేశాలతో ‘నింద’ స్క్రిప్ట్ రాశాను. ఈ కథ వరుణ్ సందేశ్‌కి మంచి కమ్ బ్యాక్‌లా ఉంటుందని భావించి ముందుకెళ్లాం. కథపై ఉన్న నమ్మకంతోనే నేనే నిర్మించాను. ఈ మూవీలో వరుణ్ సందేశ్ చాలా కొత్తగా కనిపిస్తాడు. ‘నింద’ తర్వాత ఎక్కువగా దర్శకత్వం మీదే ఫోకస్ పెడతాను’’ అన్నారు. -
‘నింద’ చూశాక ఆ ఫీలింగ్ కలుగుతుంది: రాజేష్ జగన్నాథం
మలయాళ సినిమాలు చూసి..మన దగ్గర(టాలీవుడ) ఇలాంటి సినిమాలు ఎందుకు రావాని అంతా అనుకుంటారు. ఇప్పుడిప్పుడే మన దగ్గర కూడా మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తున్నాయి. ‘నింద’ కూడా అలాంటి చిత్రమే. సినిమా చూశాక ప్రతి ప్రేక్షకుడు ‘ఇదేదో బాగానే ఉందే..బాగా తీశారు’ అనే ఫీలింగ్ కలుగుతుంది. అందరికి నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’అన్నారు దర్శక నిర్మాత రాజేష్ జగన్నాథం . ఆయన తొలిసారి దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘నింద’. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సందర్భంగా తాజాగా రాజేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫిల్మ్ మేకింగ్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌తో యూఎస్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చాను. నింద కథ వరుణ్‌కు చెప్పడంతో నచ్చి.. వెంటనే ఓకే చేశాడు. నిర్మాత కోసం ప్రయత్నించాం. కానీ దొరకలేదు. కథపై ఉన్న నమ్మకంతో చివరకు నేనే నిర్మించాను. టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంటుంది. పీఎస్ వినోద్ గారి వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన రమిజ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పని చేశారు. విశాల్ చంద్రశేఖర్ వద్ద పని చేసిన సాంతు ఓంకార్ మంచి ఆర్ఆర్, మ్యూజిక్‌ను ఇచ్చారు.సినిమాలోని ప్రతీ ఒక్క కారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత నెక్ట్స్ మూవీ అప్డేట్స్ ఇస్తాను.ఇకపై ఎక్కువగా దర్శకత్వం మీదనే ఫోకస్ చేస్తాను’ అన్నారు. -
తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేరు: వరుణ్ సందేశ్
‘‘నింద’ చిత్రంలోని నా పాత్రకి, నిజ జీవితంలోని నాకు అస్సలు పోలిక ఉండదు. నేను సరదాగా ఉంటాను. సీరి యస్‌గా ఉండను. ‘నింద’లో నా మనస్తత్వానికి భిన్నమైన పాత్ర చేశాను. ఈ చిత్రంలో ఎంతో సెటిల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా కనిపిస్తాను’’ అని వరుణ్ సందేశ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘నింద’. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం వరుణ్ సందేశ్ మీడియాతో పంచుకున్న విశేషాలు.⇒ నా కెరీర్లో ఒకే తరహా సినిమాలు చేస్తూ ఉండటంతో నాకే బోరింగ్‌గా అనిపించింది. దీంతో సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుని యూఎస్ వెళ్లాను. అక్కడ రాజేశ్‌గారు ‘నింద’ కథ చెప్పారు. నచ్చడంతో ఈ సినిమా చేశాను. ‘కానిస్టేబుల్’ సినిమా షూటింగ్లో నా కాలికి గాయమైంది. అయితే రాజేశ్‌గారి డెడికేషన్ చూసి రిస్క్ చేసి ఆ గాయంతోనే ‘నింద’ షూటింగ్లో పాల్గొన్నాను. ⇒సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్లో ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. ‘నింద’ స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. నటీనటుల్లో ఎవరికీ ఈ మూవీ పూర్తి కథను చెప్పలేదు రాజేశ్‌గారు. దీంతో ఆర్టిస్టుల్లోనూ ఈ సినిమాపై ఓ క్యూరియాసిటీ పెరిగింది. కథ పరంగా అసలు నేరస్థుడు ఎవరనే విషయాన్ని నేను కూడా చెప్పలేకపోయాను. ⇒మా దర్శక–నిర్మాత రాజేశ్‌గారి ఫ్రెండ్ అమెరికాలో ‘నింద’ని రిలీజ్ చేస్తున్నారు. ఆయన మైత్రీ మూవీస్ నవీన్‌గారికి తెలుసు. అలా మైత్రీ శశిగారు మా సినిమా చూడటం, నచ్చడంతో నైజాంలో విడుదల చేస్తున్నారు. ‘నింద’ తర్వాత ఓ క్రేజీ ్రపాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాను. అలాగే ‘కానిస్టేబుల్’ అనే సినిమాలో నటిస్తున్నాను. -
‘నింద’ స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది: వరుణ్ సందేశ్
సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్లలో ఎన్నో సినిమాలు వచ్చాయి. నింద కూడా అలాంటి కథే. కానీ స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు, ఊహించలేరు’అని అన్నారు హీరో వరుణ్ సందేశ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘నింద’. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్ సందేశ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ రొటీన్ సినిమాలు చేస్తూ ఉండటంతో నాకే బోరింగ్‌గా అనిపించింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని యూఎస్ వెళ్లాను. ఆ టైంలోనే రాజేష్ గారు ఈ నింద కథను చెప్పారు. విన్న వెంటనే ఎంతో నచ్చింది. ఈ సినిమా చేసేద్దామని అన్నాను.→ నిందలో నా పాత్రకి, నిజ జీవితంలోని నా పాత్రకి అస్సలు పోలిక ఉండదు. నేను బయట జాలీగా, చిల్‌గా ఉంటాను. నేను ఎప్పుడూ కూడా సీరియస్‌గా ఉండను. కానీ ఈ చిత్రంలో నా వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి పూర్తిగా భిన్నమైన పాత్రను పోషించాను. ఈ చిత్రంలో ఎంతో సెటిల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా కనిపిస్తాను.→ ‘నింద’ లాంటి చిత్రాలకు ఆర్ఆర్, కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్. మాకు మంచి టెక్నీషియన్లు దొరికారు. సాంతు ఓంకార్ తన ఆర్ఆర్, మ్యూజిక్‌తో నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. రమీజ్ కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది.→ మా దర్శక నిర్మాత రాజేష్ గారి ఫ్రెండ్ యూఎస్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఆయన మైత్రీ నవీన్ గారికి తెలుసు. అలా మైత్రీ శశి గారు మా సినిమాను చూశారు. మూవీ నచ్చితేనే రిలీజ్ చేస్తామని శశిగారు అన్నారు. ఆయన చిత్రాన్ని చూశారు. బాగా నచ్చింది. అందుకే మా సినిమాను రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు.→ నింద తరువాత ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాను. నిందలోని కారెక్టర్‌కు ఆ సినిమాలోని పాత్రకు అస్సలు పోలిక ఉండదు. అది జూలైలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఆగస్ట్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. అది కాకుండా కానిస్టేబుల్ అనే ఓ సినిమాను కూడా చేస్తున్నాను. -
నా జీవితంలో ఆ 105 రోజులు మర్చిపోలేను: వరుణ్ సందేశ్
హ్యాపీడేస్, కొత్త బంగారులోకం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరయ్యాడు వరుణ్ సందేశ్. వరుస హిట్లు పడడంతో స్టార్ హీరో అవ్వడం పక్కా అని అనుకున్నారంతా. కానీ ఆ రెండు తప్ప వరుణ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో అవకాశాలు సైతం తగ్గిపోయాయి. ఒకనొక దశలో వరుణ్ సందేశ్ అనే హీరో ఉన్నాడనే విషయాన్ని తెలుగు ప్రేక్షకులు మర్చిపోయారు. కానీ 2019లో బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా వరుణ్ మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ బుల్లితెర బిగ్ రియాల్టీ షోలో భార్య వితికాతో కలిసి పాల్గొని తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. దాదాపు 105 రోజుల వరకు బిగ్‌బాస్ హౌస్‌లోనే ఉన్నాడు. తాజాగా తన బిగ్‌బాస్ జర్నీ గురించి చెబుతూ వరుణ్ ఎమోషనల్ అయ్యాడు.‘బిగ్‌బాస్ షో నా కెరీర్ పరంగా ఎంత హెల్ప్ అయిందని చెప్పలేను కానీ.. పర్సనల్‌గా, ఫైనాల్షియల్గా చాలా ఉపయోగపడింది. ఈ షోలో పాల్గొనకంటే ముందు జనాలకు నాపై ఓ రకమైన అభిప్రాయం ఉండేది. నాకు యాటిట్యూడ్ ఎక్కువైనని, ప్లే బాయ్ అని ఏవోవో అనుకునేవాళ్లు. కానీ బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత నేను ఎలాంటివాడినో జనాలకు అర్థమైంది. ఆ షో నుంచి బయటకు వచ్చాకా చాలా మెసేజ్‌లు వచ్చాయి. వాళ్లు చూపించిన ప్రేమ మరచిపోలేనిది. హ్యాపీడేస్, కొత్త బంగారులోకం తర్వాత కూడా అంత ప్రేమను నేను చూడలేదు. ప్రజలకు నేను పర్సనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేసింది బిగ్‌బాస్ షోనే. నా లైఫ్‌లో ఆ 105 రోజుల ఎక్స్పీరియస్ మర్చిపోలేను’ అని వరుణ్ చెప్పుకొచ్చాడు. వరుణ్ నటించిన తాజా చిత్రం ‘నింద’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నింద మైలురాయిగా నిలవాలి: నిఖిల్ సిద్ధార్థ్
‘‘నింద’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. మంచి కథతో పాటు చాలా క్వాలిటీతో తెరకెక్కించారు. నా కెరీర్లో ‘స్వామి రారా, కార్తికేయ’ సినిమాల్లా వరుణ్ సందేశ్ కెరీర్లో ‘నింద’ ఓ మైలురాయిగా నిలవాలి. ఈ చిత్రానికి ప్రేక్షకులు పెద్ద విజయం అందించాలి’’ అని హీరో నిఖిల్ సిద్ధార్థ్ అన్నారు. వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నింద’. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిఖిల్ సిద్ధార్థ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘నింద’ నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం. రాజేశ్‌గారు ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా నిర్మించి, దర్శకత్వం వహించారు. మా చిత్రాన్ని మైత్రీ మూవీస్ వారు రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. నా కెరీర్లో ‘హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది ఈవేళ’ చిత్రాల తర్వాత ‘నింద’ నిలుస్తుందని గర్వంగా చెప్పుకోగలను’’ అన్నారు. ‘‘నింద’ మూవీ అవుట్‌పుట్ నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. మా సినిమాతో వరుణ్ మంచి కమ్ బ్యాక్ ఇస్తాడు’’ అన్నారు రాజేశ్ జగన్నాథం. -
నా భర్త ఫెయిల్యూర్ హీరో కాదు: వితికా షెరు
వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నింద. రాజేశ్ జగన్నాధం దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరుణ్‌కు హిట్టు వచ్చి చాలాకాలమే అవుతోంది. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆరాటపడుతున్నాడు. భర్త విజయం కోసం వితికా సైతం ఎదురుచూస్తోంది. మా ఆయన కోసం వచ్చానింద ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం (జూన్ 16) జరిగింది. ఈ కార్యక్రమంలో వరుణ్ సందేశ్ సతీమణి, హీరోయిన్ వితికా షెరు ఎమోషనలైంది. 'సందేశ్ సినిమా ఫంక్షన్స్‌కు నేను రానని చెప్పేదాన్ని. చాలారోజుల తర్వాత మా ఆయన కోసం ఈ ఈవెంట్‌కు రావాలనిపించింది. నింద సినిమా కోసం సందేశ్ ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఆ విశేషాలన్నీ రోజూ ఇంటికొచ్చి చెప్తుండేవాడు. అయితే చాలామంది రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అవకాశాలు రావట్లేదుమీరు చాలా ఫెయిల్యూర్స్ చూశారు కదా.. నటుడిగా ఫెయిలయ్యారు. అవకాశాలు కూడా రావడం లేదు అని మాట్లాడుతున్నారట! వరుణ్ నటుడిగా ఎన్నడూ ఫెయిల్ అవలేదు. అతడు ఫెయిల్యూర్ యాక్టర్ కాదు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి గత 17 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. వాళ్లు మాత్రమే ఫెయిల్యూర్ యాక్టర్స్ఎవరైతే ఇక సినిమాలు వద్దనుకుని అన్నీ సర్దేసుకుని వెళ్లిపోతారో వాళ్లు మాత్రమే ఫెయిల్యూర్ యాక్టర్స్. వరుణ్ సినిమాలు చేస్తున్నాడు, మున్ముందు కూడా చేస్తూనే ఉంటాడు. తనకు మంచి అవకాశాలు ఇస్తున్న దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. ఏ యాక్టర్ అయినా సక్సెస్ కోసమే కష్టపడతారు. వరుణ్ కూడా అంతే! ఏదో ఒకరోజు హిట్టు కొడతాడు అని చెప్పుకొచ్చింది. చదవండి: బాహుబలి పోస్టర్‌ను రీక్రియేట్ చేసిన స్టార్.. ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్! -
థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో 'నింద' ట్రైలర్.. మీరు చూశారా?
యంగ్ హీరో వరుణ్ సందేశ్ లేటెస్ట్ మూవీ 'నింద'. రాజేశ్ జగన్నాధం దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. జూన్ 21న థియేటర్లలోకి రాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తీశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నైజాంలో ఈ మూవీని రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ టాలీవుడ్ హీరోయిన్ని గుర్తుపట్టారా.. ఇలా తయారైందేంటి?)అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన కేసు అనే పాయింట్.. అసలు నేరస్థుడు ఎవరు? అని హీరో చేసే ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఇందులో శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు హీరోయిన్లుగా నటించారు. శ్రీరామ సిద్ధార్థ కృష్ణ కీలక పాత్ర పోషించారు. మరి ఈ మూవీతో నైనా వరుణ్ సందేశ్ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి?(ఇదీ చదవండి: పెళ్లి వాయిదా వేసుకున్న మరగుజ్జు సింగర్.. కారణం అదే) -
స్కూల్ పిల్లల చేతుల మీదుగా 'సంకెళ్లు' పాట విడుదల
యువ హీరో వరుణ్ సందేశ్ 'నింద' సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, టీజర్ సినిమా ఆకట్టుకోగా.. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్ ప్రారంభించారు.(ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ ఊరమాస్.. ఏకంగా!)ఈ క్రమంలోనే గానామాస్ స్పెషల్ స్కూల్‌కి చెందిన పిల్లలు ఈ పాటను విడుదల చేశారు. ఇది ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని త్వరలో ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి) -
కాండ్రకోటలో ఏం జరిగింది?
‘జీవితంలో కొన్నిసార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు’ (తనికెళ్ల భరణి) అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘నింద’ సినిమా టీజర్. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ సినిమాను రాజేశ్ జగన్నాథం స్వీయదర్శకత్వంలో నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను హీరో నవీన్ చంద్ర విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.లవ్, మర్డర్ మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలు ఈ సినిమాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాండ్రకోట మిస్టరీ అంటూ వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంతు ఓంకార్ మ్యూజిక్ డైరెక్టర్. -
Nindha Teaser : ఆసక్తి రేపుతున్న ‘నింద’ టీజర్
వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నింద’. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విలక్షణ నటుడు నవీన్ చంద్ర విడుదల చేశారు. టీజర్ విడుదల చేసిన అనంతరం చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. టీజర్ బాగుందని టీంను మెచ్చుకున్నారు.‘జీవితంలో కొన్ని సార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు’.. అనే డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్లో ఎన్నో కోణాలున్నాయి. అందమైన ప్రేమ కథ కనిపిస్తోంది. దాంతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ టీజర్‌లోని విజువల్స్ ఎంతో న్యాచురల్‌గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ అయితే మూడ్‌కు తగ్గట్టుగా సాగింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను ఫీల్ అయ్యేలా నేపథ్య సంగీతం సాగింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతూన్నారు.