మలయాళ సినిమాలు చూసి..మన దగ్గర(టాలీవుడ) ఇలాంటి సినిమాలు ఎందుకు రావాని అంతా అనుకుంటారు. ఇప్పుడిప్పుడే మన దగ్గర కూడా మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తున్నాయి. ‘నింద’ కూడా అలాంటి చిత్రమే. సినిమా చూశాక ప్రతి ప్రేక్షకుడు ‘ఇదేదో బాగానే ఉందే..బాగా తీశారు’ అనే ఫీలింగ్ కలుగుతుంది. అందరికి నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’అన్నారు దర్శక నిర్మాత రాజేష్ జగన్నాథం .
ఆయన తొలిసారి దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘నింద’. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సందర్భంగా తాజాగా రాజేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫిల్మ్ మేకింగ్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌తో యూఎస్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చాను. నింద కథ వరుణ్‌కు చెప్పడంతో నచ్చి.. వెంటనే ఓకే చేశాడు. నిర్మాత కోసం ప్రయత్నించాం. కానీ దొరకలేదు. కథపై ఉన్న నమ్మకంతో చివరకు నేనే నిర్మించాను.
టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంటుంది. పీఎస్ వినోద్ గారి వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన రమిజ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పని చేశారు. విశాల్ చంద్రశేఖర్ వద్ద పని చేసిన సాంతు ఓంకార్ మంచి ఆర్ఆర్, మ్యూజిక్‌ను ఇచ్చారు.సినిమాలోని ప్రతీ ఒక్క కారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత నెక్ట్స్ మూవీ అప్‌డేట్స్ ఇస్తాను.ఇకపై ఎక్కువగా దర్శకత్వం మీదనే ఫోకస్ చేస్తాను’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment