కాండ్రకోటలో ఏం జరిగింది? | Varun Sandesh Ninda Movie Teaser | Sakshi
Sakshi News home page

కాండ్రకోటలో ఏం జరిగింది?

Published Fri, May 17 2024 6:15 AM | Last Updated on Fri, May 17 2024 6:15 AM

Varun Sandesh Ninda Movie Teaser

‘జీవితంలో కొన్నిసార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు’ (తనికెళ్ల భరణి) అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘నింద’ సినిమా టీజర్‌. వరుణ్‌ సందేశ్‌ హీరోగా నటించిన ఈ సినిమాను రాజేశ్‌ జగన్నాథం స్వీయదర్శకత్వంలో నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను హీరో నవీన్‌ చంద్ర విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

లవ్, మర్డర్‌ మిస్టరీ, థ్రిల్లింగ్‌ అంశాలు ఈ సినిమాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాండ్రకోట మిస్టరీ అంటూ వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లుగా చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంతు ఓంకార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement